ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు బ్రహ్మశక్తిచే లక్ష్మణుఁ గూలనేయుట
నంత ధనుర్ఘోష మడర సౌమిత్రి
యంత1024కంతకుఁబేర్చి యద్దైత్యుఁదాఁక
నగ్గుణారావంబు నతనిసాహసము
నగ్గించి యతనితో ననియె రావణుఁడు:
“పిన్నవై యుండియుఁబేర్చుచు ననికి
సన్నద్ధగతి నీవు చనుదెం1025చు టొప్పుఁ;
బుచ్చెద నంతకుపురికి లక్ష్మణుఁడ!
యిచ్చ1026ందమున నిల్వు మించుక తడవు.”
అనవుడు విని రాఘవానుజుండనియె:
“దనుజాధముఁడ! యీ వృథాగర్వ మేల?
డాసినవాఁడ; మాటలు1027పెక్కు లుడిగి
చేసి చూపుదుగాక చెలఁగి నీలావు.”
ననిన, సౌమిత్రి నే డమ్ముల నేసె.
దనుజునియమ్ము లుద్ధతి లక్ష్మణుండు
నడుమనె త్రుంచెను. నాకారి యప్పు
డడరెడు క్రోధముదగ్రమై పర్వ
ఘనతరజ్యానాదకలితంబుగాఁగ
ననయమ్ము నిగుడించె నమ్ములవాన.
నా యంపతండంబులన్నియుఁద్రుంచి
వేయేసి శరములు వెస నేసె నాతఁ.
డా యస్త్రములకు మాఱైనయస్త్రంబు
లేయ నేరక యసురేశ్వరుండపుడు
తలకొని యొక బ్రహ్మదత్తబాణమున
లలితవక్షంబేయ లావెల్లఁదూలి
విల్లూఁతగా నిల్చి వేగంబె తెలిసి
పెల్లుగా నార్చుచుఁబేర్చి లక్ష్మణుఁడు
ఘనబాణమొకట రాక్షసనాథువిల్లుఁ
దునిమి యంతటఁబోక దోర్బలంబెసగ
మూఁడగ్నులనుబోలుమూఁడుబాణముల
వాఁడిమి మిగులంగ వక్షంబు నేసె.
వ్రేసిన మూర్ఛిల్లి వేగంబె తెలిసి
యాసన్నసత్త్వసమగ్రుఁడై 1028కదిసి
తన విల్లు విఱి1029చిన దానికి నసుర
మనమునఁజాల విస్మయమునఁబొంది
కలుషించి నిచ్చలు గంధపుష్పముల
నలవడఁబూజింప నమరినదాని,
నిలయు బ్రహ్మాండంబు నెల్లదిక్కులును
వెలుఁ1030గొందుమంటల విలసిల్లుదాని,
నడరెడు పదికోటు లశనులఁబోలి
కడుబెట్టిదపుమ్రోఁత గలిగినదాని,
నలినమిత్రుని కిరణంబులకంటె
వెలిఁగెడు నుగ్రంపువేఁడిమి దాని,
ననిమిషుల్‌ వెఱఁగంద నా బ్రహ్మశక్తిఁ
గొని లక్ష్మణునిమీఁదఁ గ్రూరుఁడై వైచె.
వైచినఁగాలాగ్ని వడువునఁబెద్ద
యేచి వజ్రమునకు నెక్కుడై నిగుడి
యనిమిషావలియెల్ల నాహారవంబు
లొనరింపఁబఱతెంచు నుగ్రత సూచి
వారింప నమ్ములవాన లక్ష్మణుఁడు
ఘోరతరంబుగాఁగురియంగఁగొనక
యది వచ్చి భుజమధ్యమందు లక్ష్మణుని
వదలక తాఁకిన వసుధపైఁబడియె.

  1. ↑కుగతిఁ
  2. ↑చినావు -పు
  3. ↑బెగ్గిలకుండు
  4. ↑చెప్ప కీవు
  5. ↑కినిసి
  6. ↑గి
  7. ↑గుచు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )