| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నీ సముద్రమునీట నినజుండు నీవు289ఁ జే సేత290వడి నభిషేకంబు సేసి కట్టు291ఁడు వేగ లంకారాజ్యమునకుఁ బట్టంబు వానికిఁబ్రతి విభీషణుని.” నని యానతిచ్చిన నతఁడును నతని వనధిజలంబులు వనచరుల్ దేర నభిషేక మొనరించి“యసురులకెల్లఁ బ్రభుఁడవు గ.”మ్మని పట్టంబు గట్టి: “తలపోయ నా చంద్రతారార్కముగను సలలితంబుగ రామచంద్రుని కీర్తి యెంతకాలము గల్గు నిల విభీషణుఁడ! యంతకాలమును రాజ్యముసేయు.”మనఁగ నార్చి వానరకోటి హర్షించె. నపుడు, పేర్చి రాఘవుఁడు విభీషణుఁజూచి: “యీ యబ్ధి దాటంగ నే యుపాయంబు చేయుద.”మనవుడుఁజేతులు మొగిచి: “యీ వార్ధిఁగట్టక యింద్రాదులకును దేవ! యెమ్మెయి దాటఁదీరదు; కాన, యిది 292గట్టువడుటకు నినకులాధీశ! పదిలంబుగా వార్ధిఁబ్రార్థింపవలయు.” నని పల్కుచుండంగ నట దశగ్రీవు ననుమతి శార్దూలుఁడను దూత వచ్చి[వా.రా. సర్గ 20] కపిసేనకొలఁదియుఁగపులమాటలును గపులతో నాడు రాఘవుని వాక్యములు నరసి క్రమ్మఱఁజని యసురేశుఁగాంచి కరములు మొగిచి నిక్కము విన్నవించె: “నుత్తుంగ293గాత్రులు నుత్తుంగభుజులు నుత్తుంగ 294సత్త్వులు నుత్తుంగమతులు నగు రామలక్ష్మణు లలవుమై విడిసి రగచరాధిపులతో నబ్ధితీరమున. గణుతింప నగు నుడుగణములనైన; గణుతింప నగు వృష్టికణములనైన; గణుతింప నగు నబ్ధికరడులనైన; గణుతింపఁగారాదు కపిసేన295సంఖ్య. యుచిత మీ వేళ సామోపాయమునకుఁ బచరింపఁబంపు నేర్పరులైనవారి.” ననవుడు శార్దూలుఁడను వాని మాట విని శుకునకు దైత్యవిభుఁడిట్లు పలికెఁ: |