| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నుచితకాలంబున నొప్పును సంధి; యుచితకాలంబున నొప్పు వైరంబు; కాన, నయోచితకార్యంబు సేయు వానికి రాజ్యంబు వర్ధిల్లుచుండు. నధముతో విగ్రహ, మధికుతో సంధి, బుధులమతంబు నెప్పుడు సేయు టొప్పు; వలవదు; మనకంటె వనజాప్తకులుఁడు బలవంతుఁడగువాఁడు బలవైరి వైరి; దైవకార్యంబుగా ధరఁబుట్టినాఁడు; దైవబలంబు నాతనియందె కలదు; ఆరయ ధర్మాత్ముఁడని 534చెప్పనేల? వారక ఋషులదీవనలు గొన్నాఁడు; సురల బాధించి భూసురుల మర్దించి యురుపాపబుద్ధివై యుండుదు వీవు. గెలుపు ధర్మముదెసఁ గీల్కొనుఁగాని యిల నధర్మముదెస నేల వర్తించు? నక్కమలజుచేత నటునాఁడు వరము తక్కినవారిచేతను చావకుండఁ బడసితి గాని యిబ్భంగి నీ మీఁద నడతెంచు నరుల వానరులను గెల్వఁ బడయవు నీ. వెన్ని భంగులనైనఁ జెడుట తథ్యము వారిచేతను నీవు. దాని కంతటికిఁబ్రత్యక్షంబు సూడు మానైన విపులహోమముల ధూమములు జడిసె; రాక్షసుల తేజంబులు మాసె; నుడుగక మనవీట నొప్పముల్ వుట్టె. నటుగాన యాదినారాయణుం డాతఁ; డిటు సేయుటకుఁబుట్టె నిద్ధరమీఁద. రామునితోడ విగ్రహ మొప్ప దుడుగు రాముని బాణపరంపరల్ బెట్టు వలవదు; రాముని వనిత నొప్పించి కులమెల్ల రక్షించుకొను దానవేంద్ర!” యనవుడు దశకంఠుఁడమ్మాల్యవంతుఁ గనుఁగొని రోషసంకలితుఁడై పలికె:[వా.రా. సర్గ 36] “మిగులఁబ్రతాపినై మేటినై యెందు నెగడిన నా యొద్దనే పగవానిఁ జెప్పెదు; నిన్నేమిచేయుదు నింక; నెప్పుడు మానవయ్యెదు పందతనము. సీత నేమిటి కిత్తు? సీత నిచ్చుటకు భీతి నా535కిట మీఁదఁ బేర్చు నింతటను. నని మీఱి పల్కిన నమ్మాల్యవంతుఁ డనియె: “నా మాట నీ వాత్మఁగై536కొనక యా రామచంద్రుని నాలంబులోన శూరత గెలువంగఁ537జూచెదుగాక; యెందువోయెద.”538వని హెచ్చి కంటకము లందంద వలుకుచు నలుకమైఁబోయెఁ. బోయినపిమ్మట బుద్ధిలోఁదలఁచి యా యసురేశ్వరుం డప్పుడె కడఁగి యలఘుబలాఢ్యుఁబ్రహస్తునిఁబనిచెఁ దొలితొలి 539బలుకాపుఁదూర్పువాకిటికి; దక్షిణంబున మహోదరమహాపార్శ్వు లక్షీణబలయుతులై యుండఁబనిచె; వారక పడుమటి వాకిటనుండ శూర540త నట పంచె సుతు నింద్రజిత్తుఁ; దనమాఱు గాఁగ నుత్తరపు వాకిటికిఁ జని యుండుఁడని పంచె సారణశుకుల; నందఱకును ముఖ్యుఁడై పురమధ్య మం దుండఁగా విరూపాక్షునిఁబనిచె. నీ విధంబున లంక కెల్లఁ గాపిడుచు రావణుఁడంతఃపురంబున కరిగె.[వా.రా. సర్గ 37-39] నంత నక్కడ రాముఁడనుజు నర్కజుని నంతకంటెను541హితుండగు విభీషణుని వాలినందను జాంబవంతు సుషేణు (నీలుని నలుని ననిలజు గవాక్షు నాలీల రప్పించి యందఱితోడ) నాలోచనంబునకై కూర్చి పలికె: “నవగుణంబులకెల్ల నాలయంబైన దివిజారిలంక యేతెఱఁగకో యింకఁ జూతమా యేర్పడఁ; జూడుఁడా యొకని చేతఁదత్కులమెల్లఁజెడఁగల దింక.” |