| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“మును జెలియలి బన్నమునకునై యాత్మ నెనసిన సిగ్గు1240న నెగ్గొనరిం1241ప వనజాప్తకులునితో వలవనివైర మున మగంటిమితోడఁబోరాడుచున్న నాకారికడకు మానముఁగోలుపోయి యీ కష్టతనువుతో నేమనిపోదుఁ? బోరికి నుచితంబు పోవుట.”యనుచు నా రక్తపూరంబు లందంద క్రమ్మి తను1242వున నిండ నుద్దండ వర్తనుఁడు ఘనతరరోషంబు గడలుకొనంగ జేవుఱుచాయల సెలయేఱు లడరఁ గా వచ్చు నీలాద్రికైవడి దోప. నటుఁగాక ‘వీఁడు యుగాంతంబు నాఁటి చటులాగ్ని’ యన రణస్థలి కేఁగుదెంచి యఱిముఱిఁగోపించియగచరసేనఁ దఱిమి దానవుఁడు నుదగ్రుఁడై మెఱసి కడునుగ్రముగఁగడకాళ్లొగిఁబట్టి వడిఁద్రిప్పిత్రిప్పి యుర్వరమీఁద వ్రేయు; బిఱబిఱఁబ్రేవులు పిడికిటి1243లోనఁ బెఱికి రాఁగొందఱఁబిడికిటఁబొడుచు; నిబ్బరంబుగఁదాఁచి నెఱయ గుండియలు దొబ్బలు నుఱుకంగఁద్రొక్కుఁబాదములఁ; బిడుగులఁబోలెడు పెడచేతు లెత్తి కడు1244నుగ్రముగ మన్ను గఱవంగ నేయుఁ; దన మీఁదఁబ్రాఁకిన తరుచరావళుల విన విస్మయంబుగా వెస1245ను గ్రసించు; నగపడ్డరాక్షసునైనను బట్టి తిగిచి వేగమునఁగుత్తికలోన వైచు; 1246జంకెనచూపుల శవములఁజేయు; హుంకారరవముల నుసుఱులు వాపు; దివిజ విమానముల్ తిరుగుడు పడఁగఁ దివిచి మర్కటులమీఁదికి 1247నెత్తి వైచు; నెగసినకపులతో నేటు1248దాఁకంగ నగచరావళిఁబట్టి యందంద వైచు; నెమ్ములు నుఱుముగా నేపారఁద్రిప్పి యిమ్ములఁగొందఱ నెడ గల్గ వైచుఁ గొందఱ నిరుగేలఁగుదియంగఁబట్టి యందంద తాటించి యల్లంత వైచు; ‘నీ వానరులఁజూడుఁడేర్పడ.’ననుచు లావునఁగొందఱ లంకలో వైచుఁ; బెంపారఁ“దనుఁగట్టి పేర్చినకపుల ముంపుమీ.”యని యబ్ధి మునుఁగంగ వైచు. నివ్విధంబున దానవేశ్వరుఁడేచి యవ్వానరుల దిక్కులందెల్ల వైవ మేదినియందును మిన్నులయందు నే దిక్కులందును నెడములేకుండఁ బడి చచ్చుకపులును1249బడి డొల్లుకపులుఁ బడి కూఁతలిడుకపుల్ పడిపొరల్ కపులుఁ బడి తన్నుకొను కపుల్ పడిరోఁజుకపులు బడియున్న కపులును బడియెడు కపులు నై రణక్షితియెల్ల నగచరాక్రోశ మా రాక్షసునిచేత నగ్గలం బయ్యె. నా కుంభకర్ణునియత్యుగ్రభీష ణాకృతి కాలాంత కాకృతియైన నడఁగెఁ దారాపతి; యలికె నంగదుఁడు; నడిఁకె గవాక్షుఁ; డున్నతి దక్కె గజుఁడుఁ; జలియించె ఋషభుండు; శంకించె నలుఁడుఁ; బెలుకుఱె నీలుండు; బెగడెఁబృథుండు; వెఱఁగందె శరభుండు; వెఱచె ధూమ్రుండు; నుఱు కంపమునఁబొందె నొగిఁబనసుండుఁ; గడుభీతి నొందెను గంధమాదనుఁడు; నడలుచు వడఁకె నయ్యనిలనందనుఁడుఁ; జూడ భయంబందె జ్యోతిర్ముఖుండు; జాడ సేకొని పాఱె జాంబవంతుండుఁ; నులికిరి వెండియు నున్న వానరులుఁ గలయ నంతటఁగుంభకర్ణునిఁజూచి. ఘనబాహుబలుఁడు లక్ష్మణుఁడు గోపించి చనుమఱ నాటించె శరము లేడింట; మఱియుఁబెక్కింట లక్ష్మణదేవుఁడేయఁ గఱకురాక్షసుఁడు లక్ష్మణునిఁగైకొనక బలువిడి రాఁగ నా పాదమస్తకము నలమి ప్రాఁకుచుఁగపు లాదైత్యుమేన 1250నలిగి మీసముల నుయ్యాల లూఁగుచును గలుషతఁదోఁకలు కలయఁజుట్టుచును నఱిముఱిఁగవిసి యా యా సంధులందు వఱల1251ంగ1252లాగులు వైచి 1253హత్తుచును జిందఱవందఱ సేసిన నసుర డెందంబులోనఁగడింది కోపమునఁ బటుసత్త్వు1254ఁడై తనపై నున్న కపులఁ జటులమత్తేభంబు జాడించుకరణి జలకేళిఁదనిసిన సమద1255సూకరము వెలయ1256బిందులు రాల విద్రిచినమాడ్కిఁ బ్రళయకాలమునాఁటి బ్రహ్మాండతలము డులడులఁజుక్కలు డుల్చుకైవడిని దనమీఁదఁబ్రాఁకిన తరుచరావళులఁ దనువు1257ఁగదల్చి యద్ధరణిపైఁగూల్చె. నప్పుడు విస్మితుఁడై కుంభకర్ణుఁ దప్పక కనుఁగొని తన కన్నుఁగొనల నిప్పులు రాలంగ నిగుడుకోపమున నప్పన్న గాధీశు నాకృతి గలిగి కరమొప్పు కాంచనకార్ముకం బెత్తి నిరుపమబాణతూణీరముల్ 1258బిగిచి భీమవిక్రమకళాభేద్యుఁడై 1259పెరిగి రాముఁడు నడచుసంరంభంబుఁజూచి సమరమహారంభచతురు లొండొండ దమకంబు నిండ నుద్దండవర్తనులు పరుషాద్రి పాషాణపాదపావళులు ధరియించి యుగ్రులై తరుచరోత్తములు 1260నొగిఁగూర్మ మగలంగ నుదధులు గలఁగ దిగిభముల్ మ్రొగ్గ మేదిని1261యల్లఁగ్రుంగ నదిమి కుప్పించి మిన్న గలఁబె1262ల్లెగసి యుదితక్రమంబున నురువిక్రమంబు సురసిద్ధసాధ్యులు సొరిదిఁగీర్తింపఁ గరమేచి యపుడు రాక్షసుమీఁద 1263నడవ. నా పతిముందర నా విభీషణుఁడు కోపంబుతో గదగొని 1264బిట్టు నడచె. నా విభీషణుఁజూచి యనియె నవ్వుచును రావణుతమ్ముఁడు రాక్షసేశ్వరుఁడు: |