ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అతికాయుఁడు బీరములు పల్కుట
“కలహవిక్రమకళా1386కలితసత్త్వములు
గలుగవు తొలఁగుఁడు కపులార! మీరు.
త్రిజగంబులును మెచ్చఁదివిఱి వారాశి
నిజశరాగ్రంబున నిలిపిన శూరుఁ
డతఁడెవ్వఁ?1387డిటు చూపుఁ; డతనిపైఁగాని
యతులితంబైన నా యస్త్రంబు విడువ.
దురమున నింద్రజిత్తుఁడు గట్టినట్టి
యురగపాశంబుల నూడ్చుకొన్నట్టి
యతఁడెవ్వఁ?1388డిటు చూపుఁ;డతనిపైఁగాని
యతులితంబైన నా యస్త్రంబు విడువ.
మూఁడులోకంబులు మునుమిడి గెలిచి
వాఁడిమగంటిమి వాలిన శూరు
నలఘుబలోదీర్ణు నా కుంభకర్ణుఁ
దలఁద్రెవ్వనేసి యుద్ధతిఁబేర్చియున్న
యతఁడెవ్వఁ?1389డిటు చూపుఁ;డతనిపైఁగాని
యతులితంబైన నా యస్త్రంబు విడువ.
దేవదానవయక్షదివిజుల కాజి
భావింప నెక్కుఁడై పరగినయట్టి
రావణు1390నోర్చెద రణములో ననుచు
నీ విధంబున లంక కేతెంచువీరుఁ
డతఁడెవ్వఁ?1391డిటు చూపుఁ;డతనిపైఁగాని
యతులితంబైన నా యస్త్రంబు విడువ.”
నని పెక్కుగర్వంబు లాడుచునున్న
దనుజాధినాథునితనయుని 1392మీఁదఁ
గడిఁదికోపమున వృక్షంబులు గిరులు
నుడుగక కపినాయకోత్తముల్‌ వైవ
నవి యంతవట్టును నతికాయుఁ1393డెడను
నవిరళమార్గణాహతిఁద్రుంచివైచి
గురుతరాస్త్రంబులఁగుముదుని మూఁటఁ
గరముగ్ర శరపంచకంబున ద్వివిదు,
నరుదార మైందుని నమ్ము లేడింట,
శరభునిఁదొమ్మిదిసాయకంబులను,
ఘనతరబాణాష్టకంబున గజునిఁ,
గినిసి బెట్టుగ నాలుగింట గవాక్షు,
గవయుని నెనిమిది ఘనసాయకములఁ,
దవిలి జ్యోతిర్ముఖు దశమార్గణముల,
బలుకాండముల శతబలిఁబదేనింట,
నెలమితో నీలుని నిరువదేనింట,
బెడిదంబుగా నేయఁబృథివిపై నొఱగి
కడుమూర్ఛనొంది రాకపివీరులెల్ల.
దివిజులు వెఱఁగంది దివినుండి చూడఁ
దవిలి వెండియును నుద్దండకోపమున
మృగములఁదోలెడు మృగపతిమాడ్కి
నగచరావళిఁదోలె నతికాయుఁడపుడు.
1394తోలుచుఁదన్ను నెదుర్పని కపుల
నేలపైఁగూల్పక నిగుడి రామునకుఁ:
“బగతోడి భక్తి నప్పరమేశు వలనఁ
దగ ముక్తిఁగందు నెంతయు.”నని తలఁచి
నిగమార్థముల రామునికి నతికాయుఁ
డగలని తెగువమై ననియె నవ్వుచును:
“రామ! యీ సమరధరాస్థలిలోన
నీ మగఁటిమిఁజూపు నిక్కంబు నాకు.
నెంతటివాఁడవో! యెవ్వరు నిన్ను
నింతటివాఁడని యెఱుఁగ రెన్నఁడును.
మా తండ్రికతమున మానిసి వైతి;
మా తండ్రికతమున మహి రాజవైతి;
వమరేంద్రయమవరుణాది దేవతల
గమిలోన నొకఁడవు కావు1395న న్నెదురఁ.
గడముట్ట శూరుఁడై కదిసిన వానిఁ
గడిమిమై నెదురంగఁగదియుదుగాక.
యేను నీ మగతనం బెఱుఁగనే1396ముందు
మానాభిమానముల్‌ మఱి నీకుఁగలవె?
గణుతింప నన్నెఱుంగవు గాక నీవు.
గుణహీను1397లకు సత్త్వగుణ మెందుఁగలదు?
ఏ జాతి గలవాఁడ?వేమి చెప్పెడిది?
రాజకులాచార రతుఁడవే నీవు?
అనఘతాపసమానసాటవుల్‌ 1398దూరు;
ననుఁజేరి పోరాడ నా యీడు గావు.
గొనకొని వేదాద్రిగుహలలో నుండు;
ననుఁజేరి పోరాడ నా యీడు గావు.
సనకాదిమునియోగి 1399జలధులు సొరుము;
ననుఁజేరి పోరాడ నా యీడు గావు.
కాషాయ1400వస్త్రసంకలితులై విగత
దోషులై భ1401వరోగదూరులైపోయి
కూరలుఁగాయలుఁగూళ్లుగాఁగుడిచి
నీరసాహా1402రులై నిష్ఠల డస్సి
ఘోరాటవులలోనఁగ్రుమ్మరుచున్న
వారిలోపలఁబోయి వర్తింతు గాక.
కలహవిక్రమశక్తి కడపట లేదు;
తలపోసి యెఱుఁగుదుఁదగిలి నీలావు.
నొగినొంటి1403కాఁడవై యుండెడు నీకు
జగతిపై నీ కపిసైన్యంబు గలిగె.
దిక్కెవ్వరును లేక తిరిగెడు నీకు
దిక్కయ్యె నిప్పు డీ దినకరాత్మజుఁడు.
ఎక్కడ గురుఁడని యెఱుఁగని నీకు
నక్కటా! గురుఁడు విశ్వామిత్రుఁడయ్యె!
నొక దేశమును లేక యుండెడునీకు
నకలంకమగునయోధ్యా1404దేశ మయ్యె.
నివి1405నీకుఁబెద్దగా నిచ్చలో నుబ్బి
తివుఱకు నీ వింక ధృతిపెంపు దూలి.
చలియించి మీనమై సకలవారిధులు
సొలవక చొచ్చినఁజొత్తుగా కేమి;
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకుఁ;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
1406నలువొందఁగూర్మమై1407నగము క్రిందికిని
సొలవక చొచ్చినఁజొత్తుగా కేమి?
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకు;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
యలిగి వరాహంబవై రసాతలము
సొలవక చొచ్చినఁజొత్తుగా కేమి;
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకుఁ;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
చలమున వికృతవేషమున నెందైన
సొలవక చొచ్చినఁజొత్తుగా కేమి?
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకుఁ;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
కడు1408గుజ్జవై నీవు కార్పణ్యవృత్తి
పొడ వడఁకువ సేసి పోదుగా కేమి?
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకుఁ;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
1409ధారుణీసుర వేషధారికుఠారి
వై రాజసంహారి వగుదు గాకేమి;
తలఁపు నీ మీఁదిది తప్పదు నాకుఁ;
బలుకు లేటికి నిన్నుఁబట్టెద వెదకి.
యచ్చెరువైన రణాంబుధిలోనఁ
జెచ్చెర నిన్ను మోచియుఁదేలియాడఁ
బరికింప నల వటపత్రంబుగాదు;
కరము భీషణము నా కంకపత్రంబు.
దురమున నను నీకుఁదొడరంగరాదు
వరగర్వమున నెందు వాలినవాఁడ.”
నని పేర్చి పలికెడు నయ్యతికాయు
ఘనగర్వమునకు లక్ష్మణుఁడు 1410నవ్వుచును:

  1. ↑కఠిన
  2. ↑డిట
  3. ↑డిట
  4. ↑డిట
  5. ↑ఁజంపెద
  6. ↑డిట
  7. ↑ఁగిట్టి-క…
  8. ↑ఁడడరు-న
  9. ↑తోలియుఁదన్ను నెదుర్కొను (న్న)కపుల. సరాక్షసేంద్రో హరియూధమధ్యేనాయుధ్య మానం నిజఘాన కంచిత్‌ అని మూలము
  10. ↑ని
  11. ↑కొంత
  12. ↑ఁడవు
  13. ↑చొరుము
  14. ↑సదనముల్‌
  15. ↑దండ
  16. ↑బంధ
  17. ↑రాది
  18. ↑వాఁ
  19. ↑పురంబబ్బె
  20. ↑నీవు పెద్ద
  21. ↑తల గ్రుచ్చికూ
  22. ↑ధరణి లోపలికి
  23. ↑గుజ్జురూపమై
  24. ↑ధారుణిలో
  25. ↑గోపించి - యో
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )