ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
దనుజ వానరుల సంకులసమరము
“నిటు గాననేర మేమెన్నఁడు.”ననుచుఁ
జటులతరాట్టహాసములు సేయుచును
నార్చువానరులపై నా దైత్యులెల్లఁ
బేర్చి యెంతయును గోపించి శూలములఁ
బొడిచియుఁగరవాలములను వ్రేసియును
గడుబెట్టిదంబుగా గదల మోఁదియును
జొచ్చి తన్నియుఁబరశువుల వ్రచ్చియును
గ్రుచ్చి యగడ్తలఁగూలఁద్రోచియును
దంచనగుండ్లచేఁ690దాటించి691కడిమి
ముంచినలగ్గ యిమ్ముల విడిపిం692చి
యలరి రాక్షసు693లార్వ, నా కపులార్వ
నిలయు దిక్కులుఁజలియించె నెంతయును;
గలఁగి దిక్కరులు ఘీంకారంబు లిచ్చెఁ;
బెలుకుఱి యానింగి బీఁటలువాఱెఁ;
గ్రాఁగిన యెసరులగతి నబ్ధు లుడికె;
వేఁగె భూభాగంబు; వెఱచె భూతములు;
కులగిరు694లచ్చనగుండులమాడ్కి
నిలమీఁద నందంద యెత్తెత్తి పడియె;
నురగాధిపతి విషంబొలికెఁ; గూర్మంబు
గిరియు నొండొంటితోఁగ్రిందుమీఁదయ్యె.
నాకారి యప్పుడు నడుచక్కి నున్న
భీకరసైన్యంబుఁబిలిచి యుబ్బించి:
“కడిమిసొంపారంగఁగపిసేన695కోట
వెడలఁ696దాఁకుం.”డని వెసఁబురికొలుప
భేరీరవంబులు భీకర కాహ
ళారవంబులును శంఖారవంబులును
బటహారవంబులు బహుతూర్యరవముఁ
బటుతరనిస్సాణ భాంకారములును
దురగ హేషితములుఁదోరంబులైన
కరి బృంహితంబులు ఘననేమిరవము
లత్తఱి నెసగు భుజాస్ఫాలనములుఁ
జిత్తంబు లగలించు సింహనాదములు
నడరి యొండొండ బ్రహ్మాండంబు లవియ
జడిసి దిగ్దేవతాసమితి భీతిల్ల
బలువిడి రాక్షసప్రవరసైన్యములు
వలనొప్ప నాలుగువాకిండ్ల వెడలె
నటు697శాంతవక్త్రంబునందుఁదక్కంగఁ
బటుభీ698షణాకృతిఁ బ్రళ699యరుద్రునకు
నున్నముఖంబుల700నుడుగక వెడలు
చున్న మంటలమాడ్కి నొక్కట మెఱసి.
వెడలి వానరసేన వెసఁదాఁకునపుడు
తడయక ద్వంద్వయుద్ధమునకుఁ జొచ్చి[వా.రా. సర్గ 43]
కడిమిమై నప్పుడంగదు నింద్రజిత్తు
గడుబెట్టిదంబుగా గదగొని వ్రేసె
వజ్రంబుఁబట్టి పర్వతము701న కెగసి
వజ్రి వేసినక్రియ వారణ లేక;
యంగదుండును బేర్చి యా యింద్రజిత్తు
సంగరంబునఁగిట్టి సమశక్తి మెఱసి
భూరిభూధర702శృంగమునఁబేర్చి వైచి
సారథి రథ రథ్యచయములఁజదిపె.
వారక యేసె దుర్వారుఁడై మూఁడు
క్రూరాస్త్రములఁబ్రజంఘుండు సంపాతి;
విజయుఁడై యతఁడును వెస నశ్వకరణ
కుజ మెత్తికొని ప్రజంఘునిఁబడవైచె.
వినతుని రంభుని వెస నొంచి పెక్కు
ఘనబాణముల నతికాయుండు పేర్చెఁ;
బూని యయ్యిద్దఱు703భూరిశైలముల
వానిసేనను వాని వడి నొంచి రపుడు.
దట్టింపుచును మహోదరుఁడు సుషేణుఁ
గిట్టి యాతని మీఁది కినుకచ్చుపడఁగ
నడరించె బాణంబు లైదును మూఁడు
వెడఁదవక్షంబున విపులఫాలమున;
వాని రథ్యంబుల వాని సారథిని
వాని రథంబుఁబర్వత మొక్కటెత్తి
నలియంగఁ704జాపఁజూర్ణంబులై పోవఁ
జెలఁగి యార్చుచు నా సుషేణుండు వైచె.
మఱి జాంబవంతుండు మకరాక్షుమీఁద
బిఱబిఱఁద్రిప్పుచుఁ బెనుమ్రాఁకువైచె;
నడుమనే యది ద్రుంచి నాటించె నతఁడు
కడుఁబెక్కుశరము లుగ్రస్ఫూర్తి మెఱయ
నతనిభుజంబుల నతనిఫాలమున
నతనివక్షంబున నతిలాఘవమున;
నా జాంబవంతుండు నలుకతో వాని
భాజనంబుగఁజేయఁబర్వతం705బొకటి
వైచిన సారథి వరరథాశ్వములుఁ
జూచునంతటిలోన చూర్ణంబు లయ్యె.
శరములు పెక్కింట శతబలిఁగిట్టి
యురులాఘవమున విద్యుజ్జిహ్వుఁడేయ
నతని వక్షము గాఁడ నత్యుగ్రభాతి
శతబలి యొక్క వృ706క్షంబున వైచెఁ.
బెక్కండ్రుదైత్యుల పీఁచంబు లణఁచి
పెక్కుచందంబులఁబేర్చిన గజునిఁ
దప్పక707ప్రమదుఁడత్తఱిఁజూచి కినిసి
విప్పైన వనచరవిభుని వక్షంబు
శూలంబుఁగొని708పొడుచుటయును709జూచి
సాలవృక్షమున రాక్షసు నగ్గజుండు
వ్రేయంగ నతఁడును వెస మృతుఁడయ్యె
నా యెడ నగచరులార్చి మోదింప.
ననిఁగుంభకర్ణుని యగ్రనందనుఁడు
ఘనుఁడు కుంభుఁడు ప్లవంగములఁబెల్లడరి
కుత్తుకలో వైచికొనఁగ ధూమ్రుండు
నెత్తి వృ710క్షముఁబట్టి యేపుతో వైచెఁ.
గ్రూరుఁడై దేవాంతకుండు గవాక్షు
చారుతరోరువక్షస్‌స్థలం బైదు
శరముల నేసినఁజాల711ంగ నొచ్చి
సరభసవృత్తిమై సాలవృక్షమున
వైచిన వాఁడేడు వాఁడిబాణములఁ
జూచు నంతనె దానిఁజూర్ణంబుసేసి
తొమ్మిది యమ్ములఁ712దూలింప వానిఁ
‘గొ’మ్మని గిరి యెత్తికొనివైచె నతఁడు.
ఋషభుని ముసలాన నేసె సారణుఁడు;
713వృషభుండు సారణు714విపులవక్షంబు
వృక్షంబుఁగొని వైవ విల్లు నమ్ములును
నక్షణంబున వైచి యతఁడు మూర్ఛిల్లె.
గిరిఁబోలుగజము నెక్కిన త్రిశిరుండు
శరభుని తల వ్రేసె715ఁజని తోమరమున;
శరభుండుఁగోపించి716సప్తవర్ణమున
హరి గిరి వ్రేసిన ట్లా త్రిమస్తకుని
వ్రేసి తద్గజమును వ్రేసెఁగూలంగ.
రాసి రాక్షసులకు రాక్షసుండగుచు
ననయంబుఁబేర్చి నరాంతకుండపుడు
పనసునిపైఁ దీవ్రబాణంబు లేయఁ
బనసుండు నాతనిపై వృక్షవృష్టి
ఘనముగాఁగురిసి యుగ్రత చూపె నంతఁ.
బరిఘంబుఁగొని యకంపనుఁడు వ్రేయుటయు
ధరణిపై మ్రొగ్గి యుద్ధతశక్తి నెగసి
కుముదుండు పిడికిటఁ గుపితుఁడై పొడువ
బ్రమసి చయ్యన నకంపనుఁడు మూర్ఛిల్లెఁ.
గిట్టి ధూమ్రాక్షుండు కేసరి మీఁద
నెట్టన నంప717 పెన్నింటను ముంప
వాని సేనలమీఁద వడిఁబర్వతములు
మానక కురియింప మఱివాఁడు విఱిగె.
మండితభుజు గంధమాదనుఁగిట్టి
భండనంబున మహాపార్శ్వుండు దాఁకఁ
దరులను గిరులను దంష్ట్రల వానిఁ
గరమొప్ప నొప్పించె గంధమాదనుఁడు.
తఱచుగా నా వేగదర్శిపై శుకుఁడు
నెఱి నాట నమ్ములు నిగుడించుటయును
వాని రథంబు దుర్వారుఁడై వాఁడు
పూనికతోఁద్రొక్కి పొడిపొడి సేసె.
నడుఁకక తపనుండు నలునకు నెదుర
నడతేరఁగా దొడ్డనగమున నతఁడు
నురువడితోడ గ్రుడ్లుఱుకు నట్లుగను
బెరిగి యాతనిఁగిట్టి బెట్టుగా వైవ
వాఁడిబాణంబులు వడి నలుమీఁద
వాఁడేయుటయు వ్రేసె వాని సాలమున.
గురుతరంబగుశక్తిఁగొని జంబుమాలి
యరుదుగా నురమంట హనుమంతు నేయ
నెఱిజవంబున నాంజనేయుండుఁగినిసి
యుఱక రథంబుపై నుఱికి యుగ్రతను
గిరిశిఖరం718బున క్రియ నున్నవాని
శిర మఱచేత వ్రేసెను వ్రయ్యలుగను.
శరపరంపర విభీషణుని మిత్రఘ్నుఁ
డురువడి నెత్తురు లురల నేయుటయుఁ
గలుషించి యాతఁడు గదఁగొనివ్రేయఁ
దలఁకి మూర్ఛిల్లె మిత్రఘ్నుఁడెంతయును.
వనచరసేనల వారక పట్టి
కొని యవలీల మ్రింగుడు నా ప్రహస్తు
ఘూర్ణితారుణకటాక్షుండయి సప్త
పర్ణవృక్షంబున భానుజుఁ డడిఁచె.
మొనసి యుగ్రత వజ్రముష్టియన్వానిఁ
బెను719పార మైందుండు పిడికిటఁబొడువ
720నా లంకగోపుర మవనీ స్థలమునఁ
గూలెనో యన721ఁదన్నుకొని కూలె వాఁడు.
వినువీథి సురలార్వ ద్వివిదుండు శైల
మున నశనిప్రభు మొగిఁగూలవైచెఁ.
గరమల్క నీలమేఘము సూర్యుఁగప్పు
కరణి నందంద యుగ్రప్రతాపమునఁ
బరగ దివ్యాస్త్రసంపదలచే నీలు
గురుభుజుండైన నికుంభుండు గప్పెఁ;
గప్పిన నీలుండుఁగదిసి నికుంభుఁ
జప్పరించుచు రథచక్రంబుఁ బుచ్చి
రయమున వైచి సారథితలఁ ద్రుంచె
భయమంది వాఁడు విభ్రాంతుఁడై చూడ.
శర 722వర్ష మప్పుడు సౌమిత్రిమీఁదఁ
గురియువిరూపాక్షుఁ గొనక సౌమిత్రి
యొక్క బాణంబేయ 723నొగివాడు శక్తి
దక్కి మూర్ఛిల్లె నుద్దండత ధరణి.
రాముపై సుప్తఘ్న రశ్మికేతువులు
నా మెయి724నగ్ని కోపాగ్ని కేతువులు
భీమప్రతాపులై పేర్చి యంతంత
వేమఱు గర్జించి వెస విజృంభించి
కెరలి మేఘంబుల క్రియ నంప725సోన
గురిసిరి గుణరావఘోరగర్జనల.
నలినాప్తకులుఁడంత నాల్గుబాణముల
నలువురి తల726లను నలిఁ ద్రుంచివైచె.

  1. ↑దాఁకించి
  2. ↑బెటు
  3. ↑ప-న
  4. ↑లు పెల్లార్చిన భీతి
  5. ↑లెత్తిన గుండ్లను
  6. ↑లంక
  7. ↑గొట్టుం
  8. ↑జాత
  9. ↑కరా
  10. ↑యాగ్నిరుద్రుఁ-డున్న (నున్న)
  11. ↑నొగి వెడలించు
  12. ↑పై నలిగి
  13. ↑ము నద్భుతముగా
  14. ↑భుజదర్పమునను
  15. ↑బాఱఁ
  16. ↑బెత్తి
  17. ↑క్షము పూంచి
  18. ↑“ప్రతపనుండు”అని.భా.రా. ‘తపనేన గజః’-అని మూ-
  19. ↑వేగశూరుఁడై పొడిచె
  20. ↑వ్రేసె
  21. ↑క్షంబు లే డేపు
  22. ↑ఁగోపించి
  23. ↑దూపిడ
  24. ↑ఋ
  25. ↑నేసె
  26. ↑శర
  27. ↑సాలవృక్షమున, శైలవృక్షముల
  28. ↑పెన్నిట్ట
  29. ↑బను
  30. ↑మోర
  31. ↑నాలోన వజ్రపాతాహతి నద్రి
  32. ↑వాఁడు గూలె ఘోరముగ
  33. ↑పరంపరలు లక్ష్మణుమీఁదఁ గినుకఁ
  34. ↑నురువడిఁ గాఁడి -తక్కక మూర్ఛచే ధరణిపైఁగూలె
  35. ↑యజ్ఞకోప-మూ
  36. ↑వాన
  37. ↑లుక్రన్ననఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )