ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
విభీషణ కుంభకర్ణుల ప్రసంగము
“విను విభీషణ! నీదు విక్రమంబునకు
ననువైన తఱి1265 యిది యవనీశునెదుర;
నన్నదమ్ములపాఁడి యని స్రుక్కవలవ;
దిన్నరనాథుని హృదయంబె పట్టు;
పూని యెన్నఁడు నిన్నుఁబొంద వాపదలు
భానువంశ్యునికృప పడసితిగాన.
యా రాముదయ గల; దటు1266మీఁద1267సిద్ధ
సారదయో1268దయ1269శ్లాఘ్యచిత్తుఁడవు;
లంక సద్గుణగణాలంకృతి నేల
నింక నెవ్వరు గల రిట నీవెకాక!
సాహసబలమహోత్సాహంబు మెఱసి
యాహవంబున వేగ మడరి1270నన్‌ గడఁక
మగతనంబును బాఁడి1271మదిలోనఁదలఁచి
తగ నీవు నాతోడఁదాఁకెద వనుచుఁ
బలికితిఁగాని యీ పట్టున నిలువ
నలవియే బ్రహ్మరుద్రాదులకైనఁ.
దొలఁగుము, తమ్ముఁడా! త్రుంగ; కీవైన
వలయు నీ రాక్షసవంశంబు1272మనుప.”
ననిన విభీషణుఁడన్నతో ననియె:
“దనుజకులంబెల్ల దగ్ధమై పోవు
నను1273భయంబున మనయన్నతోఁదెలియ
ఘనమైన నీతిప్రకారంబు1274లెల్లఁ
జెప్పితి నేను నేర్చినయంతపట్టుఁ;
జెప్పిన నా మాట చేకొనఁడయ్యె.
నటుగాన నిన్ను 1275ను నసురేశుఁబాసి
యిటువచ్చి శ్రీరాము నేఁబొడగంటి.”
నని యని చెప్పుచు నంతరంగమున
దనుజేశు నవినీతిఁదలపోసి పోసి
కన్నీరు దొరుగ1276ంగఁ గడుదుఃఖ1277మడర
నన్నఁజూడఁగ లేక యవ్వలఁదొలఁగె.
నా రాఘవేంద్రుండు ననుజసంయుక్తుఁ
డై రణోద్యోగియై యగచరుల్‌ దాను
ఘనరౌద్రరసము రాక్షసరూపు దాల్చి
యనికి నేతెంచెనోయనఁదగువానిఁ,
జారుకోటీరభూష 1278ణములవాని,
వీర రసావేశ వేషంబువాని
ధీరుఁడై కపులను దెగఁజూచువానిఁ,
దోరంపునెత్తుటఁ దోఁగినవానిఁ
గనుఁగొని మదిలోనఁ గడు వెఱఁగంది
మనుకులోత్తముఁడు రామక్షితీశ్వరుఁడు:
“నారికై పుట్టిన నా కోపమెల్ల
నారిచేఁజూపెద నాకారి కిపుడు;
నార్చుచు వచ్చు నీ యసురకోపాగ్ని
నార్చెద శరవృష్టి.” నని బిట్టు కినిసి
1279‘కరియాన నిజధర్మగతి1280ఁజెందు.’ననెడు
కరణి దిక్కరులు ఘీంకారముల్‌ సేయ
‘నింక నీఱుగఁజేయు నీ రామునలుక
లంకేశు.’ననుమాడ్కి లంక ఘూర్ణిల్ల
నెఱయంగఁజగములన్నియుఁ1281జెవుడ్పడఁగ
గుఱిలేని రవమున గుణము మ్రోయించె.
నా గుణధ్వని విని యలుకమై నెదురు
గా గర్వమునఁగుంభకర్ణుఁడేతేర
మానైన గరువంపుమాట లింపార
వానితో ననియె నా వనజాప్తకులజుఁ:

  1. ↑చూపు మధిపతియెదుర (యొద్ద) (నిసేయఁదగును)
  2. ↑గాన
  3. ↑నీవు
  4. ↑దార
  5. ↑సౌమ్య
  6. ↑నా యెదుర
  7. ↑మగఁటిమి
  8. ↑నిలుప
  9. ↑తలంపున
  10. ↑ఁజూపి-చె
  11. ↑నా యన్నను విడిచి
  12. ↑గద్గద కంఠుఁడగుచు
  13. ↑మంది - య
  14. ↑ణుఁడైన
  15. ↑గరిమతో (కఱకగు) నీ ధర్మ
  16. ↑కోర్వ మనెడు
  17. ↑జేడ్పడంగ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )