| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అనిన విభీషణుఁడా రాముఁజూచి: “దనుజనాయకుల నందఱఁబేరువేర వినుము శ్రీరఘురామ! విన్నవించెదను దనరంగ.”నని వారిఁదగఁజెప్పఁదొడఁగె: “వాఁడె బంధురగంధవారణేంద్రంబు వాఁడిమి నెక్కి యుజ్జ్వ991లుఁడైనవాఁడు, నుదయార్కబింబసముజ్జ్వలాస్యమున నొదవినఘనరోష మొప్పినవాఁడుఁ, బొరిఁబొరి నంకుశంబున నియమించి కరి992జాళిసేయింపఁగడఁగెడువాఁడు, నురువడిఁజనుదెంచుచున్నట్టి వీరుఁ డురుబలాఢ్యునిఁగంటె యూపాక్షుఁడతఁడు. కడునొప్పు భీకర ఘంటారవంబు లడరెడు రథమెక్కి యా వచ్చువాఁడు పోరిలోఁబెక్కండ్రఁ బొరిగొన్నవాఁడు ధారుణీశ్వర! మహోదరుఁడనువాఁడు. భరితరత్నప్రభా పటలంబుతోడఁ బరపైన యరుణంపుఁబక్కెర వెట్టి గరుడవేగంబుచే ఘనమైనయట్టి తురగంబు నెక్కి యుద్ధురవృత్తితోడఁ జనుదెంచువాఁడు పిశాచనాథుండు; ననికి నీతని కెదురగువారు లేరు. మిక్కిలి కడిమిమై మెఱసి సింహంబు నెక్కి శూలముఁబట్టి యేతెంచువాఁడు, ననిమీఁదివేడుక నలరినవాఁడు, దినకరకులనాథ! త్రిశిరుండు వాఁడు. పృథులఘంటారవస్ఫీత మైనట్టి రథమెక్కి వడి గుణారవము సేయుచును ఘనసర్పకేతువు గలిగినవాఁడు ఘననీలతనుఁడు రాక్షసుఁడు కుంభుండు. కనకమహామణిఖచితమౌ పడగఁ దనరారు చిత్రరథంబుపై నెక్కి యరుగుదెంచుచునున్న యా రాక్షసుండు గురుభు993జుండైన నికుంభుండు దేవ. యనలసన్నిభమైన యరదంబు నెక్కి ఘనగర్వమున మీఱి కయ్యంబు సేయఁ గలవాఁడు వాఁడె యీ కపిసేనదిక్కు సొలవక994విషదృష్టిఁజూచుచున్నాఁడు శర మటువింటితో సంధించుకొనుచు నరుదెంచువాఁడు నరాంతకుం డధిప. భీషణరూపమై పేర్చు వాక్యముల రోష మొల్కెడు మిడిగ్రుడ్డులతోడఁ గరివక్త్రముల ఘోటకముల వక్త్రముల హరివక్త్రములఁగిటివ్యాఘ్రవక్త్రముల నురగవక్త్రంబుల నుష్ట్రవక్త్రములఁ గరముగ్రులైన రాక్షసు లుత్సహించి కొలువ భూతంబులు గొలు995చు ఫాలాక్షు నల996వాటువాఁడు దేవాంతకుం డధిప! ఘనమైన ఘోషంబు గల పైఁడిరథముఁ దనరార నెక్కి యుద్దండ 997చాపమ్ము నతితృణీకృతలోకుఁడై గుణారావ మతిశయిల్లఁగఁ998 బట్టినంతనుండియును నెన్నఁడు నోటమి నెఱుఁగనివీరుఁ, డన్నరభోజను నాత్మసంభవుఁడు, నరుణచందనము మై నలఁదినవాఁడుఁ దిరమైన యరుణంపు దృక్కులవాఁడు, సంధ్యాంబుద999ంబు మై చందంబువాఁడు, వింధ్యాచలముఁబోలి విలసిల్లువాఁడుఁ గోటానఁగోటులు గొడుగులచేత మేటిచామరముల మెఱసినవాఁడు నవధరింపుము దేవ! యతికాయుఁడాతఁ డవనీశ! యాజికి నధికశూరుండు. భూరి సితచ్ఛత్రములు పదివేలుఁ జారుచామీకర చామరావళులుఁ బరగంగ సింగంపుఁబడగయుఁగ్రాలఁ బరపైన ఘోటకప్రతతుల నొప్పు నరదంబుమీఁద గుణారవంబెసగ భరితశస్త్రాస్త్రసంపద దేజరిల్ల నజునివరంబున నఖిలదేవతల భుజబలస్ఫీతుఁడై పోరిలో నొంచి సురపతిఁ జెఱపట్టి సొంపారునట్టి వరగర్వమునఁగడువాలినవాఁడు, నిచ్చ1000లో మనమీఁద నిడిన చూపడర వచ్చుచునున్నాఁడు వాఁడింద్రజిత్తు. ఇంకఁజూపెదఁజూడు మినకులాధీశ! లంకాధినాథు నుల్లసితప్రతాపుఁ; గనకరత్నప్రభాకలిత దండములఁ బొనరినచామరంబుల నుల్లసిల్లి సొలవక పండ్రెండు సూర్యబింబములఁ గలయంగ దశకంబుగాఁగరఁగించి చేసినపగిది విచిత్రరత్నాంశు భాసురకోటీరపంక్తి నొప్పారి మహనీయతరమైన మణికుండలముల మహిమ దిక్కులనెల్ల మట్టాడుచుండ రోషమహాదృష్టిరోచులఁ జాల భీషణాకారతఁ బేర్చినవాఁడు, హరుఁడున్న కైలాస మగలించినాఁడు సురకామినులఁజెఱఁ జొనిపినవాఁడు, లోకంబులెల్లఁబెల్లుగ గెల్చినాఁడు, బాకశాసను ననిఁబఱపిన వాఁడు, నైరావతము దంత1001మాడిన యురము తో రమణీయమై తోచినవాఁడు, వాఁడె సేనామధ్యవర్తి యైనాఁడు వాఁడు వో దేవ! రావణుఁడనువాఁడు.” నని విభీషణుఁడోలి నందఱఁజెప్ప విని రాఘవుడు కడు విస్మయంబంది: “యారయఁజిత్ర మీ యసురేశ్వరుండు సారమైనట్టి తేజంబు రూపైన యట్టిచందంబువాఁ; డసురులయందు నిట్టి తేజోధనుండెవ్వఁడు గలఁడు? కడుఁగ్రూరకర్ముండు గాకుండెనేనిఁ బుడమికింతటికిని బూజ్యుండు గాఁడె? పరికింప నందఱుఁబర్వతాకృతులు నురుశక్తి గలిగిన యోధులుఁ గ్రూర చరితులు మఱి వీని సైనికులెల్లఁ గరము భీషణులు రాక్షసవీరు.”లనుచు నుగ్రలోచను పినాకోగ్రచాపంబు నిగ్రహక్రమకళానిపుణుడై నృపుఁడు ధరియించెఁగడఁకతోఁదాను, లక్ష్మణుఁడు వర బాణచయములు వరుస నుప్పొంగఁ “గోపించి యు1002ను ధర్మగుణమె చేపట్టి రీ పార్థివులకు నీ డెవ్వ?”రనంగ. నా రావణుం1003డప్పు డఖిలనిశాట వీరుల వీక్షించి“వినుఁ”డని పలికె: “నగరివాకిండ్ల నున్నతితోడఁబెద్ద మొగసాలయందును మోసంబు లేక కడు సురక్షితముగాఁగావలియుండుఁ డడరి యీ లంకలో నందఱుఁబ్రీతి. నేనును మీరును నిటు కయ్యమునకు మానుగాఁబోయిన మఱి వలీముఖులు లంకఁజొచ్చిన మన లావేమిసేయు? శంకింప వల.”దన్నఁజని రంతవారు; చనిన రావణుఁడంతఁజటులవేగమున ధనువును నస్త్రముల్ ధరియించి మించి కార్చిచ్చు వనము లుగ్రంబుగాఁగిట్టి యేర్చుకైవడి దోప నిమ్ములఁగదిసి జగతీతలము నాకసముఁదాఁకుకరణి నగచరసైన్యంబు నదరంటఁ దాఁకి యిది ధరణీభాగ; మిది వియత్తలము; నిది దిశావలి యని యేర్పడకుండ నతి నిశితాస్త్రంబు లందంద పఱపి యతుల బలోదగ్రుఁడై నిశాచరుఁడు కలఁచి కొందల మందఁగాఁజేసి కపులఁ జులుకన ఖండించి చూర్ణంబు సేసి యెమ్ములు మజ్జంబు నెఱచియు మెదడుఁ గ్రమ్మి నెత్తురు నేలఁగలయంగ నించి తనరి యార్చుచు గుణధ్వని దిక్కులందు నినిచి ఘోరాజిలో నెఱయఁబేర్చుటయు బడియెడు వానరుల్ భ్రమయు వానరులు మడియు వానరులను మ్రగ్గు వానరులు నొఱలు వానరులును నులుకు వానరులు నఱచు వానరులు రూపఱిన వానరులుఁ గలిగిన సంగరాంగణమును జూచి తలఁకిరి సురలు చిత్తంబులు1004చెదరఁ. గాలకాలానల కాలదుర్వార కేళీకరాళుఁడక్షీణుఁడై యపుడు పే1005ర్చి కోపంబున భీషణుండగుచు నార్చుచునున్న దశాననుఁజూచి యతనికి నెదురుగా నరిగి సుగ్రీవుఁ డతిరయంబున నొక్క యగమెత్తివైవ నా రావణుండును నది మధ్యమునను భూరిశరంబులఁబొడి సేసి మఱియు నొండొండ ఘనదీప్తులొదవ నాకసము నిండి మండుచునుండు నిశితాస్త్ర మినజు నురమాడ నేసిన నుచ్చి యా యమ్ము ధరఁగాఁడె; నత్తఱి దానవు లార్వఁ దరుచరులెల్ల నుద్గతబాష్పధార లురలింప నర్కజుఁడొఱలుచుఁగూలె. భుజబలాఢ్యులు ఋషభుఁడు సుదంష్ట్రుండు గజుఁడు గవాక్షుండు 1006గవయుండు నలుఁడు జ్యోతిర్ముఖుండదిచూచి కోపమున నాతతగతిఁ బర్వతావనీజమ్ము లడరించి రతనిపై; నవియెల్ల నతఁడు నడుమనె తునిమి వానరుల నేడ్వురను నొక్కొక్కయమ్మున నుర్వరమీఁదఁ గ్రక్కునఁజచ్చినగతి నుండ నేసె. |