ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అవశుఁడై పడిన సుగ్రీవునిఁ గుంభకర్ణుండు లంకకుఁ గొంపోవుట
సుగ్రీవు మా యన్న సూచుఁగా.”కనుచు
నుగ్రుఁడై కొనిపోయె1229నొనర లంకకును
గాలానిలము వచ్చి కాలమేఘమును
గూలిచి గుహకును గొనిపోవుకరణి;
నట సురావళియెల్ల“నకట! సుగ్రీవుఁ
డిటు పట్టువడిపోవునే?”యని వగవ,
నక్కుంభకర్ణునియలవు1230ఁజలంబుఁ
దక్కక యందంద దనుజులు వొగడ,
వెనుకొని రవిసుతు విడిపింపలేక
వనచరుల్‌ హాహారవంబులు సేయఁ.
గరువలిసుతుఁడు నంగదుఁడు నీలుండు
శరభుండు ఋషభుండు జాంబవంతుండు
గిరిభేది సు1231తరుండుఁ గేసరి పృథుండు
హరిరోముఁడును బావకాక్షుండు హరుఁడు
ద్వివిదుండు మైందుండు వేగవంతుండు
గవయుండు శతబలి గజుఁడు దుర్దముఁడు
సుముఖుండు వాలపాశుఁడు గవాక్షుండుఁ
గుముదుఁడు జ్యోతిర్ముఖుఁడు సుషేణుండు
దధిముఖుండును వేగదర్శి రంభుండుఁ
గ్రధనుండు ధూమ్రుండు గంధమాదనుఁడుఁ
దారుండుఁగ్రోధన తపన ప్రజంఘ
ఘోరాక్షజంఘాలగోముఖవిముఖ
పనస సన్నాథ సంపాతీంద్రజాల
వినుత సుదంష్ట్రక శ్వేత దుర్ముఖులు
వీ రాదిగాఁగల వీర వానరులు
దారుణాకారు లుద్దండవిక్రములు
ధారుణీధరములుఁదరువులుఁగొనుచు
నారూఢభుజసత్త్వులై మింటి కెగసి
యట్టహాసంబుల నార్పుల దిక్కు
లట్టిట్టు గాఁగ బ్రహ్మాండంబు వగుల
“నినసూతి విడిపింతు మెట్లైన.”ననుచు
దనుజునిపైఁబడ దమకించుటయును
గరమెత్తి “వల.”దని కరువలిసుతుఁడు
వరనీతిమతి గాన వారి కిట్లనియె:
“భానుతనూజుఁడుద్భట 1232శూరవర్యుఁ
డూనినమూర్ఛచే 1233నున్నవాఁడిప్పు;
డా మూర్ఛయెడఁబాసి యాత్మలోఁదెలిసి
యా మహాత్ముఁడు వచ్చు; నటుగాక మనము
విడువ కీ యసురచే విడిపించుకొన్నఁ
గడులాఘవంబునఁగపికులేశ్వరుఁడు
మదిలోన నెప్పుడు మఱుఁగుచునుండు;
నిది విచారము కాదు; యించుక1234సైఁచి
యటుచూడుఁ; డీలోన నతఁడు రాకున్నఁ
గుటిలులౌ రావణకుంభకర్ణులను
జటుల విక్రములైన సకలరాక్షసులఁ
బటుముష్టి నిహతుల భగ్నంబు సేసి
హాటక దీప్తుల నలరెడు నేడు
కోటలు లంకయుఁగూలంగఁ1235ద్రోచి
ప్రళయంబు నొందించి భానుజుఁగూడి
చలముఁగోపము మీఱఁజనుదెంత మెలమి.”
నని యిట్లు హనుమంతుఁడాడు వాక్యముల
1236మనముల నలరి యా మర్కటేశ్వరులు
వినువీథి నత్యంతవేగులై దనుజు
వెనుకొని పోవ, నవ్విధ మెఱుంగకయె
యట కుంభకర్ణుండు నర్కజుఁగొనుచుఁ
బటుతరంబుగ లంక బలియుఁడై చొచ్చె

  1. ↑నుఱక
  2. ↑జయంబు
  3. ↑రథుండు, తనుండు
  4. ↑శౌర్యధుర్యుఁ
  5. ↑నున్నాఁడుగాని - యా
  6. ↑సైఁచుఁ -డటు చూత మీలోన
  7. ↑దన్ని
  8. ↑విని మర్కటేశ్వరుల్‌ విక్రమంబెసగ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )