| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా లోన హనుమంతుఁ1007 డా యూధపతులు గూలుట గనుఁగొని కోపంబుతోడ నసురాధినాథుని యరదంబుమీఁది కసమున లంఘించి యతనితో ననియె: “దేవేంద్రుఁడాదిగా దివిజసంఘముల రావణ! మఱి యక్షరాక్షసకోటిఁ ద్రుళ్లడంచితి నని త్రుళ్లెద వీవు: చెల్లదు; నీలోని చేవడఁగింతు; నున్నతిఁజిరకాల ముర్విపై బ్రదికి యున్న నీ మీఁద నా యున్నతంబైన వలకేలు నేఁడు రావణ! యిదె చూడు మలమి సాగెడుఁ దన యంతన పేర్చి. యిదె నిన్నుఁబొరిగొని యేచి యంతకుని సదనంబు1008ఁజేర్పక సైఁపదు నిజము.” అని పేర్చి పలికిన హనుమంతుమాట విని రావణుఁడు క్రోధవికృతాస్యుఁడగుచుఁ “గలితనంబును లావుఁగలదేని నీవు నలు1009వొప్ప నుప్పొంగి నను మున్ను పొడిచి పేరుకొ మ్మటమీఁదఁ బేర్చిన నీదు శూరతయును లావుఁజూచి యే నేచి పొడిచెద.”ననుడు నద్భుత1010శౌర్యుఁడగుచుఁ గడఁగి మారుతి దశకంఠునిఁజూచి: “దేవదేవుఁడు రామదేవుండు వనుప నీ వీటిలో మేదినీపుత్త్రి వెదకి తడయక పొడగాంచి తగ విన్నవించి వెడలి యేఁబోవుచో విక్రమస్ఫురణ నీ తోఁట నుగ్గాడి నీ లంకఁగాల్చి నీ తనూభవుఁజంపి నిన్ను దట్టించి యుక్కఱి నిల్చి దైత్యులు సూచుచుండఁ జక్క నెప్పటిత్రోవఁజన్న నా లావు “నేఁడు చూచెద.”నని నీవాడె దుబ్బి; నాఁడెందుఁబోయితి నాకారి, నీవు.” అనవుడుఁగోపించి హనుమంతువక్ష మనువొప్పఁబొడిచె నయ్యసురేశ్వరుండు పొడిచిన1011స్రుక్కియుఁబోవక యతఁడుఁ బిడికిట రావణు బెట్టుగాఁబొడిచెఁ. బెనుగాలి పొదివినఁబెద్దగంపించు ఘనవృక్షమునుబోలెఁ గంపించె నసుర. యంతట నొచ్చినయసురేశుఁజూచి యెంతయు1012నార్చి రయ్యింద్రాదులెల్ల. దనుజాధిపతియు నంతట మూర్ఛదెలిసి హనుమంతుఁజూచి యిట్లను:“నీ బలంబు కడుమెచ్చు వచ్చు; నీ ఘనముష్టిహతిని గడఁకతోఁబ్రేతలోకముఁజూచివచ్చె దేవారి.”యనుడు నద్ధీరాత్ముఁడనియె: “రావణ! విను మీవు ప్రాణంబుతోడ నున్నవాఁడ! విదేల యుఱక నా లావు సన్నుతించెదు! లజ్జ జనియించె నాకు.” 1013నని పల్కి:“నీవు నన్నట పిడికిటను గొను మొక్కపో.”టన్నఁ“గొను.”మని యతఁడు ననయంబుఁగోపించి యనిలనందనుని ననుపమాశనికల్పమగు ముష్టి నార్చి వక్షంబుఁబొడిచిన వడి మూర్ఛనొంది యక్షణంబునఁద్రెళ్లె నవనిపై నాతఁ. |