| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
మని పెద్దకృప వుట్ట నాడు వాక్యములు విని కుంభకర్ణు డా విబుధారి కనియె:[వా.రా. సర్గ 63] “మును నాఁటి యేకాంతమున మంత్రులెల్లఁ గనుఁగొన్న యాకీడె కాక చింతింప వారక యిది నేఁడు వచ్చిన కీడె? యే రూపమున నిది యేటికిఁదప్పు? మదముపెంపునఁజేసి మఱి యెవ్వఁడైనఁ దుది మొదలెఱుఁగక తొడరుఁగార్యంబు వాఁడుగదా, యెల్లవలనఁజేటొందు; వాఁడని చెప్ప నెవ్వఁడు నీవె కాక? మతిగలమంత్రుల మంత్రానుమతులఁ గృతకార్యములు 1107పచరించు నే విభుఁడు నొగిఁబ్రభుమంత్రసముత్సాహశక్తు లగణిత ఫలదంబులై వాని కమరుఁ. బతి దేశకాలవిభాగంబు లెఱిఁగి చతుర1108జన ద్రవ్యసంపద గల్గి కార్యంబు1109నకు మఱి కార్యమూహించి కార్యవిఘ్నప్రతీకారంబు1110సేసి ఫలసిద్ధి గైకొని బహు1111రాజ్యభోగ ముల నిత్యుఁడై యుర్వి1112మోదింపవలయుఁ బగవాని బలశక్తి1113భావించి సంధి తగు బుద్ధిమైఁజేయఁదల1114 పోయవలయు; రూపింప సమ1115బలారూఢునితోడ నేపుమైఁజని నిగ్రహింపంగవలయు; నటుకాక బల1116శూన్యుఁడగుట చింతించి పటుసత్త్వుఁడై శత్రుపై నెత్తవలయు; విడిసిన1117బలిమి వివేకించి1118మీఁద విడి1119సి మార్తుర గెల్వ వెర వూఁదవలయు; వైరు లసాధ్యులై వా1120లినవారి లో రెండువుట్ట నాలోచింపవలయు; నతి సత్త్వులై వైరు లజితు లైరేని హితబుద్ధిమై నాశ్రయింపంగవలయు; నీ యాఱుగుణముల నెఱిఁగి వర్తించు నా యవనీశ్వరుఁడభివృద్ధి నొందుఁ; బూని యే పురుషుఁడెప్పుడు సామభేద దానదండము లుచితము దప్పఁజేయు నెఱయ1121వానికిఁగల నీతిశాస్త్రములు కొఱమాలియుండు నిక్కువ మివ్విధంబు పరధన పరదార పరచిత్తుఁడెవ్వఁ డరయ నాతఁడు కులమంతయుఁజెఱచు.” న1122ని కుంభకర్ణు1123ఁడిట్లాడు వాక్యములు విని రావణుఁడు క్రోధవివశుఁడై పలికె: “నను నన్న యనుచు మనంబునఁగొనక కినిసి యిబ్భంగి శిక్షించెదు వచ్చి! యీ వృథాజల్పంబు లింక నేమిటికి? నే విధంబుననైన నీ కార్య మేను గడవంగఁ; జేసితిఁ; గాదన కీవు కడిమిమై నిది చక్కఁగాఁ జేయు మింక.’ ననవుడు విని యప్పు డా కుంభకర్ణుఁ: “డనిసేయఁబోయెద; నైన నింకొకటి విను దానవేశ్వర! వేడుక నొక్క దినమున నే నిద్రదెలిసిననాఁడు చేకొని కడుఁబెక్కు జీవుల మ్రింగి యేకాంత1124మొక్కచో నే నున్నచోట కనఘుఁడు నారదుం డరు1125గుదేఁగూడఁ జని విన్నవించితి సంయమితోడ: “నెక్కడనుండి; నీ విటు1126సంభ్రమమున నెక్కడపోయెద; వెఱిఁగింపు నాకు.” ననవుడుఁ:“గనకాద్రియందుండి రాక; విను వార్త లన్నియు వినుపింతు నీకుఁ: బంకజాసనుఁడును ఫాలలోచనుఁడు1127ఁ బంకజోదరుఁడును బాకశాసనుఁడు ననలుండు1128యముఁడును నంబుధీశ్వరుఁడు ననిలుండు యక్షేశుఁడౌ కుబేరుండు నోషధీపతియును నుష్ణకరుండు శేషగ్రహంబులు సిద్ధులు మునులుఁ గిన్నర గంధర్వ గీర్వాణ గరుడ పన్నగ గుహ్యకప్రముఖసంఘములు సభగూడి మంత్రవిచారంబు సేయ శుభమతి నూహించి సురగురుండనియెఁ: “గ్రోధించి మనలఁగైకొనక లోకములు బాధించుచున్నాఁడు పంక్తికంధరుఁడు; శుంభద్బలంబున సుడివడఁజేసి జంభారి భంజించె సమరంబులోన; వడి నంతకునిఁదోలె; వరుణు1129నోడించె; నొడిచెఁగుబేరుని నురు1130బలంబెసగఁ; గట్టల్కతో నతిగర్వంబు మెఱసి పట్టి ధర్మాత్ములఁబలువురఁజంపె; దినకరచంద్రుల తేజంబు లణఁచి తన యాజ్ఞ నడవంగ దట్టించి పనిచె; గ్రహముల నందంద కారించె;మంత్ర మహితంబు లగుచున్న మఖములు చెఱిచె; వఱలు మహోద్యానవాటికల్ వెఱికెఁ; జెఱవట్టె నుత్తమస్త్రీలఁ బెక్కండ్ర. నివి లోనుగా బాధలిట్లు సేయుచును భువనంబులకు భీతి పుట్టించెఁగాన యడరి రాక్షసులతో నద్దశాననుఁడు చెడు నుపాయము మీరు చింతింపుఁడింక.” నని బృహస్పతి పల్క నా మాటలెల్ల విని బ్రహ్మ వల్కె నా విబుధులతోడ: “వర మిచ్చినాఁడ నే వానికి మున్ను సురగరుడోరగాసురయక్షవరుల చే1131నైనఁ జావమి సిద్ధంబుగాఁగ. దీనికి మాఱు చింతించితి వినుఁడు: తడవఁడు మనుజుల దైత్యుండు; గాన తడవ నేనును వరదానకాలమునఁ. గాన రావణుని సంగరరంగమందు మానవు లోర్తురు; మనుజలోకమునఁ. జనియింపఁబ్రార్థింపఁజనుఁడాదివిష్ణు వనజనాభుని లోకవంద్యు ముకుందు.” ననవుడు సురమునులట్ల కావించి; రనఘుండు హరియు మర్త్యంబునఁబుట్టె” నని నారదుఁడు సెప్పి యరిగె దైత్యేశ! దినకరకులుఁడాదిదేవుండు గాని మనుజుండుగాఁడు రామక్షితీశ్వరుఁడు; జనకనందన నిమ్ము; శరణను వేగ; వనచరులెల్ల దేవతలుగాఁదలఁపు; దనుజేశ! నా మాట తథ్యంబు నమ్ము.” |