| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా కపిసైన్యంబు లణఁగుట చూచి భూకంపముగ మహాద్భుతవృత్తి952నడచెఁ బెరిగి యుద్భటరణాభీలుండు నీలుఁ డురుతరాహంకారహుంకారుఁడగుచు; ధీరుఁడై యపుడు ధాత్రీజంబుఁబెఱికి యా రాక్షసుని తేరి కవలీల నుఱికి యఱిమి సారథి నొంచి హయములఁద్రుంచి యుఱక యా విల్లు మహోగ్రుఁడై విఱువ ముసలంబుఁగొని యార్చి ముదమొప్ప నప్పు డసమున రథముఁబ్రహస్తుండు డిగ్గి నీలుని ముందఱ నిలిచె నెదిర్చి; నీలుండు నెదిరించె నిర్జింతు ననుచు; నొండొరు గెలుచునుద్యోగంబు953లందు గండుమీఱిన వృత్రకౌశికు లనఁగ. నలుక నీలునిఫాల మడిచె నీక్షించి లలిఁబ్రహస్తుఁడు ముసలంబునఁబగుల; నడిచిన నందంద యడరునెత్తురులు దుడిచికొంచును బ్రహస్తుని బిట్టు గిట్టి వ్రేసె నన్నీలుండు వృక్ష954సంహతిని; వ్రేసిన ముసలాన వ్రేసె నయ్యసుర; వ్రేసిన సోలి యా వృక్షంబు విడిచి యా సమయంబున నందంద కదిసి యార్చుచు నతఁడు ప్రహస్తు మస్తకముఁ బేర్చి వ్రయ్యఁగ వైచెఁబెనుగిరి యెత్తి. యా నీలువ్రేటున కా ప్రహస్తుండు మేనును శిరమును మెయిభూషణములు జెదరి వృత్రారిచేఁజెలువెల్లఁ బొలిసి కుదిసి ధారుణిఁగూలు కొండ చందమునఁ బడుటయు నా కపిబలమెల్ల నార్చెఁ; జెడి పాఱి లంకఁజొచ్చిరి దైత్యు లంత. సురుచిరామృతవార్ధిసుతయునుబోలె హరియుతమైన నిజాంగంబు గల్గి, వరదానశీలు వాసంబుఁబోలెఁ గరమొప్ప నధికమార్గణకోటి గల్గి, దీపించు నేరేడు దీవియుఁబోలె రూపింప నవఖండరూపంబు గల్గి, వలచినపతియొద్ద వనితయుఁబోలె సలలితరాగరసంబును గల్గి, కడిఁదియై చొరరాని కానయుఁబోలెఁ గడునొప్పుపుండరీకంబులు గల్గి, చారువసంతమాసంబును బోలె నా రక్తఫుల్లపలాశాలి గల్గి, 955సడలని మృడునివాసంబును బోలెఁ గడఁగి యాడెడు భూతగణములు గలిగి కమలాప్తరుచి నొప్పు గగనంబుఁబోలెఁ గ్రమముదప్పిన తారకంబులు గలిగి సరభసంబైన వేసవియునుఁబోలె సురుచిరాంబర మణిస్ఫురణంబు గలిగి కలసిన శివుఁడును గౌరియుఁబోలెఁ దలపోయఁగా నర్ధతనువులు గలిగి956 పెక్కుచందంబులఁబెంపు సొంపారి యక్కజంబయ్యె రణావనీస్థలము. అంత నీలుఁడు రాఘవాధీశుకడకు నెంతయు వెసఁజని యెఱగె నంఘ్రులకుఁ. బొగడిరి కపులెల్లఁబొరిఁబొరి నీలుఁ. దెగని రాక్షసులు భీతిలి పాఱి చెప్ప విని రావణుఁడు శోకవివశుఁడై మంత్రి జనులతో ననియె నచ్చల మగ్గలించి:[వా.రా. సర్గ 59] “యే వీరు లరిగిన నిటు రాక957 లేక యా వానరులచేత నచటఁద్రుంగెదరు. వైరుల వలని గర్వం బడఁగింప నే రూపముననైన నేనె పోయెదను.” |