| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“ఓరి! నిశాట! యే నుండ రాఘవుని తోరణంబొనరింప దొరకొన నేల? నా దెసఁజక్కనై నడతెమ్ము నిన్ను నాదు బాణముల భగ్నంబు సేసెదను.” అని దానవులగుండె లవియ నందంద ఘనగుణధ్వని సేసి కదిసిన వాఁడు నా రభసంబున కాశ్చర్యమంది క్రూరాస్త్ర మొక్కటి గొని1411యార్చిపట్టి: “నిలునిలు లక్ష్మణ! నీవు బాలుఁడవు; వల, దంతకునికంటె వాలినవాఁడ; నా వరశరఘట్టనంబు సహింప నీ వసుంధర యొండె, హిమగిరి యొండె రావణుఁడెత్తిన రజతాద్రి యొండె, దేవతలున్న ధాత్రీధరం బొండె, యంజక హరుని విల్ల 1412వలీల విఱిచి రంజిల్లు మీ యన్న రాఘవుఁడొండె, కాక1413న న్నని మొనఁగదియ శక్యంబె? నీక నా ముందర1414 నిలువంగఁ దరమె? యీ వరసాయకం బిప్పుడుగిట్టి త్రావెడు నీదురక్తంబు సౌమిత్రి.” యని దురహంకృతి నాడిన నతఁడు: “దనుజుఁడ! నీకు వృథాగర్వ మేల? పోర నీ లావుఁజూపుదుగాక నాకు; నీ రిత్తమాట లింకేల నా యెదుర? నీవును శస్త్రాస్త్రనిచయంబుతోడ నీ విధంబున రథమెక్కి యుద్వృత్తి మానక యిటుపోటుమగవాడువోలెఁ బూని యున్నాఁడ విప్పుడు నిశాచరుఁడ!” యనవుడుఁగోపించి యతనిపై నేసెఁ దన చేతిబాణ ముద్ధతి వాఁడు1415దొడిగి. యేసి యార్చిన దివి నింద్రాదిసురులు నా సమయంబున నాశ్చర్యపడఁగ వదలక రాఘవేశ్వరుననుజుండు నది యర్ధచంద్రబాణాహతిఁద్రుంచి చెలువార బ్రహ్మవ్రాసినవ్రాఁత యింక వలదని తా1416బుజ వైచిన కరణిఁ జటులాస్త్ర మొక్కటి సంధించి వాని నిటలస్థలము గాఁడ నిపుణుఁడై యేసె. నేసిన రుద్రునియేటున వడఁకు భాసురాసురపురప్రాసాద మనఁగఁ జలియించి:“నాతోడ సమరంబుసేయఁ 1417గలిగెవీఁ.”డని యతికాయుండు1418వేర్చి కడిమిమై నరదంబుఁగదియఁదోలించి తడయక యా రాముతమ్మునిమీఁదఁ “జలమొక్కటియుఁదక్కఁ1419జంపుదు.”నన్న చెలువున నొక్క నిశితబాణ మేసె; “మూఁడంబకంబులమూర్తి గాచినను బోఁడిమి దక్కింతుఁబొ.”మ్మన్న కరణిఁ జటులవేగంబున సంధించి మఱియుఁ బటుతరంబుగ మూఁడుబాణంబు లేసె; “ననయంబుఁబెఱుకుదు నైదుప్రాణములు.”. ననుమాడ్కి వెండియు నైదమ్ములేసె; “నేడు వార్ధులు సొచ్చి యీఁదిపోయినను దోడనె1420చని మీఱి త్రుంతు.”నన్నట్టి కరణి నెంతయు భుజాగర్వంబు మీఱి యిరవొందఁగాఁదొడి యేడమ్ము లేసె. నవి వేగ లక్ష్మణుండంత లోపలనె వివిధఖండములు గావించి పెల్లార్చి యతికాయుపై నేసె నాగ్నేయబాణ. మతఁడు మాఱేసె సౌరాస్త్రంబు దొడిగి. యా రెండుశరములు నడరి యొండొంటి తో రణంబొనరించి తు1421నియలై రాలెఁ. జేకొని దైత్యుఁడైషికబాణ మేసెఁ గాకుత్థ్సతిలకుఁ డా కంపంబు నొంద. నది యైంద్రమునఁద్రుంచె నడరి లక్ష్మణుఁడు నది గని దైత్యుండు యామ్యాస్త్ర మేసె. నది ద్రుంచె నతఁడు వాయవ్యాస్త్ర మేసి. యదిగాక పెక్కమ్ము లసురపై నేయ నవి వాని మైమఱు వటుతాఁకి విఱిగి భువిమీఁదఁ1422బడిన నప్పుడు లక్ష్మణుండు వెండియుఁబెక్కేయ విఱుఁగు1423ట సూచి “కాండంబు లేమొకో కాఁడవు వీని.” నని యని చింతించి యలయుచు నుండె. “నెనలేని యీ మర్మమెఱిఁగింతు.”ననుచు నప్పు డాతనితోడ ననిలుండు వచ్చి చెప్పె: “లక్ష్మణ! బ్రహ్మచే వీఁడు వడసె వరము1424దాఁగోరి యీ వజ్రవర్మంబు; శరము1425లేమియు వీనిఁజాలవు నాటఁ; బలుతునియలు గాఁగ బ్రహ్మాస్త్ర మేసి పొలియింపు.”మనుడు నుప్పొంగి లక్ష్మణుఁడు నది సమంత్రకముగా నార్చుచుఁదొడిగి త్రిదశారిసుతుమీఁదఁదెగగొని యేసె. నేసిన బ్రహ్మాండమెల్లను బగుల వాసవుండదర దేవతలు గంపింప ధరణి వడంక దిక్తటము లల్లాడ శరధులు ఘూర్ణిల్ల శైలముల్ వడఁకఁ ధరణిచంద్రులు గతి దప్పంగఁజుక్క లురలంగ రత్నపుంఖోజ్జ్వలంబగుచుఁ బ్రళయకాలమునాఁటిపావకుభంగి నెలకొని లోకముల్ నిండి మండుచును యమదండమునుబోలె1426ననిల వేగమున గ్రమమొప్ప నెంతయుఁగడురభసమున నమ్మెయి బ్రహ్మాస్త్ర మరుదేర దైత్యుఁ డమ్ములు నిగుడింప నవియుఁగైకొనక వచ్చుటయును శక్తివైచె;వైచుటయుఁ జెచ్చెర నా శక్తిఁ1427జేకొన కదియు లావున రాఁగ శూలంబున1428ఁబొడిచె; నా విధంబును గొన కది మీఱి రాఁగ గద వ్రేసె; వ్రేసిన గదయును ద్రోచి యది వచ్చుటయుఁజూచి యడిదాన వ్రేసె; నది దాటి రాఁ1429బరశ్వాయుధంబెత్తి వదలక వ్రేయఁదీవ్రంబున నదియుఁ గడచి యే తేరంగుఁ1430గడఁకఁగటారిఁ 1431బొడిచె; నందునఁబోక 1432బోరన రాఁగ వలనొప్ప మొలనున్నవంకిని బొడిచెఁ, జలమున నది మీఱి1433 చటులవేగమున 1434బిఱుసున నటు రాఁగఁబిడికిటఁబొడిచె వెఱఁగంది దివిజులు వెసఁజూడ వచ్చి మండితకోటీరమండలితోడఁ 1435గుండలంబులతోడఁగూల్చెఁదచ్ఛిరము నటు వజ్రహతి రోహణాద్రిశృంగము చటులతఁగూలిన చాడ్పునఁబడిన యతికాయుతలఁజూచి యతిభీతి నొంది హతశేషులైన దైత్యాధముల్ 1436పఱచి లంకఁజొచ్చుటయుఁగెలంకులఁగపులు నంకించి రెంతయు; నా లక్ష్మణుండు నరుదెంచి శ్రీరామునడుగుల కెఱఁగఁ గరము సంతోషించి కౌఁగిటఁజేర్చి వినుతించి యా కపివీరులతోడ ననయంబు హర్షించె నవనీశుఁ.డంత నా దైత్యనాథుండు నయ్యతికాయుఁ డాదిగాఁగల దైత్యులార్వురుఁ బడుట విని మూర్ఛపాల్పడి వేగంబె తెలిసి ఘనముగాఁగన్నీరు గ్రమ్మ నందంద యతిదుఃఖమునఁ 1437జాల నడలుచునున్న పతిఁ జేరి మయుపుత్త్రి పలికె నిట్లనుచు: “నసురేశ!లోకంబులన్నింటిలోన నసమానసత్త్వుఁడ1438వైన నీ కిట్లు పాఁడియే శోకింప;1439బంటవై నీవు నాఁడేల తెచ్చితి నరనాథుదేవి; నొప్పింప నేరవై; తుచిత1440కాలంబుఁ దప్పె; నా రామునిఁ దలపడ్డదైత్యు లరుదెంతు రనుమాట లవియుఁబోవిడువు. సురవైరి! యాజిలోఁజూపు నీ కడిమి.” ననుమాట లాలించి యాత్మఁజింతించి వనిత నంతఃపురవాసంబు కనిచి నినిచినవగపుతో నిట్టూర్పు వుచ్చి తన మంత్రివరులతో దశకంఠుఁడనియెఁ: “గటకటా! తమ్ములు గాదిలిసుతులు నిటు1441వలెఁగూలి; రింకేమనఁగల1442దు! విబుధులకైనను విడిపింపరాని ప్రబలంబులగునాగపాశ బంధములు పాసిరి మాయనో బలిమినో మనుజు. లాస సేసినఁ1443జెల్ల దది నాకు విజయ; మా రాముతమ్ముని నాజిలో గెలుచు వీరుని నెవ్వని వెదకియుఁగాన. 1444భయ మెన్నఁడును లేక పరగు నీ లంక భయమునఁబొందె నా బలియుర వలన. నా రామవిభుని పరాక్రమంబునకు మేర యెయ్యది? యిటమీఁద నీ లంక యతనిచేఁబడకుండ నరసి యేమఱక ప్రతిదినంబును గావఁబంపుఁడీ.”యనుచు నంతఃపురంబున కరిగి యొక్కరుఁడు నంతరంగంబున నడలుచు నుండె. |