ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
కుంభకర్ణుఁడు యుద్ధమునకు వెడలుట
నా రావణునితమ్ముఁ డా భూషణములు
వారక తాల్చి1163ప్రజ్వలితాంగుఁడగుచుఁ
దన1164రారెఁబసిఁడికత్తళ మొప్పఁదొడిగి
వినుతసంధ్యాంబుదావృతగిరివోలె;
బహురత్నమేఖలాబద్ధుఁడై యొప్పె
నహిరాజబద్ధమంథాద్రిచందమున.
నొప్పి రణోత్సాహ ముప్పొం1165గి పొంగి
యప్పుడు 1166వేడ్క నయ్యసురపుంగవుఁడు
త్రిజగద్భయంకర1167దీప్తిమైఁబర్వి
విజయప్రదంబునై వినుతికి నెక్కి
శూలిశూలముకంటె సొంపారి మొనల
వాలినమంట లుజ్జ్వలములై నిగుడ
నిప్పులు సెదర మానితమైన పూజ
నొప్పి రత్నప్రభ నుజ్జ్వలంబగుచుఁ
బ్రతివీరశోణితభ్రాజితంబైన
యతులశూలముఁబట్టి యన్నకు మ్రొక్కి
యతనిదీవనలతో నా సభాంతరము
వితత సముద్యోగవేగుఁడై వెడలె
నీ కష్టతనువులో నే మేల నిలుతు
మో కుంభకర్ణ! రణోర్వర దీని
వైతువు ర”మ్మని వాని ప్రాణంబు
లాతతగతి నీడ్వ నరుగుచందమున.
నంత రాక్షసకోటి యా కుంభకర్ణు
నంతంతఁగూడి కయ్యంబున కరిగెఁ;
దురగంబు లెక్కి సింధురముల నెక్కి
యరదంబు లెక్కి సింహంబుల నెక్కి
కాటుకకొండలగతిఁ దనరారి
మేటి దంష్ట్రంబుల మెఱుఁగులు సెదరఁ
గ్రౌర్యమంతయుఁగూర్చి కరువిడ్డభంగి
శౌర్యంబు రూపులై చరియించు కరణిఁ.
గయ్యంబు సేఁతయె కార్యంబు గాఁగ
నయ్యైతెఱంగుల నాటోప మొప్పఁ
బరిఘ పట్టిస గదా ప్రాస కోదండ
కరవాల ముసల ముద్గర భిండిపాల
పరశు చక్రాదిక 1168ప్రకటాయుధములఁ
బరగి పదాతి యుద్భటశక్తి నడచె.
నీ చందమునఁగూడి యెల్ల1169సైన్యములు
వే చనుదేర గర్వితచిత్తుఁడగుచుఁ
బురకామినీతతి పుష్పవర్షములు
గురియ రణోద్యోగి కుంభకర్ణుండు
చంద్రమండలనిభచ్ఛత్రంబు లొప్పఁ
జంద్రబింబాస్యలు చామ1170ర లిడఁగఁ
దురగహేషలును సింధురబృంహితములు
వరరథనేమినిస్వన పరంపరలుఁ
బటుతరనిస్సాణభాంకారములును
బటహ భేరీ శంఖ పణవనాదములు
ఘంటా మృదంగ ఢక్కారవంబులును
మింట దిక్కుల నిండి మిగుల మ్రోయంగ

  1. ↑యుజ్జ్వలకాంతితోడఁ
  2. ↑రారుప(రఁబ)సిఁడి
  3. ↑గెఁబొ
  4. ↑చనుదెంచి య, వెడలె నయ్య
  5. ↑ప్తమై పర్వ - విజయసూచకభేరి వేయంగఁబనిచె
  6. ↑ప్రథితా
  7. ↑రాక్షసులు
  8. ↑రల్‌ వీవఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )