| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా సము340ద్రుఁడు సురలందఱుఁజూడ భాసురరత్నప్రభాభాసుఁడగుచుఁ బ్రజ్వరిల్లెడు పెనుఁబడగలతోడ నుజ్జ్వలదహికోటి యొక్కటఁగొలువ గంగాదినదులెల్లఁ గదిసి తోనడవ మంగళబహుపుష్పమాలికల్ మెఱయఁ దలఁబూని జలచర తతులోలి నడవ జలనిధి సనుదెంచి సాష్టాంగ మెఱఁగి కరపద్మములు మోడ్చి కడు సంభ్రమమున నరవరాగ్రణికి 341సన్మతి విన్నవించె: “నేను మీయలుకకు నెంతటివాఁడ? భూనాథ! నీ వాదిపురుషోత్తముఁడవు. వాయుభూజలనభోవహ్నులాదిగను నీ యాజ్ఞలోనివి నిక్కువంబరయ. నీ యందునున్న వానికి లెక్కలేదు. నీ యధీనంబులు నిఖిలలోకములు. తప్పుసేసితి నని దండింపవలదు; చెప్పు మే పనియైనఁజేసెద342ఁగాని.” యని విన్నపముసేయ నంత నా రాముఁ గనుఁగొని యప్పు డా గంగాదినదులు ధర శిరమ్ములు మోవ దండముల్ వెట్టి కరములు ఫాలభాగమునను జేర్చి: “శరణార్థులము రామ! జగదభిరామ! కరుణింపవే మమ్ముఁగరుణాసముద్ర! యభయంబు వేఁడెదమయ్య యిందఱము. నభినవంబుగను నీ యబ్ధీశుఁగాచి శుభగతి మంగళసూత్రముల్ నిలుపు. త్రిభువననాధీశ్వర! దీనమందార! యపరాధులను గాచు టదియె నీ343గుణము. కృపఁజూచి రక్షించు గీర్వాణవంద్య! కామారికార్ముకఖండన! రామ! నీ మహిమల నెంచనేరవు శ్రుతులు. దేవతామయుఁడవు దేవదేవుఁడవు; కావను బ్రోవను గర్తవు నీవు; భూమీశ! లోకేశ! 344భూరిప్రకాశ! భూమిసుతాధిప! పుణ్యస్వరూప.! యని యిట్లు నదులెల్ల నభినుతి సేయ విని యప్పుడా రామవిభుఁడు వారలను మన్నించి:“భయమెల్ల మానుఁ?”డటన్న నన్నరనాథున కబ్ధి యిట్లనియె: “సరసిజోదర! మౌనిజననుతచరణ! శరణాగతార్తరక్షక! దివ్యమూర్తి! తరుచరసేన345నుద్ధతిఁ ద్రోచి నడపఁ; గరిమకరాదులఁగదలంగనీయ; నుప్పొంగి క్రయ్యల346కొత్తి వెల్విరియఁ; దప్పిజంఝామారుతము347ఁజూచి మ్రోయఁ గడ348లేక మిగుల నగాధమైయుండ సుడిఁ బొడమింప; నా సొంపు వాటింప; నలరి సేతువుఁగట్టియైనను నడవు; మలఘువిక్రమ! యూరకైనను నడవు.” మనిన రాఘవుఁడమోఘాస్త్ర మబ్ధీశు పనుపున మరుభూమిపైఁబ్రయోగించి విలసిల్లు నాయంపవేఁడిమిచేత సొలవ కందుల నీరు శోషింపఁజేసి యా మరుభూమి కుదాత్తుఁడై సర్వ కామ సమగ్రంబుగా వరంబిచ్చె; నది మరుదేశమై యంతనుండియును వదలక యమ్మాడ్కి వర్తించుచుండె; మగుడెఁదూణికి నంత మనుజేశుశరము తగ నబ్ధి పూర్వవిధంబున నుండె. నప్పుడంభోనిధి యనియె రాఘవున కుప్పొంగునయమున నొప్పువాక్యముల:349 “మీ తండ్రి దశరథమేదినీశ్వరుఁడు దైతేయ దేవయుద్ధమునఁబెంపొంది నన్నయోధ్యకుఁగొని నరనాథ! పోయి మన్నించి యప్పుడు మగుడ వీడ్కొలిపి పుత్తేర వచ్చితి భూతలాధీశ! యిత్తెఱంగున మీకు నే దక్కినాఁడ. దొరకొని కట్టు సేతువు రాఘవేంద్ర; తరుచరసేన నుద్ధతి నడపింపు.” మనవుడు రఘురాముఁడర్కజుఁజూచి: “పనుపు సేతువుఁగట్టఁబ్లవగపుంగవుల రయమున.”నన విని రవినందనుండు ప్రియమునఁబనిచె వార్ధిని గట్టఁగపులఁ. జని రంగదుండును జాంబవంతుండు ఘనులైన యా నీలగజగవాక్షులును బనసుండు నలుఁడును బావకనేత్రుఁ డును దపనుఁడు దారుఁడును గవయుండుఁ గరమొప్ప ఋషభుఁడు గంధమాదనుఁడు శరభుండు ద్వివిదుండు శతబలి మేటి హరి రోమవక్షుండు నట సుషేణుండు సొరిదిఁగేసరియును జ్యోతిర్ముఖుండు దధిముఖుండును వేగదర్శియు మఱియు నధికులు ప్లవగసేనాధిపులెల్ల మ్రాఁకులుఁగొండలు మల్లడిగొనఁగ వీఁకతోఁగొనివచ్చి విషధిలో వైవ నొకటియు నీటిపై నుండక మునుఁగ వికలులై కపులెల్ల వెఱఁగంది వచ్చి పతికిఁజెప్పుటయు భూపతి యాత్మలోన నతివిస్మయంబంది యబ్ధి కిట్లనియె: “నిది యేమి కపివీరు లీ భంగిఁదెచ్చి వదలక తరులుఁబర్వతములు వైవ నొకటియు నీటిపై నునికిలే?”దనిన సకలాధిపతికి నా జలధి యిట్లనియెఁ: “బరమేశ! వినుము! లోపలి కవిపోవఁ బొరిఁబొరి జలచరంబులు మ్రింగు వాని. నమరంగ శతయోజనాయతంబగుచుఁ దిమి యనుమత్స్యంబు దిరుగు350చునుండు; మ్రింగు నా మీనుఁదిమింగిలంబొకటి; మ్రింగు నా మత్స్యంబు మిగులఁదద్గిలము; నిటువలె నొండొంటి నెఱగొనుచుండు చటులసత్త్వంబు లసంఖ్యముల్ దేవ!” యన విని:“యిట్టి మహాంబుధిఁగట్ట నను వేది చెప్పవే యబ్ధీశ!”యనుడు: “నినకులాధీశ్వర! యీ నలుఁబంపు; ఘనుఁడైన యా విశ్వకర్మనందనుఁడు భానుకులేశ! యుపాయజ్ఞుఁడతఁడు; దాను నెంతయుఁదమతండ్రిచే నేర్చె. వడి వానిచేఁదప్ప వననిధి గట్టు వడ; దది యెట్లన్న వసుధేశ! వినుము: శిశువేళ వింధ్యాద్రి చేరువయడవిఁ బశుకణ్వుఁడను మునిపజ్జ నాడుచును ముని యనుష్ఠాన మిమ్ములఁజేయఁబోవ మునివేల్పులను బట్టి మోరతోపునను వనధిలోపలఁ బాఱవైచె నీ నలుఁడు. చనుదెంచి యమ్ముని చయ్యన నెఱిఁగి చాలంగఁగోపించి 351శాస్తి గావింప బాలుండు దగఁడని పరగఁజింతించి తన సొమ్ము పోకుండఁదానె తెచ్చుటకు ననువుఁజింతించి యా యర్భకుఁజూచి తన తపోమహిమ నత్తాపసోత్తముఁడు ఘనతరంబగు నొక్క కట్టడ సేసెఁ: ‘దోయధిలోపలఁదృణమాదిగాఁగఁ బాయక వీఁడేమి పట్టి వైచినను నవి తేలుఁగా!’కని యా వరంబీయ నవి యంతలోఁదేల నతఁడు గైకొనియె. నదిగాన తేలెడు నతనిచే గిరులు; వదలక నేఁ గట్టువడియెద నపుడు; ధరణీశ!352మీ రబ్ధి దాటునంతకును నురుభక్తిమైఁగొల్చియుండెద; నలుని రప్పింపు.”మనవుడు రఘుకులోత్తముఁడు రప్పించి యత్యాదరంబునఁజూచి: |