| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
ఘనుఁ418డైనవాఁడెందుఁ419గలఁ? డిదిచిత్ర మనయంబు రాముఁడీ యంబుధిఁగ420ట్టె ననుచున్నవారు. మీ రాసేనఁజొచ్చి ఘనమతులై యెల్లక్రమము వీక్షించి రం.”డని పనిచిన రయమున వారు దండివానరవేషధారులై వచ్చి వనములయం దుపవనములయందు ననుపమలీల మహాద్రులయందు వరసేతువందు నవ్వార్ధియవ్వలను గురుగుహాంతరములఁగొమరైన యెడలఁ గలయంగ విడిసిన కపిసేనఁ జూచి తలలూఁచి వెఱఁగంది తలఁకి యా చరులు మేనులు గరుపార మెల్లన చొచ్చి వానరసేనలో వచ్చుట చూచి యెఱిఁగి విభీషణుండేచి పట్టించి యుఱక వారల రామునొద్దకుఁదెచ్చి: “మనుజేశ! రావణుమంత్రులు వీరు; వనచరవేషులై వచ్చినవారు. శుకసారణులు; వీరు సొచ్చి యివ్వీట సకలంబుఁగనుఁగొని చనఁగలవార.” లనవుడు నా చారు లతిభీతిఁబొంది మునుకొని చేతులు మొగిచి మ్రొక్కుచును: “దేవ! రావణుఁడు వుత్తెంచినచరుల; మా విభీషణు చెప్పినంతయు నిజమ; యేచి యా రావణుం“డీ కపిసేన చూచిరం.”డనవుడుఁజూడవచ్చితిమి.” యనుటయు నవ్వుచు ననియె రాఘవుఁడు “వినుఁడు! రావణుమంత్రివిభులౌట‘ఁజేసి’ మిమ్ముఁజంపుట దగు; మిముఁజంపఁగాని మిమ్ముఁజంపిన వచ్చు మేలేమి మాకు? నది సెప్పనేల? వీడంతయుఁజూడుఁ ‘డదిసూడ మిదిసూడ’మనక మీ రిప్పు 421డిట తేరకొనఁగ వీడెంతయుఁజూచి యట పోయి వెసఁజెప్పుఁడా రావణునకు. నే లావునమ్మి422 తా నిట సీతఁదెచ్చె నా లావుఁజూప రమ్మనుఁ; డాజిలోన నెల్లి యీ లంకలో నెల్ల రాక్షసులఁ ద్రుళ్లెడి 423తన్నును దునుమాడు ననుఁడు; చనుఁ.”డని రావణుచారుల424ఁబనిచె జననాథుడగు రామచంద్రుండు 425ప్రీతి. వారు విభీషణువలన నవ్వీ426డు వారక సకలంబు వడిఁజూచి పోయి రావణుఁగాంచి యా రావణుతోడ: “దేవ! నీ పంచిన తెఱఁగునఁబోయి కపిసేన నెంతయుఁ గనుఁగొనుచుండ నెపమాత్రమున మమ్ము నీతమ్ముఁడెఱిఁగి పట్టించి కట్టించి భానుకులేశు కట్టె427దిటికిఁదెచ్చి కలుషంబు428తోడఁ జంపింపఁదలఁచిన సదయుండు గాన చంపింపఁడయ్యె నిక్ష్వాకువల్లభుఁడు. నీ లంకయును నిన్ను నిఖిలరాక్షసుల నాలంబులోపల నణఁగించుటకును రామభూపాలుశౌర్యముఁజెప్పనేల సౌమిత్రి యొక్కఁడే చాలు లంకేంద్ర! సురవైరి! సేతువుఁజూచితి మందు నెరసి వానరసేన నిండియున్నదియు. నది శతయోజనంబైనట్టి నిడుపు పదియోజనంబుల పఱపున నొప్పెఁ. గపిసేన యింతని గణుతింపరాదు. కపులాడకాడకు ఘనగిరులందు విడిసిన సేనయు విడియు సేనయును విడిదలపట్లకు వెదకుసేనయును నుదధికి నవ్వల నుండు సేనయును వదలక మఱియును వచ్చు సేనయును నై429యుంటకుఁబరాకు నాత్మలో430వెఱఁగు పాయని వెఱపును బ్రభవించె దేవ! యొక్కొక్క చోటున నున్న యా సేన 431లెక్కించి బ్రహ్మయు లిఖియింపలేఁడు. కాన యా రామునిఁగని సీత నిచ్చి దానవనాథ! మోదంబున నుండు.” మనవుడు రావణుండా మాటలెల్ల విన నింపుగాక క్రొవ్వినరోష432మెత్తి[వా.రా. సర్గ 26-28] దేవగంధర్వు433లెత్తిన నైన సీత నే విడుతునె? 434యేల యీ పందతనము? మిమ్ముఁగ్రోఁతులు వట్టి435మెదిచిన నొచ్చి బమ్మెరవోవుచుఁబఱతెంచినారు. వలవ దోడకుఁడు; దుర్వారులై మిమ్ముఁ దలఁచి క్రోఁతులురారు436ధాటి437మై వెనుక.” నని ధీరుఁడై పల్కి యా రావణుండు చని తనతో శుకసారణుల్ నడవ మిక్కిలి పొడవైన మేడపై నెక్కి యక్కపిబలముల నంతయు నపుడు చూచి యద్భుతమంది శుకసారణులకు: “నీ చందమున నున్న యీ సేనలోన నెవ్వఁడు ముంగల నేపారి నడచు? నెవ్వఁడెవ్వఁడు వెన్క నేమఱుకుండు? నెవ్వఁడు శూరుఁ? డిందెవ్వఁడు వలఁతి? యెవ్వనిమాట లాయినసూతి సేయు? నెవ్వనితో రాముఁడిష్టంబు వలుకు? నెవ్వనిచే సేన యేపారి యుండు? నెవ్వరు రేవగ లీ సేనఁగాతు? రెవ్వరు సామంతు లీ సేనలోన? నెవ్వఁడు సుగ్రీవుఁ?డెవ్వఁడు రాముఁ. డెవ్వఁడు లక్ష్మణుం?438డే మూర్తివాఁడు? చూపుఁడా; యేర్పడఁజూపితిరేనిఁ గోపింప నే వారిగుణములు విన్న.” 439ననవిని సారణుండా రావణునకు వినిపింపఁదొడఁగెఁ బ్రవీణత మెఱసి: |