| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నరిగి దశాననుండంత లక్ష్మణుని నిరువదిచేతుల నెత్తఁబూనుటయు నాతఁడు విష్ణునియంశజుండగుట నే తెఱంగున వాని కెత్తరాదయ్యె. “నెత్తరాకుండిన యేనిఁ గైలాస మెత్తితి నగలించి యే నట్టు లడరి. మఱి మేరువైనను మందరంబైన నెఱయ నెత్తఁగ నోపునిజశక్తి నాకు. వీఁడింతవ్రేఁగౌట విస్మయం.”బనుచుఁ బోఁడిగాఁగరములఁబూన్చి రావణుఁడు అతులసత్త్వోన్నతి నందంద యెత్త మతిలోనఁగోపించి మారుతి కడఁగి పఱతెంచి నిర్ఘాతపటుముష్టి నార్చి కఱకు రాక్షసుని వక్షస్‌స్థల మగలఁ బొడుచుటయును మూర్ఛఁబొంది రావణుఁడు కడుఁదూలి యంత మోఁకాళ్లుమోవంగఁ బడియెఁబిఱిందికిఁబదమిడ లేక. పడిన రావణుని యప్పటిభంగిఁజూచి యార్చిరి దేవత; లప్పుడు కపులు పేర్చిరి; దైత్యులు భీతిఁ1031జేడ్పడిరి. పావనియును విష్ణుభక్తుండుగాన రావణునకు నెత్తరాని లక్ష్మణుని గురుసత్త్వమున నెత్తికొని పోయి రామ ధరణీతలేశుముందఱఁబెట్టె నపుడు. రాముతేజమునఁబరాజితంబగుచు సౌమిత్రి 1032నాటినశక్తియు1033నూడి యసురేశురథమున కరిగె; సౌమిత్రి యసమానబలశాలియై మూర్ఛఁదెలిసె. |