ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అతికాయుని హితోపదేశము
“విను దానవేశ్వర! 414వినుతనీతిజ్ఞుఁ
డనుపెంపుతోడ నీ యఖిలంబు వొగడఁ
బరులసొమ్ముల కాసవడక వర్తించు
నరనాథుఁ డిలయెల్లనాఁడును నేలు.
నిది నీతిగతి యని యిచ్చఁజింతింప
కెదురెందు లేదని యేల చూచెదవు?
ఇనకులోత్తముఁడు నీ కెగ్గేమిచేసె?
దనుజేశ! నీకు నాతని దేవి యేల?
నీదైన లంకయు నిన్నును జెఱుప
నీ దుష్టరాక్షసు415లెత్తుకొన్నారు.
కాన యా సీత రాఘవున కర్పించి
మానితంబుగ బుద్ధిమంతుండ వగుమ.”
యని పెక్కుభంగుల నతికాయుఁడపుడు
దనతోడఁబల్కిన416దానవేశ్వరుఁడు
అతికాయుమాటఁ దా నాత్మఁగైకొనక
నతిసాహసస్ఫూర్తి నప్పుడు మఱియు
శుకసారణులఁజూచి 417శూరుఁడై పలికె:
“నొక మానవుండబ్ధి నుఱక బంధించి

  1. ↑విశద
  2. ↑లిట్లు పల్కెదరు
  3. ↑దనుజేశుఁ డంత - శుకసారణుల…
  4. ↑సుముఖు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )