| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“విను కుంభకర్ణ! నీ విన నిది యొకటి; జనపదంబున కేఁగి చయ్యన నేను రాము152నిదేవి ధరాసుత సీతఁ గామించి తెచ్చితిఁ గంజదళాక్షి. మఱి మొన్న నొక హనుమంతుఁడన్క్రోఁతి పఱతెంచి సీతకుఁబరిణామ మొసగి ‘దేవి! నీ పతి రామదేవుఁడు వచ్చు.’ నావుడు మదిలోన నమ్మి 153యా సీత యున్నది. 154యెంతయు నుద్దండవృత్తి నన్నరుం డయ్యబ్ధి కవ్వల విడిసె. వనములలోఁ గలవనచరులెల్లఁ బెనుమూఁకగాఁగూడఁబెట్టి యేతెంచెఁ. జెచ్చెర నని చేసి సీతఁగొంపోవ వచ్చినాఁడతఁడు. తా వచ్చుఁగాకేమి? సురనాథసురలను స్రుక్కించినాఁడ; హరుఁడున్నకైలాస మగలించినాఁడ; శంభుచేఁజంద్రహాసంబుఁగొన్నాఁడ; నంభోజభవు వరం బడిగికొన్నాఁడ; దానిపై నీ లావు తగిలియున్నాఁడ; మానవుడే నన్ను మర్దించువాఁడు? రాముఁడెన్నఁడు గెల్చురణములో నన్నుఁ! గోమలి నెన్నఁడు గొనిపోవు నతఁడు?” ననవుడుఁగోపించి యా కుంభకర్ణుఁ డనియె రావణుతోడ నందఱు వినఁగ: “రాము వంచించి యా రామునిదేవి నేమఱియుండంగ నేచి యుద్వృత్తిఁ దెత్తువే? యిదియేల తెచ్చితి కడఁగి? చిత్తంబులో నీతిఁ జింతింపవైతి; ధర్మమార్గము నీవు తలపోయవైతి; వర్మిలిఁగులమెల్ల నణఁగఁజేసితివి. సీతఁదెచ్చినయప్డె చెడియె నీ లంక. యే తెఱంగున నైన నిదియె నిశ్చయము. ఇట్టననేల? యా యినకులేశ్వరుని నెట్టన శరములు నెఱిఁగాఁడకుండ బ్రదికివచ్చితి నీదు భాగ్యంబుకతన. నిది మేలు కీడని యెన్నంగనేల? పోవచ్చునే యింకఁబూనెదు155గాక! రావణ! యింతకార్యము చక్కఁబెట్ట నా మీఁదఁబడియె; వానరుల రాఘవుల నేమియుఁదలఁపక యింక సుఖింపు.” మని పల్కుటయును మహాపార్శ్వుఁడనియె: “ఘన156మైన యెల్లలోకములకు నీవ పతివట! యా సీత బలిమిని బట్టి రతి సల్పనేరవా, రాక్షసాధీశ!” యనవుడుఁజిత్తంబునందు మోదించి దనుజాధినాథుఁడాతనిఁజూచి పలికె: “విను మహాపార్శ్వ! యే వేధకొల్వునకుఁ జనుచోటఁబుంజికస్థలయను నాతి వలు157వూడిపడఁబట్టి వడిఁగుదియించి బలిమి భోగించితిఁబైఁబడి తొల్లి. యా మేరలన్నియు నబ్జజుం డెఱిఁగి నా మీఁదఁ గోపించి నయ మింత లేక: “యోరి రాక్షస! కడు నుచితంబుఁదక్కి నారీజనులయెడ నయ మింత లేక బలిమి నెవ్వతెనైనఁబట్టి భోగించి నలఁదురఁగాఁజేయునపుడ నీ తలలు వారక యిల నూఱువ్రయ్యలై రాలుఁ బోరోరి!” యనుచు శప్తునిఁజేసి విడిచె. నది కారణంబుగా నంగనాజనుల హృదయంబు158గరఁగక 159యే నెందుఁ160గలయ. నా లావు గొనక వానరులతోఁగూడి యీలంకపై రాముఁ161డేతెంచుటెల్ల నిద్రించు సింహంబు నెఱి మేలుకొలుపు భద్రదంతావళప్రతతి విధంబ.” యని పల్కుటయు నవ్వి యవ్విభీషణుఁడు దనుజనాథునితోడఁ దగ విన్నవించె:[వా.రా. సర్గ 14] “మొనయునిట్టూర్పులు మ్రోఁగుటగాఁగ ఘనమైన చింతయె గరళంబు గాఁగ దారుణంబైన సీతాకాలసర్ప మే రూపమున నిన్ను నేల పోనిచ్చు నపకీర్తి162యటె; పాప 163మటె; సుఖంబునకు విపరీత164మటె; యిట్టి విధమేల?యుడుగు.” మని యన్నతోఁబల్కి యంతటఁబోక సునిశితంబుగఁబ్రహస్తునిఁజూచి పలికె: “నెఱిపిడుగులఁబోలు నృపునిబాణములు గఱులంట నీదు వక్షము గాఁడునాఁడె యెఱుఁగుదుగాకేల యిట్టట్టుపడెదు. కఱకులాడిన మాడ్కిఁగాదు; మీఁదటను నీ కుంభకర్ణుండు నీ నికుంభుఁడును నీ కుంభుఁడును మఱి యీ మహోదరుఁడు నీ మహాపార్శ్వుండు నీ యింద్రజిత్తు రాముని గెల్చువారా రణంబునను? నేపు చూపక యప్పుడెందుఁబోయెదరు? 165ప్రాపైన తఱి నడ్డపడుదురుగాక! కడఁగి యింద్రుఁడు వచ్చి కాచిన నైనఁ గడు నడ్డపడి 166సురల్ గాచిన నైనఁ గాలాగ్నిరుద్రుండు గాచిన నైనఁ గాలమృత్యువు వచ్చి కాచిన నైన రావణుఁజంపక రామభూపాలుఁ డే విధంబుననైన నేల పోనిచ్చు? దనుజేశుపై విల్లు ధరియించునపుడు మనచేత167సాధ్యుఁడే మనుకులేశ్వరుఁడు? పిడికిట నడఁగునే పేర్చుకాలాగ్ని? పుడిసిట నడఁగునే పొంగారుజలధి? పట్టంగ వచ్చునే పాతాళతలము? గట్టింపవచ్చునే గగనభాగంబు? త్రెంపంగ వచ్చునే దిగ్వితానంబు? త్రుంపంగ వచ్చునే ధూర్జటి168విల్లు? అఱచేత నణఁచిన నణఁగునే సూర్యుఁ డెఱుఁగని మీతోడ నిట్లాడనేల? కడుమూర్ఖు నాకారి కామాతురుండు మడియఁడే మీ యట్టిమంత్రులు గలుగ? నా బుద్ధి వినునె యీ నాకేశవైరి మీ బుద్ధిఁజెడుఁగాక మిక్కిలి క్రొవ్వి?” యని మొగమోడక యాడఁబ్రహస్తుఁ డనువాఁడు169గనుఁగొని యా విభీషణుని: “నురగులతోఁబోరి యోడ మెన్నఁడును సురలతోఁబోరాడి స్రుక్క మెన్నఁడును; యక్షులతోఁగిట్టి యలయ మెన్నఁడును; రాక్షసావలిచేతఁగ్రాఁగ మెన్నఁడును; నరుఁడైన యా రామనరనాయకునకు దురములో మే మోడుదుమె విభీషణుఁడ? యే చందమున వారి నెఱుఁగుదో 170కాని నీ చేత వింటిమి నేఁ171డిట్టివింత. |