ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు మంత్రులతో నాలోచించుట
నక్కడ రావణుండఖిలమంత్రులను
దక్కక రావించి తగవారి కనియె:[వా.రా. సర్గ 6]
“మంత్రకోవిదులార! మర్కటుండొకఁడు
జంత్రంబు చూపిన చందాన వచ్చి
లంకిణిఁజంపి నా లంక శోధించి
పంకజానన సీతఁబరికించి కాంచి
109నా వనంబగలించి 110నా సుతుఁజంపి
111నా విక్రమము మీఱి112నా పురిఁగాల్చి
పెక్కున నసురులఁబెక్కండ్రఁజంపి
చిక్కియు మనచేతఁ113జెచ్చెరఁబోయె;
నదె తెచ్చె వానరుఁడా రాఘవులను
బదిలుఁడై యంబుధిప్రాంతంబునకును.
ఇనకులుఁ డీ యబ్ధి యింకించియైనఁ
దన సేనఁబంచి యుద్ధతిఁగట్టియైన
దాటివచ్చిన మఱి తప్పుఁగార్యంబు.
దాటకమున్నె మీ తజ్‌జ్ఞత మెఱసి
‘యిది కార్య’ మని చెప్పుఁడిందఱు114ఁగూడి
యదియెచేయుదము మేలగు తెఱంగైన.”
నని యడిగిన రాక్షసాధీశుతోడ
ననిరి మంత్రులు గడునల్పజ్ఞులగుచు:
“దివ్యులకైనను దృష్టింపరాని
దివ్యాస్త్రములు పెక్కు దేవరయందు.[వా.రా. సర్గ 7, 8]
గ్రక్కన విషములు గ్రక్కఁగఁబట్టి
యుక్కడఁగించితి వురగాధిపతిని.
రుద్రునిసఖుఁగుబేరుని మదంబడఁచి
భద్రకంబైన పుష్పకముఁ గైకొంటి.
మయునిఁబ్రఖ్యా115తిని మర్దించి యతని
ప్రియతనూభవఁబెండ్లి ప్రీతితో నైతి.
వంతకు నెక్కుడౌనంతకుఁబట్టి
యంతకునకు నీవె యంతకుఁడైతి.
వారని116బలుఁడైన వరుణుని యాత్మ
నీరు గావించితి నిర్జరారాతి.
చక్రవర్తులరాజ్యచక్రముల్‌ ద్రిప్పి
చక్రముల్‌ గొంటి రాక్షసచక్రవర్తి.
శూలాయుధునిఁగిట్టి శూరత మెఱసి
మూలకుఁద్రోయవా ముక్కంటి యనక.
వాసవు నన్నాక వాసులతోడ
వాసి దప్పింపవా వాసికి నెక్కి.
వేఁడికిఁ బలుమాఱు వేఁడిమిఁజూపి
వేఁడిమిఁబాపవా వేఁడికో ననలు.
బలిమినిఁగోణాధిపతి దైత్యనాథు
నలిగి మర్దింపవా యధికదర్పమున.
నిలిచిన117చోటను నిలువంగనీక
పలుమాఱుఁబవనుఁదుప్పలఁదూలవైతు.
మనుజుఁడాతఁడు; నీవు మనుజాశనుఁడవు;
మనుజుండు నీ చేత మనుటేలకలుగు?
నీశ్వరుఁగూర్చి మహేశ్వరక్రతువు
శాశ్వతకీర్తిమై సల్పె నీ సుతుఁడు;
సాంద్రానుమోదియై 118సఫలత నొంది
యింద్రుని భంజించి యింద్రజిత్తయ్యె.
నా యింద్రుఁజెఱఁబెట్ట నజుఁడు వేఁడుటయు
నా యజునకు119నిచ్చె నా యింద్రజిత్తు.
ఆతఁడు చాలఁడే యాలంబు గెల్వ?
దైతేయకులనాథ! తగదు చింతింప.”

  1. ↑తన
  2. ↑తన
  3. ↑తన
  4. ↑తన
  5. ↑జిక్కకపో
  6. ↑లెస్స
  7. ↑తుని
  8. ↑బలియుని
  9. ↑కాలను
  10. ↑చలమింత మెఱసి
  11. ↑విడ్వఁడా
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )