| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అని ప్రలాపింపంగ ననియె నా త్రిజట జనకజ నూరార్చి సదయచిత్తమున:800 “రామున కొకకీడు రాదు; నీ801కేల నీ మెయి శోకిం802ప నిందీవరాక్షి! యట్టిదయైన నీ యగచరసేన యిట్టేల పెద్దయు నేచి వర్తించు? నదె చూడుమా దేవి! యగచరోత్తములు పదిలులై నీ విభు బలసియున్నారు. కాదుపో, యీ పుష్పకంబేల నిలుచు మేదినీతనయ! యిమ్మేదినిఁబడక! (విధవల మోవనివిధి దీనియందు వృథయౌనె నిక్కమై విలసిల్లుఁగాక!) కాన803రామున కొండు గాదు చింతింప; మానిని! నా మాట మనసున నమ్ము. లంకేశుఁ జంపి యీ లంక804సాధించి పంకజానన! నిన్ను భానువంశజుఁడు నలిఁదోడుకొనిపోవు; నమ్ము నా మాట. కలఁగకు805మింక నో కల్యాణి! నీవు.” అనవుడు సీత“మాయామస్తకంబు ననువుగా 806కిది”యని యాత్మలో807నమ్మె సుందరి త్రిజట యశోకవనంబు నందుఁగ్రమ్మఱఁదెచ్చి యవనిజ నునిచె.808 మనువంశతిలకుండు మదిఁదెలివొంది తనకుఁజేరువ నున్న తమ్మునిఁజూచి:[వా.రా. సర్గ 49] |