ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
హనుమ కుంభకర్ణునితోఁ బోరుట
నప్పుడు హనుమంతుఁడధికరోషమున
నిప్పులు రాలెడు నేత్రంబు లొప్ప
గిరిపాదపంబులు గిఱికొన వైవ
నురువడి దైత్యుఁడత్యుగ్రశూలమునఁ
దుమురుసేయుచును బైఁద్రోచిరా మఱియు
నమరులు మెచ్చంగ నాంజనేయుండు
నసురపై వైచె మహాపర్వతంబు
నసమానబలుఁ1214డితండన తన్నుఁబొగడ.
దానిచే నా దైత్యుతనువు గంపిం1215ప
మేనెల్ల నెత్తురు మిక్కుటంబయ్యె.
దాన నెంతయు నొచ్చి దానవేశ్వరుండు
మానక మెఱుఁగులు మంటలుఁగ్రమ్మ
భూతలంబగల నభోభాగ1216మవియ
భీతిల్లి నిర్జరబృందంబు వడఁకఁ
గర ముగ్రమైనట్టి ఘనతర శూల
మురువడిఁబూంచి సముల్లాసి యగుచు
మడవక శక్తిఁగుమారుండు పేర్చి
వడిఁగ్రౌంచగిరిమీఁద వైచినకరణి
హనుమంతుపై నెత్తి యతిరభసమున
వనచరుల్‌ బెదరంగ వైచె నయ్యసుర.
యటు దానవుఁడు వైవ ననిలజు1217నురము
పటపటఁబగుల నప్పావని యపుడు
నురుకోపరస1218మెల్ల నుమియుచందమున
దురములోపలను నెత్తురులు గ్రక్కుచును
బ్రళయకాలమునాఁటిపటుమేఘరవము
బలువున నెంతయుఁబరగ రోఁజుచును
గపులు గంపింప రాక్షసులు మోదింపఁ
గపిశేఖరుఁడు గూలెఁగలలావు దూలి.
యాలంబులో నప్పు డనిలజుపాటు
నీలుండు గనుఁగొని నెఱయుకోపమునఁ
గైకొని వైచె రాక్షసులెల్ల బెదర
నా కుంభకర్ణు మహాపర్వతమున;
వడితోడఁ1219బై పడవచ్చు పర్వతము
బెడిదంబుగా వాఁడు పిడికిటఁబొడిచెఁ;
బొడిచిన నదియు నద్భుతముగాఁజెదరి
యెడపక చిఱుమంట లెగసి నుగ్గయ్యె.
నమరారిపై నప్పు డాగ్రహవ్యగ్రు
లమితబలోదగ్రులగు మహాకపులు
చలమున ఋషభుండు శరభుండుఁబేర్చి
కలుషత నీలుండు గంధమాదనుఁడు
నగ్గవాక్షుండును నధికరోషంబు
లగ్గలింపఁగ1220నప్పుడడరి పెల్లార్చి
తరమిడి వానిపైఁదరుల వైచియును
గిరుల వ్రేసియుఁబిడికిళ్లఁ1221దాఁచియును
బదములఁదన్నియుఁబటునఖప్రతతి
విదళించియును బహువిధములనొంచి
యేచిన నన్నియు నింత గైకొనక
యేచి యద్దానవుం డెసగురౌద్రమునఁ
బటుతరంబుగ నేలఁబడి తన్నుకొనఁగఁ
జటులతఁబిడికిట శరభునిఁబొడిచె.
నురువడి ఋషభుని నొడిసి రాఁదిగిచి
కరములఁగొని ముద్దగా1222నొగిలించెఁ;
గునికిలఁబడి తన్నుకొని గుండెలవియ
ఘనుఁడైన నీలు మోఁకాల1223ఁదాటించె;
నసమున నిగుడి గవాక్షునిఁగిట్టి
యసురేశుఁడఱచేత నదరంట నేసెఁ;
గ్రమ్మిన1224తెగువమై గంధమాదనుని
బిమ్మిటిగొని త్రెళ్లఁబెడచేత వైచె;
రయమున రణరాగరసములు గ్రక్కు
క్రియ నెత్తురులు గ్రక్కి కెడసి రేగురును.
శూలంబుఁద్రిప్పి యార్చుచు నట్టహాస
లోలుఁడై యాలంబులోనఁ గ్రుమ్మరుచు
వితతవజ్రాభీల వృత్రారిభంగి
నతుల దండోద్దండయముని చందమున
గడు భయంకరవృత్తిగాఁగఁబెల్లార్చి
ముడివడు నెమ్మొగంబున నిప్పులురలఁ
బ్రలయ కాలమునాఁటి పటుశూలరుచులు
దొలుకాఁడ నాడు రుద్రుని తెఱంగునను.
మెఱసెఁబొమ్మనుమాట 1225మిక్కుటంబుగను
నెఱవార నందఱ నిర్జించె1226ఁగాన.

  1. ↑డితఁడని కపుల్‌ వొగడ
  2. ↑చి
  3. ↑మద్రువ
  4. ↑శిరము
  5. ↑మటు లుమియు
  6. ↑దన మీఁద
  7. ↑ఁగోప మడరఁబె
  8. ↑బొడిచియు
  9. ↑ఁగబళించె
  10. ↑ధట్టించెఁ
  11. ↑కినుకమై
  12. ↑మిక్కిలిగాఁగ
  13. ↑నపుడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )