| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
కుంభకర్ణునికొడుకుల నని కనిచెఁ గుంభనికుంభుల 1525ఘోరవిక్రములఁ; బనిచె వెండియును గంపనునిఁబ్రజంఘు ననికిఁదోడుగ శోణితాక్షు యూపాక్షు. నా రాక్షసులును గజాశ్వరథంబు లా రూఢి నెక్కి సహాయులై నడవఁ, బరిఘ గదా ప్రాస పట్టిస శూల కరవాల కుంత ముద్గర భిండిపాల శర శరాసనము లుజ్జ్వలభంగిఁదాల్చి గురుశక్తిదానవకోటులు నడవఁ, జారుపతాకా నిచయములు గ్రాల భూరిభూషణదీప్తిపుంజముల్ వెలుఁగ నధికమైనట్టితూర్యంబులు మ్రోయఁ గుధరంబులగల దిక్కులు నిండ నార్చి పరుపడిఁగల్పాంత పవన సంఘములు దరమిడి కాలాంబుదంబులఁదాఁకి విఱుచు తెఱంగున వీడెల్లఁగాల్చి యఱిమురి విహరించునగచరావళుల నురువడిఁదాఁకి మహోగ్రులై నిలిచి తెరలించి నొంచి యుదీర్ణవిక్రములు వాకిండ్లయందు దుర్వారులై నిలిచి యా కపిసేనల నందంద తోలి యా లంక వెడలింప నగచరసేన లోలి వీఁగుట సూచి: “యోడకుఁ.”డనుచు నురుబాహుసత్త్వపయోధులై పేర్చి హరిరోమకేసరు లాదిగాఁ గల్గు వానరు లా దైత్యవర్గంబుతోడ మానక రోషసమగ్రులై కదిసి తరులును గిరులును దఱచుగా వైవఁ గరవాలముల నురుగదల శూలములఁ బరిఘ పట్టిస భిండిపాల చక్రాది వరశస్త్రముల నొంచి వాలిన నంత వారు నఖంబుల వక్షస్థ్సలములు చీరియుఁ, గర్ణనాసిక1526ములు ద్రెవ్వఁ గడిమిమైఁబండ్లను గఱచియుఁ, దలలు పిడికిళ్లఁబొడిచియుఁ, బేర్కొని యప్పు డొక వానరుఁడు వచ్చి యొక దైత్యుఁబొడువ నొక దానవుఁడు వాని నుద్ధతిఁబొడుచు; నొక రాక్షసుఁడు వచ్చి యొక కపిఁజంప నొక కపి యా దైత్యునుగ్రతఁజంపు; నొక కపి సనుదెంచి యొక దైత్యుఁబట్ట నొక దైత్యుఁడా కపి నురువడిఁబట్టు; నొక దైత్యుఁ డొక కపి‘యుద్ధ మి.’మ్మనిన నొక కపి వానితో యుద్ధంబు సేయు. నెడపక యేడ్గురు నెనమండ్రుఁగూడి పిడికిళ్ల నొక్కనిఁ1527 బేరణఁగింప నందిందుఁగూలుదు రసురులుఁగపులు. 1528నందఱు నుగ్రులై యార్చుచు1529ఁబేర్చి యిరువాగుఁబోరంగ నింతింతలైన తరు మహీధరశృంగతరుచరాంగములఁ గరి హయ దనుజనికాయకాయముల వరశస్త్రముల రణోర్వర ఘోరమయ్యెఁ.[వా.రా. సర్గ 76] గడిమిమై నప్పుడంగదునిపైఁబేర్చి కడఁగి కంపనుఁడుగ్ర గదయెత్తి వైచె; నంగదుండును నొచ్చి యంతలోఁదెలిసి తుంగశైలమున దైత్యుని వ్రేయుటయును నా కంపనుఁడు చూర్ణమై నేలఁ1530గలిసె నా కపినాయకుఁడార్చుచునుండ. నతఁడు సచ్చిన శోణితాక్షుండు గినిసి గతి దప్ప నరద మంగదు మీఁదఁబఱపి యక్ష1531తాస్త్రము లేయ నడరి యంగదుఁడు రాక్షసుఁడున్న యా రథమున కుఱికి విల్లుఁద్రుంచుటయును వెస నొడ్డనమ్ము నుల్లసితాసియు నుగ్రతఁగొనుచు నాకాశమునకు నయ్యసుర లంఘింప నా కపివీరుండు నతనితో నెగసి యా రాక్షసునిచేతియడిదంబుఁబుచ్చి యా రాక్షసుని వ్రేయ నతఁడు మూర్ఛిల్లె నంతకుఁడై రాక్షసావలిఁ1532దునుమ నంతలోననె శోణితాక్షుండు దెలిసి గదఁబుచ్చికొనుచు నంగదు1533మీఁదఁబాఱ గదిసెనప్పుడు తోడుగాఁబ్రజంఘుండు; యూపాక్షుఁడును గూడ నొగి రాఁగఁజూచి యేపున ద్వివిదుండు నేచి మైందుండు నా యంగదునకుఁదోడై కూడుకొనిరి. యా యార్వురకు ఘోరమయ్యె రణంబు. నప్పుడు వానరు లగములు గురియఁ జప్పరింపుచును బ్రజంఘుండు ద్రుంచె. మఱియు నా మువ్వురు మర్కటేశ్వరులు దఱచుగా గిరులును దరులును నెత్తి కరిరథాశ్వములపైఁగడుబెట్టు వ్రేయ నరుదుగా నడుమ యూపాక్షుండు ద్రుంచె. విన విస్మయంబుగా ద్వివిదమైందులును బెనఁగొని వక్షముల్ పెఱికి వైచుటయు నవియన్నియును శోణితాక్షుండు నడుమఁ గవిసి చూర్ణములుగా గదఁగొని వ్రేసెఁ. గలకలధ్వని యొప్పఁగరవాలమెత్తి జళిపించుకొనుచుఁబ్రజంఘుండు గదియ మానైన యొక నల్లమద్దిమ్రానెత్తి వానిపై నడరించి వారక మఱియుఁ బిడికిట వక్షంబు బెట్టుగాఁబొడువ నడిదంబు వైచి యయ్యసుర గోపించి పిడుగుతో సరియైన పిడికిటఁబొడిచెఁ; బొడిచిన వెస మూర్ఛఁబొందియుఁదెలిసి సమధికముష్టిఁ బ్రజంఘు మైందుండు తమకించి పొడిచిన 1534ధరణిపైఁగూలెఁ. బృథివిపై నటు తన పినతండ్రి1535వడినఁ బ్రథితంబుగాఁజూచి రథ మటు డిగ్గి యడిదంబుఁదాల్చి యూపాక్షుండు నడవ విడువనియలుకతో ద్వివిదుండుఁదాఁకి వరముష్టిచే వాని వక్షంబుఁబొడిచి గురుసత్త్వుఁడై పట్టుకొనుటయు నప్పు డతని తమ్ముఁడు శోణితాక్షుండు వచ్చి వితతబలంబొప్ప ద్వివిదునిరొమ్ము పిడికిట నొప్పించి పెనుమూర్ఛఁబుచ్చి విడిపించుకొనిపోయె వేగ యూపాక్షుఁ. దెలిసి మైందునితోడ ద్వివిదుండుఁగూడి సొలవక యూపాక్షశోణితాక్షులను నటు తాఁకి వారితో నని సేయునపుడు చటులత ద్వివిదుఁడాశ్చర్యంబు గాఁగ నలమి1536యుద్ధతి శోణితాక్షునిఁబట్టి యిలవైచి ప్రామె రూపేర్పడకుండ. నడరి మైందుండు యూపాక్షునిఁగిట్టి బెడిదంబుగాఁదన పిడికిటఁబొడిచి చలమున ధీరుఁడై చంపె నుగ్రముగ నలియ నెమ్ములు మేను నలినలి1537గాఁగ. నిలమీఁదఁగపులచే నిట్టిచందమున నలు1538వురు దానవనాథులు వడిన నేపఱి రాక్షసులెల్లను బఱవఁ గోపించి యప్పుడు కుంభుండు వారి వెఱవకుండని తన1539వింటి లా వొప్ప మెఱుఁగుటమ్ముల 1540తోడ మెఱుఁగులతోడి సురచాప మనఁజాలశోభిల్లు 1541విల్లు పరగఁబ్రత్యాలీఢపాదుఁడై నిల్చి తెగగొని యేయుడు ద్వివిదుఁడు భూమి నగముకైవడిఁగూలె నతిఘోరలీల; ముందఱ ననుఁగుఁదమ్మునిపాటుఁజూచి యందంద మైందుండు 1542నసమవేగమునఁ గుంభునిపై నొక్కకొండ వైచుటయుఁ గుంభుఁడేనమ్ములఁగుధరమ్ముఁద్రుంచి మఱియు నొక్కమ్మున మైందుని నేయ నొఱగె నయ్యగచరుం డుర్వరమీఁద. ధరమీఁద నీ గతిఁదన మేనమామ లిరువురుఁగూలిన నేచి యంగదుఁడు కుంభునిపై వైచె ఘోరభూధరముఁ. గుంభుఁ1543డై దమ్ములఁగుధరంబుఁద్రుంచి1544 మఱి పెక్కుశరముల మర్మంబు లేయ 1545నెఱయుచుఁగుంభుపై నెగసి యంగదుఁడు1546 రోషించి వైచె నారూఢశైలముల. భీషణలీలమైఁ బేర్చి కుంభుండు నెలకొని వాని నన్నియుఁదెగ నేసి బలియుఁడై యంగదుఫాలమధ్యమున నురుశరద్వితయ మేయుడు మోము నిండఁ దొరుగుచునున్న నెత్తురుఁదుడ్చికొనుచు ఘనతర తరు వెత్తి కడఁగి యంగదుఁడు దనుజునివైవ నా తరువును ద్రుంచి యా కుంభుఁడంగదు నందంద మఱియు భీకరబాణ1547సంపీడితుఁజేయ, నతఁడు మూర్ఛిల్లిన నా రాముకడకు నతివేగమున వానరావలి పాఱి యంతయుఁజెప్పిన నధిపతి జాంబ వంతుఁడాదిగఁగల 1548వనచరోత్తములఁ బనిచిన వారలు పాదపశిలల దనుజుల నొంచుచుఁదఱుమఁ గుంభుండు వారి ననేకతీవ్ర1549ప్రకాండముల వారక నొప్పించి వారి వారించె. నప్పుడు సుగ్రీవుఁ డా కపివరుల నప్పరుసునఁబడ్డయంగదుఁజూచి కోపంబు ముడివడఁగుంభునిమీఁద నేపారఁగాఁద్రోచి యెన్నఁబెక్కైన ఘనశైలములు నశ్వకర్ణవృక్షములు వనచరులార్వంగ వైచి పెల్లార్చె. నవియన్నియును గుంభుఁడంతలోఁద్రుంచి రవిజునిఁబెక్కుమార్గణముల నొంప స్రుక్క కాతనివిల్లు సుగ్రీవుఁడొడిసి యక్కజంబుగఁ1550బుచ్చి యటుత్రుంచుటయును దంతంబు దునిమినఁదఱిమి పైవచ్చు దంతిచందంబునఁదఱిమి కుంభుండు కడురోషమున మండి కడఁగి సుగ్రీవుఁ బడవైతునని పాఱి పట్టుకొన్నప్పు డినజుండు1551ఁగుంభుండు నిభములు రెండు పెనఁగినకైవడిఁబెనఁగి 1552రుద్ధతిని గరలాఘవము లొప్ప ఘనశక్తి మెఱసి చరణఘట్టనల భూస్థలము గ్రక్కదలఁ బొగలచందమున నూర్పులు గ్రమ్ము1553చుండ మిగిలిన తాఁకుల మిన్నెల్ల1554ఁబగుల. |