“దోయజదళనేత్ర! తొల్లి నారదుఁడు
వాయువుకడ నాగవరులావుఁబొగడి
ఫణిరాజుముందఱఁ బవనుని లావుఁ
బ్రణుతింప వారికిఁబగ సేయుటయును
రాసి లావునకు వారలు మచ్చరించి
“భాసురహేమాద్రి ఫణిరాజు చుట్టి
పట్టంగ దానిఁగంపమువుట్ట వీతు!
నెట్టన నే.” నని నియమించె గాలి.
తన సత్త్వమంతయుఁదగఁబూని శేషుఁ
డనిమిషగిరిఁజుట్టి యసదృశలీల
వేయుఫణంబుల వేశిఖరముల
నాయతభుజశక్తి నంటంగఁ బొదివి
చలమునఁబట్టిన సప్తవాయువులు
వెలయంగఁబవనుండు వీవంగఁదొడఁగె.
శేషుని భేదింపఁ జేకుఱకున్న
భీషణగతి వీచెఁ.బేర్చి వాయువులు.
నా గాలి నచలంబులన్నియు విఱిగె;
నా గాలి భువనంబులన్నియు వణఁకె:
నా గాలి నంబుధులన్నియుఁగలఁగె;
నా గాలి భూతంబులన్నియు నఱచె;
నా గాలిఁ జలియించె నర్కునిరథము;
నా గాలి నూటాడె నఖిలదిక్కులును
గదిసిన.లోకసంకటమెల్లఁ.జూచి
‘యిది మహాపద వచ్చె నిత్తఱి’ననుచు
(‘నిదిమాన్పు’మని సురలెల్లను గూడి
పదిలంబుగాఁగ నా బ్రహ్మను జేరి
ప్రార్థన సేసిన బరవసంబొప్ప)
నర్థిమై బ్రహ్మాదు లచటి కేతెంచి
పవనునిఁ బ్రార్థించి పలుతెఱంగులను
బవనుని ప్రతిన మాన్పఁగలేక పోయి
పరమసాత్త్వికుఁడైన ఫణిరాజుఁగదిసి:
“యురగేంద్ర! నీవైన నోర్వంగవలయు;
మీ మచ్చరంబున మిహిరుండుగూలె;
మీ మచ్చరంబున మేదిని గ్రుంగె;
మీ మచ్చరంబున మితిమీఱె నబ్ధి;
మా మాట లాలించి మమ్ము మన్నించి
గాలిని గెలిపించి కరుణ వాటించి
కేళిమై మమ్ము రక్షింపవే.”యనిన
సురలప్రార్థనకు శేషుఁడు శాంతిఁబొంది
కరువలికిని వీవఁగా నను విచ్చి
యించుక యొకఫణంబెత్తినమఱియు
మించినబలిమి సమీరుండు వీవఁ
.......... వలనొప్ప దక్షిణవార్ధిలోఁబడియె.
నది శృంఖలద్వీపమం దనరారె. నదియ త్రికూటాద్రియనఁ గడుమీఱెఁ.
నచటికి దేవేంద్రుఁ డర్థితో వచ్చి పచరించి రాక్షసబాధకు వెఱచి
వచ్చి యచ్చట దాఁగవచ్చు నటంచుఁ గ్రచ్చర నా విశ్వకర్మ రావించి
మెచ్చైనపురము నిర్మింపు మిచ్చటను చ(చె)చ్చెరననిచెప్పి జరిగిన పిదప
దేవ! యా శృంఖళ (సింహళ)ద్వీపంబునందు దేవేంద్రుపనుపున దేవతాశిల్పి
కరకౌశలమున లంకాపురంబనెడు(నఁగ) పురము నిర్మించె నప్పురవరంబునకుఁ
గోటలే డొప్పు నక్కోటకోటకును వాటమై నాల్గేసి వాకిండ్లు గలవు(డ్లనమరు).
(‘తఱచైనయట్టి’ ఇత్యాదిగా నొక ప్రతి)
గగనంబు ముట్టి చుక్కలు రాయుచుండు. పగరకుఁ జొరరాని బంగారుకోట
యా కోట లోనుగా నట చుట్టియుండు వీకతోఁబొడవైన వెండి కోటొకటి
వాటమై యొప్పారు వడిఁగంచుకోట. మేటియై చూపట్టు మించుక్కుకోట.
యిరవొందగా నొప్పు నిన్పకోటయును. అరయ బ్రహ్మాభేద్యమౌ రాతికోట.
యెట్టును పగవారి కీక్షింపరాని ఇట్టుకకోటొకటి (ండు)యీ రీతి నమరు.
నీ లంకఁగైకొని యేలిరి మున్ను మాలి సుమాలియు మాల్యవంతుండు
బ్రహ్మచే వరములు వడసి గర్వించి బ్రహ్మాదిసురలను భంజించి మించి
లోకంబులన్నియు లోలత గెలిచి చేకొని సురలచేఁ జెలువగ్గలించి
యుండంగ దేవత లొగి హరిఁజేరి మెండైన బాధల మెయి నెఱిఁగింప
వారి బాధలు దీర్ప వనజోదరుండు సారించి ఘనశంఖచక్రముల్ దాల్చి
వడి వచ్చి రాక్షసావలి నెల్లఁదఱిమి కడువేగమునను నక్కడ మాలిఁజంపె.
వడి చెడి యమ్మాల్యవంతుండు వేగ కడఁగి సుమాలియుఁగంపించి పాఱి
వావిరి లంకలో వడి నిల్వలేక వేవేగ పాతాళవివరంబుఁ జొచ్చి
చని రంత విష్ణుండు సకలదేవతల దనుజబాధల మాన్చెఁదదనంతరంబ
పాడఱియున్న యా పట్టణం.......... ..........
జెలువేది యందొక్క శిఖరంబు విఱిగి
తలకొన్న గాలిచే దవ్వుగాఁదూలి
గురుతరగతిని ద్రికూటంబు నాఁగ
ధరణీశ! యబ్ధిమధ్యంబునఁబడియె.
.......... తిరమైన శృంఖలద్వీపమధ్యమునఁ
గదిసిన మూఁడుశృంగంబులు గలిగి యది త్రికూటాచలంబనుపేరఁబరగె.
నవిరళసురబాధ యైన చక్కట్ల దివిజేంద్రుఁ డమరావతీపురిఁ బాసి
గొనకొని యందుండఁగూడుఁబొమ్మనుచు ఘన త్రికూటాద్రిపైఁగట్టించెఁబురము.
శతయోజనముల విస్తారంబు గలిగి యతులమై యోజనా లఱువది వెళుపు
బలితంపుఁగొమ్మల పసిఁడికోటయును విలసిల్లుమహిమల వెండికోటయును
గవగూడి యొప్పెడు కంచుకోటయును రవిమండలముఁబోలు రాగికోటయును
గోటయవ్వల నుక్కుకోటయు ఱాతి కోటయు నిట్టికకోటయుఁగూడి
లలితమై యొప్పెడు లంకాపురంబు కలయంగ నిది విశ్వకర్మనిర్మితము.
నందులో నవకోటిహరనివాసములు. పొందు రచ్చలకొట్టములు మూఁడుకోట్లు.
నలిఁబెద్దవీథులు నాల్గులక్షలును. బొలుపొంద గోపురంబులు లెక్క లేవు.
తమయంతనే పోయి తమయంత డాసి తమయంత నేసియుఁ దమ యంతఁబొడిచి
నెఱయ శత్రుల గెల్చు నిఖిలయంత్రములు. తఱచు కోటలకెల్లఁ దగినయట్టళ్లు.
వేలుసూపినఁబట్టి విడువక మ్రింగు వాలు నక్ర గ్రాహవర్గంబుతోడ
జలములు విషముల సార్థంబు సేసి కలయంగఁజూడ నగడ్తలు పొలుచు.
మొనసిన (పొనరిన)కోటల పొడవేమి సెప్ప? నినుతేరు కొమ్మలయెడల వర్తిల్లు(ంచు)
మానైన మహిమతో మాల్యవంతుండు భానుకులేశ! యా పట్టణంబేలు.
ననుజద్వయముతోడ నసురేశ్వరుండు ఘనమందిరము లలంకారముల్ సేసి (ల లంకాపురినిలచి).
ముగురు నక్కోటల మూఁడు శృంగముల నొగి నివాసములుగా నున్న కాలమున
ననిమిషేశ్వరుతోడ ననుజన్ముఁడొకఁడు చెనసి యుపేంద్రునిచేఁజచ్చుటయును
విఱిగిన నిర్జరుల్ వెంట నేతెంచి(వచ్చి) తఱిమినఁబురి నుండఁ దాలిమి లేక
తన బంధువులతోడఁ దనవారితోడ దనుజవల్లభుఁడు పాతాళంబు సొచ్చె(దూరె).
పాడఱియున్న యా పట్టణంబపుడు రూఢిమై మఱి కుబేరుండు గైకొనియె.
నా ధనదునిఁదోలి యనఘ! మాయన్న క్రోధించి లంకఁగైకొనియె. నెంతయును
(నా వల్లభుని దోలి యనఘ! మాయన్న లావునఁగొనియె నీ లంకాపురంబు
నా దుర్గసవరణ యది చిత్తగించు భేదింప శూలి కభేద్యంబు దేవ!)
తఱచైనయట్టి కొత్తళముల.......... ..........
దేవ! యా శృంఖలద్వీపంబునందు
దేవేంద్రుపనుపున దేవతాశిల్పి
|