ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
దర్భశయనము
వనధితీరంబున వరదర్భ311శయన
మొనరించి తాత్పర్య మొప్పారుచుండ[వా.రా. సర్గ 21]
నమృతపయోధిలో నహిశయ్యమీఁద
312నమలచిత్తంబున నానందమంది
మున్నున్న తన యాదిమూర్తి చందమున
నన్నరనాయకుం డతి కౌతుకమునఁ
బొలుపొంద దక్షిణభుజశాఖఁదనరఁ
దలగడగాఁ313జేసి ధరణీశ్వరుండు:
“నే విధంబుననైన నే దాటిపోవఁ
ద్రోవ యిమ్మనియెదఁదోయధి.”ననుచు
రామభూవరుఁడు వారక యుపవాసి
యై మూఁడు దివసంబు లటు శయనించి
తెలిడెందమున జలదేవత నిలిపి
పలుమాఱు నిష్ఠతోఁ బ్రార్థింపఁదొడఁగె:
“గడ గానరాని నీ కడిఁది చిత్తంబుఁ
బడయుటకై యేను బడియున్నవాఁడ.
నీ కేను మాన్యుండ; నీరధి! వేగ
నా కిమ్ము త్రోవ యా నాకారిఁజంప.”

  1. ↑శయ్య, యొ
  2. ↑నమరుల చిత్తంబు నానందమంద
  3. ↑జేర్చి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )