ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాముఁడు రావణ చామరాదులపై నస్త్రప్రయోగ మొనర్చుట
నా విని నవ్వి మానవకులేశ్వరుఁడు
దేవారిగర్వంబు దీర్పంగఁదలఁచి
వెనుకొని“లక్ష్మణ!విల్లుదె.”మ్మనుచుఁ
దనకుఁబిమ్మట నున్న తమ్మునిచేతి
ధనువు డాచేత నెంతయు655వేడ్క నంది
కొని దక్షిణాంఘ్రియంగుష్ఠాన వింటి
గొనయంబుఁబూని గ్రక్కున నెక్కువెట్టి
కనదర్ధచంద్రమార్గణ మరిఁబోసి
ధీలక్షితోల్లాసి తెగ నిండఁదిగిచి
యా లీల656నొఱగినయట్లనె యుండి657
యలచామరవ్యజనాతపత్రౌఘ
ములమీఁద నేసె నద్భుతశక్తి. రాము
శరమొక్కటియుఁ బదిశరములై నూఱు
శరములై పదివేలశరములై మఱియు
లక్షలై కోటులై లక్షించి చూడ658
నక్షణంబున సంఖ్యలన్నియుఁగడచి
తాలవృంతంబులు దాల్చుచేడియల,
మేలిచామరములు మెఱయించుసతుల,
సంగీతములు సేయుసరసిజముఖులఁ,
బొంగుచుఁగైవారములు సేయుచెలుల,
ధవళాతపత్రముల్‌ ధరియించుదైత్య
నివహంబులను, గొల్చి నిల్చినభటుల,
కరములు ద్రుంపక గళములు ద్రెంప
కురములు నాటక యురుకిరీటములు
ధరడొల్లఁజేయక తలలు ఖండింప
“కరు దరు దిది!”యని యమరులు వొగడఁ
గత్తిరించుకపోయెఁగంఠ659 సూత్రముల.
660నత్తఱిఁద్రెళ్లిన యా చామరములు
నాలవట్టంబులు నాతపత్రములుఁ
దేలుచు జల్లన దివి నిండ నెగసి
కొలువులోఁగొన్ని దిక్కులయందుఁగొన్ని
కొలువులోపలి దైత్యకోటిపైఁగొన్ని
లంకలోఁగొన్ని యా661లవణాబ్ధిఁగొన్ని
లంకేశుపైఁగొన్ని లఘులీలఁబడియె.
నలవుమై నటుసేసి యా దివ్యశరము
తొలఁగక రఘురాముదొనఁజొచ్చె.నంత
మహితాతపత్రచామరతాలవృంత
రహిత దండధరాసురశ్రేణి నడుమ
నున్న రావణుఁడప్పు డొప్పఱి చూడఁ
దన్నుఁగొంపోవ నుద్ధతి వచ్చియున్న
దుర్వారులగు యమదూతలనడుమ
గర్వంబుచెడి యున్న గతినుండి చాల
వెఱఁగంది రఘురామువిలువిద్యపెంపు
తఱిగొని తలపోసి తల లూఁచియూఁచి
బట్టుకైవడి మెచ్చి పటుతరధ్వనుల
662బెట్టెత్తి రఘురాముఁబేర్కొని పొగడె:

  1. ↑వేగనంది
  2. ↑పవళించిన
  3. ↑మానితచ్ఛత్రచామరలపై నేయ - మానసవేగ మమ్మార్గణంబరిగి, నలవట్టంబులు…
  4. ↑నక్షయబాణంబు లయ్యెనో యనుచు - వీక్షించి దేవతల్‌ విస్మయం బంద, నాలవట్టంబులు… ఇత్యాది
  5. ↑మా
  6. ↑కత్రించుకొనిపోయె… ఁజిత్రమైత్రెళ్లినసిత
  7. ↑ళ్వరులపై
  8. ↑బిట్టెత్తి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )