| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
ఇట నంత మఱి రాఘవేంద్రుండు కార్య ఘటనాప్ర671యత్న సంగతచిత్తుఁడగుచు ననుజవిభీషణార్యమజాదులైన తనవారి యనుమతిఁదగు ముహూర్తమునఁ బనిచె లంకకు లగ్గపట్ట వానరులఁ. బనిచిన వానరబలములు లంక ఘనగతి నిక్కడక్కడఁబడ నార్చి వనజాప్తకులు రామవల్లభుఁజూచి: “దేవ! మా672శౌర్యంబు తెఱఁగొప్పఁజూడు; మే విధిఁబ్రాణంబు లిత్తుము నీకు.” నని పర్వతంబులు నవనీరుహములుఁ గొని వేలు లక్షలు కోటానఁగోటు లక్షౌహిణులు గుములై కూడి వచ్చి యా క్షణంబున673ముట్టి రా లంకకోట. ముట్టిన“గెలుపు రామునకు నౌ.”ననుచు దట్టించి పేర్చి యుదగ్రులై కవిసి బహుకాష్ఠ పాషాణ 674పాదపావళుల నహితదుర్వారులై యందంద675పేర్చి తరమిడి యా యగడ్తలు పూడ్చునప్పు డురుశక్తిఁ గపివీరులున్న విధంబు పొలుపార నపుడు చంపుడు676గట్టుమీఁద దలముగా నున్నచందము నివ్వటిల్లెఁ. గుముదుఁడత్తఱిఁబదికోటులతోడ సమదుఁడై తూర్పుమోసాలకు నరిగెఁ. బై దళంబై యుండి బలసి రాక్షసులు పై677దాఁచి రాకుండ బలిమిఁజూపుచును గొనకొని యెనుబదికోటుల కపులు తనతోడఁబేర్చి యుద్దండత నడవ ఘనబాహుబలుఁడు లంకకు దక్షిణమునఁ జనియుండె బలియుఁడై శతబలి. యంతఁ బడుమటిదెసకును బదికోట్లకపులు నడవ సుషేణుఁడున్నతి నేఁగి యుండె. రామలక్ష్మణులును రాక్షసేశ్వరుఁడు నా మర్కటేశ్వరుఁడాయుత్తరంపు వాకిట నుండిరి. వనచరోత్తము678ల నా కోట679 లెక్కించి యడరి యార్చుచును గజుఁడును గవయుండు గంధమాదనుఁడు భుజబలాఢ్యుఁడు శరభుఁడు నుగ్రవృత్తి దట్టించి కోట680యంతటికిని లగ్గ పట్టించుచుండిరి పలుమాఱుఁదిరిగి. కోపించి వానరకోటులు గవిసి యోపినంతంత నొండొరులఁ681ద్రోయుచును నిది 682కొత్తడము కోట యిది దానికొమ్మ యిది యది యని యేమి యెఱుఁగరాకుండ వడిఁగోట లెక్కి683 యాళ్వరులపై కుఱికి పెడబొబ్బ లిడి తమ పేరు వాడుచును నుడుగక684 తమతోఁక లొడిసెలల్ సేసి వడి ఱాలు లోనికి వైచి యార్చుచును మ్రాఁకుల తుదలు సమంబుగాఁబట్టి వీఁక లోపలియిండ్లు విఱుగవైచుచును గుడులు నట్టళ్లును గోపురంబులును బడఁదన్ని కోటపైఁ685బరువులెత్తుచును నట్టళ్లతోడన యసురవర్గంబు నెట్టనఁగూలిన నిలిచి నవ్వుచును నిమ్ముల రూపించి యిదె చూడుఁడనుచుఁ గొమ్ములు విఱుగంగ గుండ్లు వైచుచును దోరణావళులుఁగైదువులు రాక్షసులుఁ జారుపతాకాధ్వజచ్ఛత్రములును 686గోటలుఁగొమ్ములుఁగూలుటచూచి 687వ్రేటున దిక్కులు వ్రీల నార్చుచును ముంచి కొండలు కరమ్ముల బిట్టువట్టి 688దంచనంబుల కివి దంచనా లనుచుఁ గ్రచ్చఱ నటు విఱుగంగవైచుచును మచ్చరంబునఁబలుమాఱును గపులు వడినిట్లు తమచేతివాటులచేతఁ గడుబెట్టిదముగ లంకాపురిలోనఁ గూలెడు మేడలుఁగ్రుంగువాడలును వ్రీలెడుగోడలు విఱుగుమాడువులు నుఱుమైనయిండ్లును నుగ్గునూచైన తఱచు689గుళ్లును ననంతంబులై పడఁగ దానవక్షయకరోత్పాతంబు లనఁగఁ బూని యెంతయు భీతిఁబుట్టించుటయును |