ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు తన వైభవమును మెఱయించుట
634వీనుల కరుదుగా విని దశాననుఁడు
భానుజాదులకును భయము పుట్టంగఁ
దన వైభవము రామధరణీశ్వరునకు
ఘనముగాఁజూపెదఁగాకంచుఁదలఁచి
సాంద్రప్రతాప నిస్తంద్రుఁడై తొల్లి
యింద్ర ధనేంద్ర నాగేంద్రుల గెలిచి
కప్పముల్‌ గైకొన్న ఘనవస్తువితతిఁ
దెప్పించి మేలైన దీధితుల్‌ నిగుడఁ
జీనాంబరంబులు చెలువారఁగట్టి
నానాదిశల వాసనలు వెదచల్లు
మృగమద ఘనసారమిళిత మనోజ్ఞ
మగు దివ్యచందన మలఁది యంగమున
సరసమంజుల పారిజాతప్రసూన
విరచిత మాలికావితతులు ముడిచి
పంకజరాగాది బహురత్నఖచిత
కంకణముద్రికాంగద భుజాభరణ
ఘనతరగ్రైవేయ635కము లాదియైన
వినుతభూషణములు విలసిల్లఁదాల్చి
గుండలంబు636లమెండు637కొను మణిప్రభలు
గండమండలములఁ638గడలుకొనంగఁ
జండాంశు మండలోజ్జ్వలములై దిక్కు
లొండొండ వెలిఁగించు నురుకిరీటములు
దశశిరంబుల 639మించు దహనుఁడోయనఁగ
దశశిరంబుల లీల ధరియించి మఱియు
సురవరానలయమాసురనాథ వరుణ
మరుదర్థ నాయక స్మరసంహరులను
గండడంచి జయించి కైకొన్నబిరుదు
గండపెండెంబు డా కాల ధరించి
శర శరాసన పట్టిస ప్రాస చక్ర
పరశు తోమర భిండిపాల త్రిశూల
కరవాల పాశ ముద్గర చంద్రహాస
పరిఘాదులగు640బహుప్రహరణశ్రేణు
లిరువదికరముల నేపారఁబట్టి
పరిచారకులు వెంట బలసి యేతేర
గొబ్బున నుత్తరగోపురంబునకు
గబ్బు నుబ్బును మీఱఁగదలి శూలాది
హస్తులై 641యెడ గల్గి యాప్తరాక్షసులు
విస్తరంబుగఁబరివేష్టించి కొలువ
స్ఫురిత భూషణవస్త్రభూషితులగుచు
నిరువంక మంత్రులనేకులు గొల్వఁ,
దుదలేని రత్నపంక్తులు దాఁపినట్టి
పెదపెద్ద పసిఁడికుప్పెలు మీఁద నొప్ప
వివరింప నెనుబదివేల సంఖ్యలగు
ధవళాతపత్రముల్‌ దనుజులు పట్ట,
నల శేషఫణములో యన642నన్నివేల
సలలిత వ్యజనముల్‌ సకియలు పూన,
నిందురశ్ములఁబోలు నెనుబదివేలు
చందనగంధు లప్సరస లిర్వంకఁ
దళుకు వెన్నెలల చందమున నా సంఖ్య
గలచామరంబులు గడు సంభ్రమమునఁ
గంకణ ఝణఝణత్కారంబు643లొలయ
నంకించి వేడుక నల్లన వీవ,
సురల గెల్చిన జయస్ఫురణ644లంతంత
బిరుదు లెత్తుచు వందిబృందముల్‌ పొగడ,
645మంద్ర మధ్యమ తార మానభేదములఁ
జంద్రాస్య లెదుర నెచ్చరికలు పాడ,
సన్నుత646మాణిక్యజాల ప్రభాస
మున్నత సింహాసనోపరిస్థలిని
నపరాచలముమీఁది యర్కునితోడి
యుపమకుఁబాత్రుఁడై యొగి రావణుండు
వలనైన తన వైభవం647బెల్ల మెఱసి
కొలువుండె నుత్తరగోపురం 648బునను.
నా గొడుగుల నీడ యాదిత్యుఁగప్ప
వేగంబె చీకటి విలసిల్లుటయును
నా వేళ మాయా మృగాజినంబునను
దేవేంద్రమణికాంతి దీపించుమేని
వామభాగము మోపి వామభుజాగ్ర
సీమఁగపోల మూర్జితముగాఁజేర్చి
యుగ్రాంశుబింబ సముజ్జ్వలుం649డైన
సుగ్రీవుతొడలపై సొరిది సౌందర్య
సంపద650దొలఁక రాజస651ముగా నొఱగి
పెంపారు మహిమచేఁబ్రియభక్తుఁడైన
పవనుజు తొడలపైఁబాదపద్మములు
సవర652గాఁజాప నిశ్చలభక్తి నతఁడు
మృదురీతి నొత్త, నర్మిలి నంగదుండు
కదిసి దక్షిణభుజాగ్రంబిరుగేల
నంది యంగుళము లొయ్యనఁబట్టుచుండ,
వంది బృందంబులవైఖరి నిలిచి
నల నీల భల్లూకనాయక ప్రముఖు
లలరుచు:“సకలలోకారాధ్యచరణ!
జానకీహృదయాంబుజాత షట్చరణ!
దీనార్తి హరణ! కీర్తితకృపాభరణ!
హరనుతనామ! సూర్యకులాబ్ధిసోమ!
యరిభీమ! రఘురామ!”యని సన్నుతింపఁ,
గందని పూర్ణరాకాచంద్రుఁబోలు
మందస్మితానన మండలంబునను
నవిరళకరుణామృతాపూర్ణ మగుచు
ధవళారవిందసౌందర్యంబు653ఁదెగడు
తెలిగన్నుఁగవకాంతి దెసలెల్ల654నిగుడ,
లలితావలోకవిలాసచంద్రికలు
వెదచల్లఁగాఁ గరద్వితయసన్నిహిత
వదనుండు రాక్షసవరమర్మవిదుఁడు
నగు విభీషణుతోడ నతిరహస్యంబు
లగు మాటలాడుచు నప్పటప్పటికి
రమణీయలీల శ్రీరాఘవేశ్వరుఁడు
నమరదక్షిణముఖమై యున్నవాఁడు
కావున రావణుఁగాంచి యిట్లనియె:
“నో విభీషణ! చూడు మున్నతంబైన
యా గోపురమునఁగొల్వైయున్నవాఁడు
బా గొప్ప వానికిఁబట్టినయట్టి
శరదభ్రవిభ్రమచ్ఛత్రసంఘములఁ
బరగెడు నీడ భూభాగంబుఁగప్ప;
నీ రీతి నున్నవాఁడెవ్వఁడో?”యనిన
నా రాముఁజూచి యిట్లని విన్నవించె:
“దేవ! రాఘవ! వీఁడు దేవారియైన
రావణుఁ,డమరవిద్రావణుం; డఖిల
దివిజులచేఁగొన్న దివ్యభూషణము
లవిరళంబుగఁబూని యాప్తులైనట్టి
దనుజముఖ్యులు గొల్వఁదనకు నిండార
బనుపడఁగా నెనుబదివేలసంఖ్య
గలగొడుగులు పట్ట ఘనచామరంబు
లలవుమై వీవంగ నాలవట్టములు
పూనంగఁదనదుపెంపును రాజసంబుఁ
దా నిట్టి దనుచు మోదమున మీ యెదురఁ
జూపంగఁదలఁచి భాసురవైభవమున
గోపురోపరిసీమఁగొలువున్నవాఁడు.”

  1. ↑ఈ కథాభాగము సంస్కృతమునను, భా.రా.లోను లేదు. రంగనాథరామాయణము వ్రాఁత ప్రతులందును గొన్నింటనే కలదు
  2. ↑ఘంటికానేక - వినుత హారంబులు విపులంబులైన, పదకంబు లాదిగా బహుభూషణములు- పదక శుద్ధిగ వన్నె పచరింపఁదాల్చి
  3. ↑లు
  4. ↑కొని చెలు వొప్ప
  5. ↑గాంతులు నిండ (నిగుడ)
  6. ↑దీప్త
  7. ↑వర
  8. ↑డగ్గఱి, (ముందఱ నలరుచు నాప్ర - హస్తాది ముఖ్యు (మంత్రు)లు నలరి సేవింప
  9. ↑నొప్పుమీఱు
  10. ↑బెరయ
  11. ↑లు మెఱయ, లెల్లెడల…
  12. ↑తానమానములు వింతలుగా ననూన-గానంబు సురకన్యకలు వినిపింప
  13. ↑మణిదీప్తిజాలముల్‌ పర్వ-నున్నత
  14. ↑బుల
  15. ↑స్థలిని
  16. ↑డగుచు
  17. ↑లొలుక
  18. ↑మొప్ప
  19. ↑ణఁ
  20. ↑లైన
  21. ↑నిండ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )