ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
మందోదరి హితోపదేశమును రావణుఁడు తిరస్కరించుట
నని దైన్యపాటుతో నాడు వాక్యములు
విని రావణుఁడు కడువేఁడియూర్పడరఁ
గలయంగ నెఱ్ఱనికన్నులఁగోప
మొలుకుచు నుండ మందోదరిఁజూచి:
“హిత967మతివై నాకు నిన్నియుఁజెప్పి
తతివ! నీ మాటలయం దొక్కటైన
మనసునఁబట్టదు. మగఁటిమి క968లిమి
ఘనుఁడనై మూఁడులోకంబులు గెలిచి
దానవయక్షగంధర్వదేవాదు
లైనను వెట్టిసేయఁగ నున్న నన్నుఁ
దుదిఁబోయి969యింకఁగ్రోఁతులమర్వుసొచ్చి
బ్రదికెడు నరునకుఁబ్రణమిల్లు మనుచు
నిది యెట్టిమాటగా నీ సభ నాడి
తిది970నీకుఁబాఁడియే? యిక్ష్వాకుకులజు
డెఱిఁగి యెఱింగి మున్నెగ్గొనరింప
మఱికదా తెచ్చితి మనుజేశుదేవి.
జడమతి971నై పోయి సంధి972గావించి
కడఁగి ఖరాదులఁగడతేర్చినట్టి
పగయు నీ మఱఁదలిబన్నంబు నెట్టి
పగిది నీ973గుదును! జొప్పడ; దటుగాన
భీమబాణముల విభీషణు నినజు
రామలక్ష్మణుల మర్కటులను ద్రుంచి
గెలుతు నవశ్యంబు; గెలుపు లేదేని974
ఁజల మొప్ప దురమున సమయుదుఁ;గాని
మానవేశ్వరుతోడ మఱి చేయ సంధి;
జానకి నీను; నిశ్చయ మిట్టి దతివ!
యా యింద్రజిత్తుఁడుదాత్త విక్రముఁడు
నీ యగ్రసుతుఁడుండ నీ కేలవగపు?
నా కెదురెవ్వరు? నా తనూభవులు
భీకరాకారు లభేద్య విక్రములు.”
నన విని చింతించి యవనత యగుచుఁ
జనియె మందోదరి సభ975నెడఁబాసి
నీచమైనట్టిదుర్నీతి చేపట్టి
యే చందమునఁ దన్ను నెఱుఁగఁడటంచు
రమణీయతరమైన 976రావణలక్ష్మి
క్రమమేది తొలఁగెడి కైవడి దోప.

  1. ↑మైత్రివగు, కారివై
  2. ↑డి
  3. ↑యిపుడు
  4. ↑నాకు
  5. ↑నతనితో
  6. ↑చేసినను-గ
  7. ↑గఁగను… నటు
  8. ↑నిల రాముశరముల నీఁగుదుగాని
  9. ↑లోనఁ
  10. ↑రాక్షస
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )