| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“వడిఁబేర్చి రాఘవ వైరాంబురాశి నెడవక యే నింక నేతెప్పఁగడతు? రామలక్ష్మణులను రణములోఁజంపె దేమెయి నని నమ్మి యే నున్న చోటఁ జటుల రాఘవమహాశరవహ్నిశిఖల నిటు నేలఁ గూలితే యేకాంగవీర! నిద్రారతుండవు నేఁడిట్లు దీర్ఘ నిద్రఁగైకొంటె1306 నిర్నిద్రవిక్రముఁడ! కులిశధారకునైనఁగూలనిమేను నిల నరువ్రేటున నిటు గూలవలసె. నంతకునకు నీవ యఖిలంబు నెఱుఁగ నంతకుండన నుంటి వారూఢశక్తి. నంతటినీకు నీ యని మొన నిప్పు డంతకుఁడయ్యెనే యకట! రాఘవుఁడు? నిద్ర మేల్కొని నీవు నిష్ఠురవృత్తి రుద్రుండవై తమ్ము రూపడం తనుచు నద్రివిద్రావణుండాదిగా సురలు నిద్రపో రెన్నఁడు నెఱసినభీతి. నీ వాజిఁద్రుంగితి; నిర్జరు లింక నే విధంబున నన్ను నేల కైకొండ్రు? కులమెల్ల రక్షించుకొఱకు నాతోడఁ జలమునఁ బలుమాఱు సద్బుద్ధి సెప్ప వినక విభీషణు వెసఁదన్ని వెడలి చనుమన్న పాపంబు సైఁచునే నన్నుఁ? గడుకొని నీవాదిగా బుద్ధిమంతు లుడుగక చెప్పిన యుచితోక్తు లేను నెమ్మితో విననైతి; నిన్నుఁగోల్పడితి నమ్మినజయలక్ష్మి నా కేలగలుగు? బలిమిమై నా వలపలి మూపుభంగిఁ గలహరంగంబునఁగడిమి వాటిం1307తుఁ. బటుబాహుబలమఱి పడితి నీవాజి; నిటమీఁద దిక్కు నా కెవ్వరు గలరు?” అని కుంభకర్ణుని నందంద తలఁచి వనరి నిట్టూర్పులు వడిఁబుచ్చిపుచ్చి పరితాప మనియెడి బడబాగ్ని గలిగి పెరిగెడు లాల1308యన్ఫేనంబు గలిగి వెడలు కన్నీరను వెల్లువ గలిగి కడలేని వగపను కరడులు గలిగి ప్రకటరోదనమను రావంబు గలిగి చకితత్వ మనియెడి చలనంబు గలిగి మునుకొని శోకసముద్రుఁడై పెద్ద వెనుఁబడి యెంతయు వి1309కలుఁడైయున్న యా రావణునిఁజూచి యప్పుడొక్కింత ధీరత వాటించి త్రిశిరుండు వలికెఁ:[వా.రా. సర్గ 69] |