ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అంగద రాయబారము
మనుజేశుఁడప్పుడు మంత్రుల610తోడ
ననుమతిఁగైకొని యంగదుఁబిలిచి
(యెలమితో రాఘవుండిట్లని పలికెఁ:
“దలఁగక నీవేఁగి దశకంఠుతోడ)
నరసి రావణ! నీవు నజునిచేఁగొన్న
వరగర్వమున మునివరుల దేవతల
611నడిచి బాధించినయటు612గాదు; నేఁడు
విడిసె613నీపై రామవిభుఁ.”డని పలుకు;
“మే లావు నమ్మి నీ వెలనాఁగఁదెచ్చి
తా లావుజూప ర.”మ్మను మాజిలోన;
“614బంటవై శ్రీరాముబాణఘట్టనల
గెంటక రణములోఁగీల్కొను.”మనుము;
“అటుచేయ వెఱచితే నవనిజఁదెచ్చి
యిట యిచ్చి బ్రదుకుట యిది బుద్ధి.” యనుము;
“పరగ లంకారాజ్యపట్టంబు615నందుఁ
గరుణ విభీషణుఁగట్టినాఁ.”డనుము;
“చంపెడు రాఘవేశ్వరుఁడిదె నిన్నుఁ;
జంపకముందఱ సకలబంధువులఁ
జూడుము; లంకయుఁజూడు మేర్పడగఁ;
జూడుము నీ కూర్మిసుందరీమణులఁ;
దనయులుఁదమ్ములుఁదగ బంధుజనులు
ననిఁజావకుండఁగా616నటు కావు.”మనుము;
నీవు నీ బంధువుల్‌ నిశ్శేషముగను
జావంగఁగలవారు; సచ్చినమీఁద
కార్యంబు లిప్పుడు గావించుకొనుము;
కార్యమిట్టిది దశకంఠ! నీ.”కనుము.”
అని యిట్లు శ్రీరాముఁడానతిచ్చుటయు
మనమున హర్షించి మర్కటోత్తముఁడు
కడుదుష్టరాక్షసగహనముల్‌ గాల్ప
నడరినవిలయకాలాగ్నియుఁ బోలి
యెగసి యా సభలోన నింద్రారిఁజంపఁ
దగిలినమృత్యుదూతయుఁబోలి నిలువఁ
గనుఁగొని యపుడు రాక్షసకోటియెల్ల
“నినజుండు గ్రమ్మఱనేతెంచె.”ననుచు
నాయుధసన్నద్ధులై సంభ్రమింప
నా యసురులనెల్ల హస్తముల్‌ సాచి
“వలవ దోహో!”యని వారణ సేసి
పలికె నంగదుతోడఁబంక్తి కంధరుఁడు:
“నీవెవ్వఁ?”డనుటయు:“నెఱుఁగవా యోరి
రావణ! యేను రా రామునిబంట;”
“రాముఁడెవ్వఁడు?”పరాక్రమశక్తిఁబరశు
రాముని గెలిచిన రణవిచక్షణుఁడు;
“అతఁడెవ్వఁ?” “డుద్ధతుఁడై కార్తవీర్యు
నతివీరుఁజంపినయతుల విక్రముఁడు;”
“అతఁడెవ్వఁ?”“డెఱుఁగవా యాజిలో నిన్ను
జితుఁజేసికొనిపోయి చెర నిడినతఁడు;”
“ఎవ్వని తనయుండ?”“వెఱుఁగవా నిన్ను
నివ్వార్ధి ముంచిన యింద్రునితనయు
నా వాలి మఱచితే యకట! యింతటనె?
యే వాలిసుతుఁడెట యెఱుఁగవా యోరి!
అంగదుఁ617డనువాఁడ నసురేశ! వినుర;
సంగరస్థలి నన్నుఁజాల నెర్గెదవు;
నడరి నీ చెలియ లత్యాసక్తి డాయ
నడచిన నా శూర్పణఖముక్కు సెవులు
వడిఁబట్టి కోసినవరఖడ్గధార
వడియునెత్తురు దుడువంగ రోసి రోసి
ఖరదూషణాంగరక్తంబులఁగడిగి
కర మొప్పఁజేసిన కాకుత్స్థతిలకు
నెఱుఁగవా రాముని? నేటికిఁబ్రేలె?
దెఱుఁగుదుగాక నీ వెందుఁబోయెదవు?
మూఁడులోకంబులు ముట్టి గర్వమున
మాఁడించి నిన్ను నమ్మనుజవల్లభుఁడు
తునిమెడు, నుగ్రతఁదొలఁగక నిలిచి
యనిసేయు బంటవై; యంతియ చాలు.
లంక నీ కింక నేలఁగ లేదు వినుము;
లంకకుఁబతిసుమ్ము లలి విభీషణుఁడు.
ఇన్నియు నేటి?618కా యినకులేశ్వరుని
కున్నతమతి సీత నొప్పించి బ్రదుకు.
తొడరినబలవంతుతో సంధియగుట
పుడమి రాజులకెల్ల బుద్ధియెసుమ్ము.”619
అనవుడుఁగోపించి యా రావణుండు
ఘనబాహుబలుని నంగదుఁబట్టి కట్టఁ
బనిచినఁగొందఱు బలితంపుటసురు
లనయంబు నుద్ధతులై పట్టుటయును
సొలవక తన శక్తి సూపెడి కొఱకుఁ
దొలఁగ నొల్లక యంగదుఁడు వట్టువడియె.
నటు పట్టువడి యతఁడాకసంబునకుఁ
బటుశక్తి నెగసి యుద్భటవృత్తి మెఱసి
విద్రిచినఁబదివేలవీరులు ధాత్రి
యద్రువంగ నుగ్గునూచై త్రెళ్లి; రంత,
నలిగి యంతటఁబోక యంగదుఁడసుర
కొలువున్న మేడయుఁగూలఁదన్నుటయు
నది వజ్రహతిఁదుహినావనీధరము
తుదిఁగూలుపగిదిఁ దుత్తునియలై రాలె.
వెండియు“నంగదు విడువక పట్టఁ
బొం.”డని దైత్యులఁబుచ్చె రావణుఁడు.
620పుచ్చిన వారును బొదివి యంగదుని
నచ్చెరు వడరంగ నాకాశమునను
బరశు పట్టిస భిండిపాల శూలములఁ
గరవాల తోమర గదల నొప్పింపఁ
బిడికిటిపోటులఁబ్రేవులు వెడల
బెడిదంబుగా నొంచి పృథివిపైఁగూల్చి
యరుగుచునుండ నయ్యంగదుఁజూచి
ఖరసూతి621సుకరుండు కార్ముకంబెత్తి:
“నిలునిలు మంగద! నీవెందుఁబోవఁ
గల.”వని పెల్లార్చి కాండంబు లైదు
నుదురు నాటఁగ నేసి నొప్పించి మఱియుఁ
బది తీవ్రశరముల బాహు622వు లేయ
నలుకతో623ఁబిడికిట నంగదుం624డసుర
తల పెక్కువ్రయ్యలై ధరఁ625గూలఁబొడిచె.
దానికి దైత్యులు తల్లడపడఁగ
దానవేశ్వరుఁడు చింతా626మగ్నుఁడయ్యెఁ.
దారాతనూజుఁ627డత్తఱి నేఁగుదెంచి
628యా రామునకు మ్రొక్కి యంజలి మోడ్చి:
“దేవ! మీ యానతి తెఱఁగునఁబోయి
రావణుతో629నమరంగఁజెప్పితిని;
జెప్పిన630మాటలు చెవిఁబెట్టఁడాయెఁ.
జెప్పఁగాఁగలవెల్లఁజెప్పితి దేవ!
ఘనమైన నీతిప్రకారంబు గాఁగ.
జననాథ! వినుము నీ సాయకంబులకు
బ్రాణంబు లీఁగోరి పంక్తికంధరుఁడు
పోణిమితోడ నిప్పుడు నున్నవాఁడు;
గట్టిగాఁజావుకుఁగడుఁదెంపు సేసి
యుట్టిఁగట్టుక యూఁగుచున్నాఁడు దేవ!
దినములన్నియుఁదీరె దివిజాంతకునకు.
నినకులనాథ! నీ వీ దశగ్రీవు
ననిలోన మడియింపు మఖిలలోకేశ!
యనఘాత్మ! సకలసురాదు లుప్పొంగ.”
ననుచు నా వృత్తాంత మంతయుఁదెలియ
వినుపించె నెంతయు విశదంబుగాఁగ.
జననాయకుండును సంతోషమందె
ఘనతరంబైన యంగదు సత్త్వమునకు.
నట రావణునితోడ నసురులందఱును
బటుతరవాక్కులై పలికి రయ్యెడను:[వా.రా. సర్గ 42]
“ఇదియేమి దేవ! నీ విట్లూరకునికి!
యదె కపిసేనతో నా రాఘవుండు
విడిసినాఁడీలంక 631వెలువడి నీవు
కడిమి యెన్నఁడు చూపఁగలవాఁడ632వింక!
మముఁబంపు రామలక్ష్మణుల వానరుల
సమరంబులో633గెల్చి చనుదెంతు.”మనుడు

  1. ↑ఁజూచియ
  2. ↑నడరి
  3. ↑వలెఁగాదు
  4. ↑నిప్పుడు
  5. ↑సందీప్త రామాస్త్ర చయఘట్టనలకు- బందవైయెందునుఁ బాఱకు మనుము
  6. ↑నకును
  7. ↑నరసికొమ్మనుము-కార్యంబు మునుపడఁగైకొనుమనుము-శౌర్యంబు మాని వంచన నుండకనుము
  8. ↑డన్‌వాఁడ నా హవవార్ధి-నంగదనిను ముంతు నా తండ్రివోలె
  9. ↑కి నిన
  10. ↑అని పల్కు నంగదు నాద శాసనుఁడు- తన రోషదృష్టిని దప్పక చూచి-యనయంబుఁగోపించి…
  11. ↑పంచిన వారును బట్టి యంగదుని, నంచెలంచెల నెత్తి యాకాశమునను
  12. ↑సుఖరుండు
  13. ↑లురెండు
  14. ↑నేసిన
  15. ↑డతని
  16. ↑బడమోఁదె
  17. ↑రతుఁ
  18. ↑డంతట
  19. ↑శ్రీరాము… చేతులు
  20. ↑సమరంబు
  21. ↑నా మాట
  22. ↑వేధించు నింక, ఁగ
  23. ↑వీవు
  24. ↑ఁజంపి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )