| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నా తమ్ముఁజూచితే నలినాప్తతనయ! యా తెఱంగునఁబొంది యిట్లున్నవాఁడు!809 సీతఁగోల్పడి సీతచెఱ మాన్పలేక యీతనిఁగోల్పోవు టిటు సంభవించె810 సౌమిత్రిఁగోల్పడి జనకజ నాకు నేమిటి? కిటమీఁద నేల నా బ్రతుకు? యత్నంబు సేసిన నవనిజఁబోలు పత్ని811నొండొకచోటఁబడయంగవచ్చుఁ గలరు కాంతలు; సుతుల్ గలరు;బాంధవులుఁ గలరుగా; కెందును గలరె సోదరులు? తమ్ముఁడన్ మాత్రమే తలపో812సి చూడ; నిమ్ముల ననుఁగొల్చు నిమ్మహాభుజుఁడు అరయఁగౌసల్యకు నా సుమిత్రకును సరియకా వర్తించు సద్భక్తితోడఁ. దగ లక్ష్మణునికంటె దయతోడ నన్ను మిగుల మన్నించు సుమిత్ర; నా వలన వాత్సల్య813మెప్పుడు వదల; దా పుత్త్ర వత్సలయగు తల్లి వగఁబెట్టవలసెఁ. బురి కయోధ్యకు నేను బోయితినేని భరతశత్రుఘ్నులు భ్రాతృవత్సలులు: “ఎట చిక్కె లక్ష్మణుం? డేలరాఁ.”డనిన నట యేమి చెప్పుదు814నకట! తమ్ములకు? వనటమై నే నొంటి వచ్చుట చూచి: “మనములు గలఁగెడు మాకు నో తనయ; సౌమిత్రితో నేల చనుదేర” వనిన నేమని యుత్తరంబిత్తుఁదల్లులకు? నేమని యూరార్తు నీ మోముతోడ? నేమని యటపోదు నీ మేనితోడఁ? బ్రాలేయశైలంబు పగిలిన, నినుఁడు నేలఁగూలిన, నీరు నిశ్చలంబైన, వనధు లింకిన, గాలి వర్తింపకున్న, ననలంబు కడుఁజల్లనైయున్న నైన నా మాట గడవఁడు; నాకు నప్రియము లే మాటలును నాడఁడెన్నఁడు నీతఁ; డితని చిత్తంబు నాయెడ నొక్క చంద; మితనిఁబోలెడి తమ్ముఁడెందైనఁగలఁడె? యితఁడు నా ప్రాణంబు; లితఁడు నా బంధుఁ డితని నొక్కనిఁబుచ్చి యే నొంటినుండ; నితఁడెందుఁబోయిన నే నందుఁబోదు; నితనితోడిదె లోక; మీ లోకమొల్లఁ. జనుదెంచె నా తోడ సౌమిత్రినాఁడు; చనియెద815నే నేఁడు సౌమిత్రి816వెనుక. హితబుద్ధిఁగార్యంబు లెడపక సేసి 817తతులవిక్రమశాలి; వవి నాకు818ఁదక్కెఁ దరుచరాధిప! వాలితనయుఁదోడ్కొనుచు గిరిచరసేనతోఁగిష్కింధ కరుగు; మే లక్ష్మణునివెన్క నేఁగినపిదపఁ బౌలస్త్యజుఁడు మిమ్ము బాధింపఁగలఁడు జయశాలి యగుచున్న సౌమిత్రి లేని జయము నా కంధునిచంద్రోదయంబు. మద్భక్తుఁడై పూని మారుతపుత్త్రుఁ డద్భుతకార్యంబు లవి పెక్కు సేసె; జలనిధి లంఘించి జనకజఁగాంచి కలనఁబెక్కండ్రురాక్షసుల నిర్జించె. నీ యంగదుండును నీ సుషేణుండు ధీయుతులైన యీ ద్వివిదమైందులును నీ గవయుండును నీ గవాక్షుండు నీ గజుండును 819శక్తి నెనయు నీలుండు మెఱయు సంపాతియు మేటి కేసరియు మఱియుఁదక్కిన వీరమర్కటోత్తములు నా కొఱకై వచ్చి నలినాప్తతనయ! చేకొని లావులు సేసి రందఱును.820 నిక్కాల మిక్కడ నిబ్భంగి మమ్ముఁ ద్రెక్కొన్నవిధి దాటఁదీర దెవ్వరికి? రణభూమిఁబలువుర రాక్షసపతులఁ దృణలీలఁ బొలియించి తీవ్రబాణములఁ బగతుచే నిబ్భంగిఁబడి లోచనములు మొగిచియు భూ రజంబున బ్రుంగినాఁడు! వరతల్పమున నుండువాఁడు నేఁడకట, శరతల్పమున రణస్థలి నున్నవాఁడు. సంకీర్ణరవికుల జలధిపొం గడఁచి క్రుంకెనే లక్ష్మణకువలయప్రియుఁడు.” |