| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
వెడలినయపుడు పృథ్వీభాగ మగలె; జడధులు గలఁగె; దిశావలి వగిలె; గగనంబు వడఁకె; దిగ్గజములు మ్రొగ్గె, జగములు బెగడొందె; శైలంబు1171లురిలె. “దౌర్జన్యమున దుష్టదానవ! నీవు పర్జన్యు నేఁచిన ఫల1172మింకఁగుడువు.” మని రాఘవునకుఁదోడై వచ్చి పేర్చి తనరార వాని నదల్చినమాడ్కిఁ గలయంగ నప్పు1173డు కాలమేఘములు పలుమాఱుఁబిడుగులు పరగించి మ్రోసెఁ; “దోరంబుగా నార్చి త్రుళ్లెడు వీఁడు; ఘోరాహవక్షోణిఁ గుపితుఁడైనట్టి తారాధిపతిచేతఁ దాను రూపఱుట కీ రాజవరునిచే నిటగూలుటకును దారు సాక్షుల.”మని తగఁజెప్పుకరణిఁ దారలు1174డుల్లుచు ధరణిపైఁబడియెఁ; “దను1175మున్ను నొంచినదానికై యనిలుఁ డనయంబు రామునియాన1176 నీ యసురఁ బడవైతు.”నని1177పేర్చి పరగినమాడ్కి వడిగొని ప్రతికూల వాయువుల్ వీచె; “రాముఁడు సంప నీ రాక్షసాధముఁడు నా మీఁదఁబడునప్డు నా కెంత1178వ్రేఁగు పుట్టునో;”యని భీతి వుట్టి కంపించు నట్టిచందంబున నవని గంపించెఁ; “బక్షపాతుల మని పరికింపవలదు రాక్షసాధమ! నీవు రాఘవేశ్వరుని ఖగములచేఁజావఁగల.”వనుకరణి ఖగములు సుడివడఁగాఁబాఱఁజొచ్చె. నవియెల్లఁగొనక సాహసము రెట్టింప సవరణ యుడుగ కుత్సాహంబు మిగులఁ “జూపులచేతనే చూర్ణం బొనర్తుఁ గోపించి వానరకులమెల్ల.”ననుచు మేటియై వచ్చుచు మీఱి కన్గొనియెఁ గోటయవ్వలి కపికోటులనెల్లఁ. గపులును నా కుంభకర్ణునిఁజూచి విపరీతమారుతవిహత మేఘముల కరణిఁబాఱఁగఁ గుంభకర్ణుండు లంక యురువడి వెడలి1179మిన్నులియంగ నార్చె. నా యార్పు విని వానరావలియెల్లఁ బాయనిమూర్ఛ పాల్పడి భువిఁద్రెళ్లె; శరనిధి గలఁగె; భూస్థలి గంపమొందె; సురలకుఁగడు భీతి సొచ్చెఁజిత్తముల. |