| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నెఱయంగ నిరుమూఁడునెలలు నిద్రించి మఱి మేలుకని సభామంటపంబునకు నలరి యేతెంచి మంత్రాలోచనంబు పొలుపారఁగావించి పోయి క్రమ్మఱను నేఁడు తొమ్మిదినాళ్ల నిద్రమై నున్న వాఁడు; శత్రులనెల్ల వధియింపఁగలఁడు. ఆతని మేల్కొల్పి యతులవిక్రముని నే తెఱంగుననైన నిటకుఁదెం.”డనిన బహుగంధపుష్పముల్ భక్ష్యభోజ్యములు బహువిధంబులఁగొని పఱచి రాక్షసులు నాతతానం1047తభోగాస్పదంబగుచుఁ బాతాళమునుబోలెఁ బరగెడుదాని, మహనీయశతకోటిమహిమచే నింద్రు మహితాలయముఁబోలె మానైనదాని, నిఖిలంబునందును నెగడు తేజమున శిఖినివాసముఁబోలెఁ: జెలువైనదాని, సమధికంబైన భీషణవృత్తి గలిగి యమ నివాసముఁబోలె నమరినదాని, వివిధ మేదోమాంసవితతిఁగ్రవ్యాదు భవనాంగణముఁబోలె భాసిల్లుదానిఁ, నిరుపమతరవారుణీయుక్తమగుచు వరుణాలయముఁబోలె1048వాలినదానిఁ, దిరమైన యా సుగంధిశ్వసనముల మరుదాలయముఁ బోలె మలసెడుదాని, విలసిత నిధులచే వెలసి కుబేరు నెలవునుబోలె వర్ణితమైనదాని, నురువిభూతికినెల్ల నునికిపట్టగుచు హరునివాసముఁబోలె నలరినదానిఁ, గలిగిన పద్మరాగ ప్రభావళుల నలువ యున్నెడఁబోలె నలువైనదాని, నఖిలాశలఁద్రియోజనాయతంబగుచు సుఖతరంబగు గుహ సొచ్చి యచ్చోట 1049నా విపులపుటూర్పు లడరినఁదూలి లావున నెట్టకేలకుఁజేరఁబోయి కడునొప్ప నెంతయుగరగరనైన వెడలుపుగల హేమవేదికమీఁద నంసంబుతోఁగపోలాం1050కంబుఁజేర్చి హంసతూలికతల్పమందు 1051శయించి యుడుగక తఱచైన యూర్పులతోడ బెడఁగైన యా ఘర్మబిందులతోడఁ గరమొప్ప మోడ్చినకన్నులతోడఁ దరమైన కపురగంధపుఁబూఁతతోడ నురమున నెంతయు నుజ్జ్వలంబగుచు నెరసిన మణిహార నికరంబుతోడ సల్లలితానంద సంపదతోడ నెల్లప్పుడును దన్ను నెఱుఁగమితోడ సరస నిద్రాంగనాసంభోగకేళిఁ బరిణమించినభంగి భాసిల్లువానిఁ బలుమాఱు దివిజులభం1052జించునట్టి కల లర్థిఁగను కుంభకర్ణునిఁగనిరి. కని“యిట్టివాని1053 కీ ఘననిద్ర యిచ్చె వనరుహాసనుఁ.”డని వగచుచు నప్పు డాతనిముందర నన్నరాసులును బ్రాతిగా మహిషవరాహమాంసములుఁ బోసి యంచితగంధపుష్పార్చనములు చేసి ధూపంబులు చెలువొప్ప నిచ్చి పొరిఁబొరి బహుదీపములు నివాళించి కరములు మొగిచి పొగడ్తలు నెఱపి పిడుగులు మ్రోసినపెక్కువకంటె నెడప కార్చుచు బొబ్బలిడుచుఁజీఱుచును నురువడి శంఖంబు లూదుచు బెట్టు మొరయంగ నిస్సాణములును భేరులును జెందివ్రేయుచుఁదోనసింహనాదములు నందంద చెలఁగింప నమ్మహారవము దక్షతఁబాతాళతలము దిక్కులును నక్షత్రపథమును నాకంబు నిండె. నంతకుఁదెలియక యా కుంభకర్ణుఁ డంతకంతకుఁగడు నగ్గలంబైన నిదురవోవఁగఁజూచి నిఖిలరాక్షసులుఁ గదలును ముసలముల్ ఘనముద్గరములుఁ బెనుపారు1054పట్టిస భిండిపాలములు మునుమిడి యందఱు ముసరివ్రేయుచును బదివేలకుంతముల్ బరులఁగ్రుమ్మియును వదలక కొండలు వైచియుఁబోక యురముపై నందంద యుఱికి పాదములఁ గరము మెట్టియు మేలు కాన్పంగలేక తడఁబడ సింహనాదములు సేయుచును గడు బెట్టుగాఁగ శంఖంబు లూదుచును బటునాదములు గ్రందువడఁగుంభవాద్య పటహ భేరీభూరిబహుతూర్యములును దొడరి మ్రోయింపుచుఁదోడన మఱియు నుడుగక పదివేవు రుగ్రరాక్షసులు క్రందుగా నిస్సాణఘనత రారావ మందంద చెలఁగింప నా రభసమున నీలాద్రియునుబోలి నిశ్చలుండగుచు నా లోనఁ దెలియక యతఁడున్నఁజూచి కరుల హయంబుల ఘనతరోష్ట్రముల నురు లులాయములచే నుఱ1055కత్రొక్కించి కొంకక మేనెల్ల గుదియల మోఁది యంకించి సకలవాద్యములు వాయింప లంక గంపించి కోలాహలంబయ్యె; శంకించె నవ్వనచరసేనయెల్ల. నిటు సేయునప్పుడు నేమియుఁదెలియ కటునిద్రవోవంగ నఖిలరాక్షసులు కొందఱు దిక్కులు ఘూర్ణిల్ల భేరు లందందవ్రేయుచు నధికదర్పమునఁ, గొందఱు పర్వతగుహలెల్ల నద్రువ దందడి సింహనాదములు సేయుచును, గలయంగఁగొందఱు కరములఁబెనఁచి పెలుచ శిరోజముల్ వెఱికివైచుచును, గొందఱు ఘనకర్ణకుహరముల్ సొచ్చి క్రందుగా గూబలు గఱచి పట్టియును, నటు ఘోరమగుబాధ లడరించి మఱియుఁ బటుగదా ముద్గర ప్రాస ఖడ్గముల ముసలంబులను బెట్టు మొగము నురంబు మసల కందఱుఁబలుమఱు వ్రేయ నేయఁ దన నిద్ర యించుక దఱిగి యంతటను మనుజాశనుండొక్క మఱి యావులింపఁ దఱచు1056గాఁబెక్కువిధంబులఁజుట్టి యిఱియమ్రోఁకుల సంధులెల్ల బిగించి తెరలఁ 1057గ్రాఁగిననూనెఁదెచ్చి కర్ణములఁ గర ముగ్రముగ వేయుఘటములు వోసి మునుకొని యాతని ముకుగోళ్లయందు 1058ఘనమైనపారలఁగనలఁబెట్టియును నేక యత్నంబున హేమదండముల భీకరగతిమ్రోయ భేరులు వ్రేయ విడువక కరిహయవితతి నురంబుఁ గడఁగి త్రొక్కింప రాక్షసుఁడు 1059శంకించి చక్క శే1060షోగ్రహస్తంబులు సాచి యొక్కింత మేల్కని హుమ్మని నీల్గి బడబాముఖాభమై పరగిననోరు కడుఁజూడ వికృతంబుగా నావులించి “యుఱవైనయట్ట్టి సాయుజ్యపదంబు నెఱయంగ రాముండు నేఁడు నాకిచ్చు; నీ1061రీతి నిద్ర నాకే?”లని దాని దూరంబుగాఁ1062బెడఁద్రోచెనో యనఁగఁ. గనువిచ్చి యసురులు గంపింప మేలు కని కుంభకర్ణుఁడుగ్రతఁగూరుచుండెఁ బ్రళయకాలమునాఁటి భానుబింబంబు చెలువంబుతో మోము జేవుఱింపఁగను, బటువింధ్యగుహలలోపలనుండి వచ్చు చటులానిలంబులసరియూర్పు లెసగఁ, బ్రళయకాలార్కబింబంబులుఁబోలెఁ గలయంగ నెఱ్ఱనికన్ను 1063లు మెఱయ. దానవులిట్టు లాత1064ఁడు మేలుకొనఁగ దానవేశ్వరునియొద్దకుఁ1065బోయి నిలిచి: “దేవ! నీ తమ్ముఁడెంతేనియు బాధ గావింపఁగా మేలుకనియె; నింతటను నటు కయ్యమునకుఁబొమ్మందుమో? కాక యిటు తోడితెత్తుమో? యే తెఱం?”గనుడు రాగిల్లి“తోడ్కొని రండు.1066”నావుడును వేగంబె యా దైత్యవిభునాజ్ఞ వచ్చి తన కట్టెదుర నున్న దానవప్రతతిఁ గనుఁగొని యా కుంభకర్ణుండు పలికె: |