ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఇంద్రజిత్తు తన పరాక్రమమును విభీషణునకుఁ దెల్పుట
దనుజుల లా172వింత తక్కువే?”యనఁగ
ననియె నాగ్రహమెత్తి యా యింద్రజిత్తు[వా.రా. సర్గ 15]
తోరమై పేర్చిన దుర్మదగ్రంథి
యా రాముతమ్ముశరాగ్నిచేఁ గాలఁ
గారణంబట మీఁదఁ గల్గుటఁజేసి
యే రూపమున నీతి నిచ్చలో నిడక:
“విను విభీషణ! నీవు వెఱచెదుగాక!
మనయందు రాక్షసమహిమ నూహింప
హీనుఁడైనను జాలు నింతటిపనికి
మానక రామలక్ష్మణుల నిర్జింప.
మూఁడులోకంబు లిమ్ముల నేలువాని
వాఁడివజ్రము గల వాసవుఁ173బట్టి
చెఱఁబెట్టనా? వాని సితకరిఁబట్టి
విఱువనా కొమ్ములు? వింతయే నాకు?
ననలునిఁగారించి యంతకు నొంచి
దనుజు వారించి యాతలివాని నొడిచి
గాలిఁదూలించి యక్ష174పుని మర్దించి
శూలి నోడించి నిష్ఠురత వాటించి
యేచిన నాచేత నీ నరుల్‌ చావ
రా? చెప్పె దుబ్బి వారలఁబెద్దసేసి!
కలఁతునా సప్తసాగరములు సొచ్చి;
మలపుదునా మేరుమందరంబులను;
దాటుదునా ధరాతలమెల్లఁ గడవ;
మీటుదునా నేల మింటితో నంట;
వంతునా జగములు; వనచరకోటి
ముంతునా బెగడొంద మున్నీటిలోనఁ;
బుడమి మోచిన నాగపుంగవుఁబట్టి
పిడుతునా విషమెల్లఁబిచ్చిలివోవ175;
భూమితో నిప్పుడు భుజశక్తి మెఱసి
ప్రాముదునా చంద్రభానుబింబముల;
వనచరకోటుల వైతునా వట్టి
దినకరబింబంబు దిక్కులు గడవ;
నాలంబులో వానరాలిరక్తములు
గ్రోలింతునా భూతకోటులచేతఁ;
గప్పుదునా యంపగములచే మిన్ను
నిప్పుడమియు దిక్కులిన్నియుఁగూడఁ;
గడునొగ176ల్‌వట్టి యాకసమునఁద్రిప్పి
యడుతునా నేలతో నర్కునిరథముఁ;
బెడచేత లోచేతఁబృథివియు మిన్ను
నడఁతునా పొడిపొడియై రాలిపోవ.
దను177జాధినాథుని తమ్ముఁడ వగుట
నిను నొండనాక మన్నించితిఁగాని
యొరుఁడైన సైఁతునే178యో విభీషణుఁడ!
వెరవిఁడిమాటలు వే యాడ నేల?”

  1. ↑వంత
  2. ↑గిట్టి
  3. ↑కు
  4. ↑నొక్కటఁదుండంబు లొడిసి రాఁదిగిచి, దిక్కరీంద్రుల నీడ్చి తెత్తునా పూని
  5. ↑ల్‌ కరములఁ గబళించిపట్టి, లలమి దిగ్గననేలతోడ
  6. ↑జనాథునికూర్మి
  7. ↑యూరకయుండు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )