| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“మీరు నన్నేటికి మేలుకొల్పితిరి? యా రావణునకుఁగార్యంబేమి పుట్టె? నది యేమి చెప్పుఁడా?” యనవుడువారు: “త్రిదశారిచేతనే తెలియు1067ము నీవు; నినుఁదోడితెమ్మని నిర్జరారాతి పనిచె; నింతియకాక, పని1068యెట్టి దెఱుఁగ”. మనవుడు జలక మింపారంగ నాడి చనుదెంచి యెంతయుఁజతురత మెఱసి చారువస్త్రములు భూషణములుఁదాల్చి భూరికోటీరదీప్తుల నొప్పుచుండ నతిముదంబున నప్పుడా దైత్యులెల్ల నతని కనేకభక్ష్యములు భోజ్యములు మధువును సూకరమహిషమాంసములు నధికమౌమెదడును నాజ్యభాండములు ముదముతోఁగొనివచ్చి ముందఱ నిడిన మొదల మేదోమాంసములు ప్రీతి నమలి రుధిరంబు మద్యంబు1069రూఢిగాఁగ్రోలి యధికసంతుష్టుఁడై యతఁడున్నఁజూచి మ్రొక్కి నిశాచరుల్ ముందఱ నిలువ నక్కుంభకర్ణుఁడిట్లనియె వారలకు: “మీరు నన్నేటికి మేలు కొల్పితిరి? వారక రాక్షసేశ్వరునకు శుభమె? యెడరు పుట్టదుగదా యెవ్వరివలన నడరి యీ లంకకు? నట్లైన నిపుడ యడఁచెద1070 నా భయం; బమరేంద్రునైన వడిఁగిట్టి నాకంబువలనఁబాపెదను; నార్చెదఁగాలాగ్నినైనను బొదివి; తీర్చెదఁబగవారి తీవ్రదర్పములు.” ననిన యూపాక్షుండు హస్తముల్ మొగిచి కనుఁగొని యా కుంభకర్ణుతో ననియె: “విను నిశాచరవీర! విబుధులవలన 1071దనుజులవలన గంధర్వులవలన నే భయంబెన్నఁడు నెఱుఁగ1072ము;మాకు నీ భీతిఁబుట్టించి రిప్పుడు నరులు. దివిజారి జానకిఁ దెచ్చుటకలిగి రవికులోత్తముఁడైన రామచంద్రుండు 1073కడిఁదివిక్రములైన కపులతోఁగూడి 1074విడిసినాఁ డీ లంక 1075వేడించి యిప్పు. డగచరుండొక్క 1076ఁడే యక్షకుమారు మొగి సేనతోఁగూడ మున్ను నిర్జించి లంక భస్మము సేసి లావుమైఁజనియె. నింక నెవ్వ1077ఁడు గెల్చు నీ మహాకపుల? నని లోన దేవాసురా1078దులకంటె ఘనవిక్రమఖ్యాతిగల రాముతోడ నుఱక కయ్యము సేసి యోడి రావణుఁడు వెఱపునఁబఱతెంచి వెస లంకఁజొచ్చె.” నని విన్నవించిన నా నిశాచరుఁడు కనుఁగవ విస్ఫులింగంబులు సెదర యూపాక్షు నీక్షించి యుగ్రకోపంబు దీపింప నౌడులు దీడుచుఁబలికె: “సమరంబులో నేఁడు సకలవానరుల నమితవిక్రములైన యా దాశరథుల మడియించి కపివీరమాంసరక్తములఁ దొడరి రాక్షసకోటిఁదృప్తిఁబొందించి రామలక్ష్మణుల యా రక్తముల్ గ్రోల కేమనివత్తు నే నింద్రారికడకు? నటు సేసి వచ్చెద.”నన మహోదరుఁడు నట మ్రొక్కి ముకుళితహస్తుఁడై పలికె: “1079ఘనుఁడ! దశగ్రీవుఁగని చేయవలయు పనియెల్ల విని పోయి పగవారి గెలువు.” మనవు1080డు నా మాట“కౌఁగాక.”యనుచుఁ దన యొద్ది రాక్షసతతిఁజూడ వారు నిరవొందఁగా 1081నప్పుడిరువది యొక్క పురుషులమాంసంబు ప్రోవుగాఁబోసి యెనుబదిమహిషంబు లేనూఱజంబు లును వేయుఁగ్రోడంబులును నాల్గువేలు ఘనశశంబులును మృగంబు లార్నూఱు ననువొందఁగాఁదెచ్చి యవి వేఱువేఱ చంపి సుపక్వమాంసంబులు సేసి యింపార నాతనియెదుటఁబోయుటయుఁ దనివోవఁగుడిచి యుద్ధతి రెండువేలు ఘనఘటంబులలోనఁగల మద్యమాని పట పట దిక్కులు పగుల1082ఁద్రేన్చుచును జటులంబులైన మీసములు 1083దీటుచును జనుదెంచునురువడి జగతి గంపింపఁ గనుదోయి ఘూర్ణిల్లఁగా గుహ వెడలె నల రాహువదనగహ్వరముననుండి విలయకాలార్కుండు వెడలినమాడ్కి; బలిఁగిట్టి ధాత్రియు బ్రహ్మాండతలము వెలయ దట్టించుత్రివిక్రముపగిది. నా చందమున వికృతాకారుఁడగుచు నేచినపొడవుతో నేతెంచునపుడు కోటయవ్వలి కపికోటు లన్నియును మేటిరాక్షసుఁజూచి మిగిలినభీతిఁ గొందఱు వెఱఁగందఁ,గొందఱు డాఁగఁ గొందఱట్టిటువడఁ, గొందఱు వెఱవఁ, గొందఱు మూర్ఛిల్లఁ, గొందఱు జలధి యం దుఱుకఁగఁ, గొంద ఱద్దిరా యనఁగఁ గొందఱు రాముదిక్కున కొదుఁగంగ, నందఱఁగనుఁగొని యా సమయమున: “సౌమిత్రి! విల్లును శరముఁదె.”మ్మనుచు రాముఁడు వలికి యా రావణానుజుని: “నదె యాకసంబును నవనీతలంబుఁ గదిసిన దేహంబు గలిగినవాఁడు,[వా.రా. సర్గ 61] ప్రళయాంబుధర తటిత్పటలంబువోలెఁ బొలయు భూషణరుచిఁబొలుపైనవాఁడు, మూఁడులోకములు నిమ్ముల మ్రింగునట్టి వాఁడిమిఁదెఱచిన వదనంబువాఁడు; కాలుండొ? యటుగాక కాలానలుండొ? కాలరుద్రుఁడో? లయకాలమారతుఁడొ? కాలార్కుఁడో? మహాకాలా1084హిపతియొ? కాలమృత్యువొ? లయకాలాబ్ధివిభుఁడొ? కాలకాలుఁడొ? లయకాలభైరవుఁడొ? కాలరుద్రునకును గాలరుద్రుండొ? భీమంపురూపు విభీషణ! యిట్టి దే మెన్నఁడును జూచియెఱుఁగము మున్ను. దానవుఁడో?వీఁడుదైత్యుఁడో? కాక! వీని 1085కులం బేమి?వీఁడెవ్వఁ? 1086డిందు వాఁడె యా పురవీథి వడి నేఁగు1087చున్న వాఁ!డెవ్వఁడెఱిఁగింపు? వానిపేరేమి? వీనిఁగనుంగొని వెఱచిరి కపులు; వీని చందము1088గడువెఱఁగయ్యె.”ననుడు |