| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
యంత రావణుఁడు ధూమ్రాక్షుండు వడుట యంతరంగము నెరియంగఁ జేయుటయుఁ గలన దేవతలకుఁగంపింప కునికి గలిగిన వాని నకంపనాహ్వయుని దివ్యాస్త్రశస్త్రప్రదీప్తులవాని దివ్యరథోపరిస్థితి నొప్పువాని బడిబడి నాజికిఁబడవాళ్లఁబనిచి వెడలించె బహుబలవితతితోఁగూడ. మొనసి కాలాంబుదమూర్తియైవాఁడు తనరి భూషణదీప్తధామంబు లడర మణిదీధితుల సూర్యమండలంబగుచుఁ బ్రణుతింపఁగాంచనరథముపై నెక్కి ‘యిదె వచ్చె నాజికి నితఁ.’డని చెప్పు చదురునఁగేతువు చదలఁబెల్లడరఁ గుటిలరాక్షసవీర ఘోషనిస్సాణ పటహభేరీభూరిభాంకృతుల్ సెలఁగ వితతంబుగా లంక వెడలంగఁదోన చతురంగబలము లసంఖ్యమై వెడల నగచరసేనయు నార్చుచుఁదాఁకె గగనంబువగుల రాక్షససేనతోడ. నుభయసైన్యంబులు నుగ్రతఁబేర్చి రభసంబుతోఁదాఁకి రణ మొనరింప నెగసిన కెంధూళి యెల్ల దిక్కులను గగనభూభాగముల్ గప్ప నాలోనఁ జీకటి మిగులఁబేర్చిన చందమయ్యె నా కపిసేనకు నసురసేనకును.858 నప్పుడు తమ తమ యడియాలములను దప్పక రణముఁగొందఱు సేయువారు; పలుకులసన్నలఁబరులని యెఱిఁగి తలకొని పేర్చి కొందఱు పోరువారు; వారు వీరనక యెవ్వరినైనఁదాఁకి దారుణాకృతిని గొందఱు పోరువారు. తరుచరావలి వైచు తరులును గిరులు నురుదైత్యు లడరించు నుగ్రశస్త్రములు బెరసి నల్దెసలకుఁబెల్లుగాఁబఱచి పొరిఁబొరి జలచరంబులభంగి నొంద మానైన ధూళితమఃపటలంబు మానితాంభోనిధిమాడ్కిఁగావించె. నప్పుడు నుభయసైన్యంబులయందు నుప్పొంగుతనువుల నురులు రక్తమున ధరణీపరాగంబు దక్కె నా దైత్య తరుచరపతులు యుద్ధము వేడ్కఁజేయ.859 నా వానరులయుద్ధ మగ్గలంబైనఁ బావకాకృతి నకపంనుఁడు గోపించి నారి సారించి యున్నతసత్త్వుఁడనియె సారథితోడ నుత్సాహంబు మిగుల: “మ్రాఁకులఁగొండల మర్కటసేన వీఁకతో రాక్షసవితతి860నిర్జించె;[వా.రా. సర్గ 56] నా దిక్కునకుఁదేరు నరయంగఁబఱపు మా దర్పమున వేగ.”ననుడు నా క్షణమె వాఁడును బఱపిన వాఁడు నగ్గలిక వాఁడిమిఁదాఁకి యవ్వనచరసేన బెడిదంపుశరములఁబె ల్లేయుటయును జెడి వలీముఖులు నిశ్చేష్టితు861లయ్యు హనుమంతుఁడడరిన నతనితోఁగూడ దనుజసైన్యంబులఁదాఁకిరి బెట్టు. అప్పుడు మేరునగాకృతి నున్న యప్పవనజుమీఁద నయ్యకంపనుఁడు 862వీరరసస్ఫూర్తి వెల్లువదొట్ట ఘోరంపుటార్పు నిర్ఘోషమై పరగఁ గడుఁబెల్లుగా లయకాలమేఘంబు వడువున నురుశరవర్షంబు గురియ నవి గణింపక యట్టహాసంబు సేసి పవననందనుఁడంతఁబ్రళయకాలాగ్ని రుద్రుని863కైవడి రూక్షకటాక్ష రౌద్రరసంబు ఘోరంబుగా నిగుడ విగతభయుండునై వేళ్లతోఁగూడ నగలించి పెఱికి మహాశైల మెత్తి వైచెను నముచిపై వజ్రి వజ్రంబు వైచినచందాన వారణ లేక. దానవుం డర్ధచంద్రప్రదరమున దాని నుగ్గాడ నుద్ధతశక్తి మెఱసి మానితంబగు సత్త్వమహిమ దీపింపఁ గా నగ్నికణములు గన్నులఁదొరుగఁ జని వేగ వేఱొక్క శైలంబు వెఱికి కొనివచ్చి యఱిముఱిఁగ్రూరుఁడై యార్చి కడుబెట్టిదముగ రాక్షసుమీఁద వైవ వడిగొని తుమురుగా వాఁడది ద్రుంచె. దానికి మారుతతనయుండు గినిసి వే నగంబునుబోని వృక్షంబుఁబెఱికి యడుగులబెట్టన నవని గంపింప మిడుఁగురుగములు గ్రమ్మెడుకన్ను లొప్ప మసలక తక్కినమ్రాకుఁలు విఱుగ విసరి యాడుచు దైత్యవితతిపైఁ864గవిసి రథికులఁజంపి రాక్షసులఁగీటణఁచి రథరథ్యములను ధరాస్థలిఁగెడపి కొమ్ములు నెమ్ములుఁగుంభస్థలంబు లమ్మీఁదిజోదులు నంకుశంబులును 865బొరిఁబొరి గంటలు భూషణంబులును జరణ866ంబులును గూడ సామజప్రతతి 867నడపరగా వ్రేసి యందుఁగొన్నింటిఁ బొడిపొడిగా వ్రేసి పుడమిపైఁగలపి తుమురుగా రౌతులతోను గుఱ్ఱముల సమయించి కాల్వురఁజదియంగ మోఁది యంతకాకృతిఁబేర్చుహనుమంతు868మీఁద నంతరంగమునఁగోపావిష్టుఁడగుచు వాటంబుగా దైత్యవరుఁడుచ్చిపాఱ నాటించి యొక పదునాల్గుబాణములఁ గరమునఁగల యశ్వకర్ణవృక్షమును మురియలు గావించి మురియుచు నార్చె నప్పుడు నెత్తురు లడర నశోక మొప్పఁబూచినక్రియ నొప్పి యా869వేళ హనుమంతుఁడొక వృక్ష870మవలీలఁబెఱికి తనర నకంపను తల వ్రేయుటయును బొరిఁబొరిఁబగిలిన పునుకలతోడ నరభోజనుండు ప్రాణంబులు విడిచె లోకంబు లగలఁబెల్లునఁ గొండగూలు నాకృతి బెట్టుగా నవనిపైఁగూలి. వాఁడుగూలిన నంత వానరోత్తము871ల వాఁడిమి కోర్వక వాఁడు దమ్మె872దుర దనుజులు గనుకనిఁదల లోలి వీడఁ జని లంక సొచ్చిరి సంభ్రమించుచును; నగచరేశ్వరులును హనుమంతుకడిమిఁ బొగడిరి తమమనంబుల మెచ్చిమెచ్చి. పరులచే నని నకంపనుఁడు సచ్చుటయుఁ బరితాపమునఁబొంది పంక్తికంధరుఁడు: “మనుజులఁగపులను మరణమొందించి చనుదెమ్ము నీ బలశౌర్యముల్ మెఱసి.” |