ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
మహాకాయుని యుద్ధము
యని మహాకాయుని నప్పుడు పనిచెఁ.
బనిచిన వాఁడును బనిపూని యపుడు
రమణీయతర మయూరధ్వజంబొప్ప
నమితమణిప్రభ లఖిలంబు నిండఁ
బనుగొన్న శస్త్రాస్త్రపంక్తులు మెఱయ
ఘనపిశాచా873నన గార్దభప్రతతి
పూనిన యరదంబుఁబొలుపార నెక్కి
నానాస్త్రశస్త్ర సన్నద్ధసైన్యములు
నడవంగ నిస్సాణనాదంబు లెసగ
నడియాలమైన తూర్యంబులు మొరయఁ
దనరిన దక్షిణద్వారంబు నందు
వినుతవిక్రమశాలి వెడలె వేగమున.
నప్పుడు గురిసెఁ బై నస్థులవాన;
సొప్పడఁబిడుగులు సోనలై పడియె;
గొడగులుఁబడగలుఁగూలెఁ; గూలుటయు
నడరి మహాకాయుఁడవి874యుఁగైకొనక
కడిమి వానరసేనఁగదిసి తాఁకుటయుఁ
బుడమి సలింప నప్పుడు వలీముఖులుఁ
దరుశైలవితతులు తఱచుగా మీఁదఁ
గురియుచుఁదాఁకిరి క్రూరదానవుల.

  1. ↑స్యయుగ్యసహస్రకంబు
  2. ↑యెల్లఁగొనక
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )