ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
వానరులు లంకఁ గాల్చుట
యనుమాట విని కపులందఱుఁగూడి:
“యినమండలము గ్రుంకు టెప్పుడో?”యనుచుఁ
దమకించుచుండంగఁదరణి గ్రుంకుటయుఁ
దమము1495ను బెద్దయై దట్టమై పర్వ
నప్పుడు కపివీరు లధికరోషమున
నుప్పొంగి ధీరత నుగ్రులై చెలఁగి
గునిసియాడుచు మండుకొఱవులువట్టి
కొని జవంబులు మీఱఁగుప్పించి దాటి
వడి లంక ముట్టి యా వాకిళ్లవారు
కడు భయంబునఁబాఱఁగా1496లంకఁజొచ్చి
‘యా రావణునిపురి యడరి కాల్చుటకు
నా రామవిభుని 1497కోపాగ్ని యేమిటికి?
నీ యనలము సాలదే.’యను మాడ్కిఁ
బాయక లంకఁగాల్పంగఁజొచ్చుటయు
ననలుండు దరికొని యందంద1498యేచి
వినువీథిఁదాఁకి దిగ్వివరముల్‌ నిండె.
నా యగ్ని బడబాగ్నియై ధూమపటలి
తోయమై 1499మిన్నంది తోయధిఁబోలె.
విస్మయంబుగ మణివితతులు సెదర
భస్మంబుగాఁగాలెఁబ్రాసాదతతులు;
పొడిపొడిగాఁగాలి పొడవెల్ల నడఁగి
పుడమి గంపింప గోపురములు గూలె;
గ్రక్కున మంట లుగ్రంబుగా నెగయ
నక్కజంబుగఁ గాలి యట్టళ్లు వ్రాలె;
మహనీయకాంచనమంటపంబులును
బహురత్నమయగృహపంక్తులుఁగాలె;
నిండినసొమ్ములు నిండినట్లుండ
భండారగృహములు భస్మంబులయ్యె;
వెల లిడఁగా రాని వివిధాంబరములు
దలఁపఁబెక్కైన గంధద్రవ్యములును
బహువిధ రత్నకంబళచయంబులును
మహనీయ మౌక్తికమరకతాదులును
నగరు కుంకుమ మలయజ ఘనసార
మృగ1500మదాద్యములైన మేలివస్తువులుఁ
దఱగనిబహువిధ ధాన్యరాసులును
మఱియును గలిగిన మహితవస్తువులుఁ
గడు నొప్పు కరితురంగములపక్కెరలు
నెడనెడఁబ్రోవుగా నిడినట్టిజోళ్లు1501
దొరల ననేకవస్తువులు దైత్యులకుఁ
గరకరిఁజిత్తముల్‌ గందంగఁగాలె1502ఁ.
దడయక పైఁడికత్తళములు దొడిగి
వడి నాయుధములు దుర్వారులై పూని
‘కపులఁజంపెద.’మని కడఁగెడువారి1503
విపులరతిక్రియావేశతఁబొంది
పొలఁతులతో సుఖంబున నున్నవారిఁ
దొలఁగంగ నేరక 1504తూఁగెడువారిఁ
బోలింపఁగడు నిద్రవోయెడువారి
బాలురఁగొని భీతిఁబాఱెడువారి1505
నాలుగుదెసలకు నలి నేఁగువారిఁ
జాల రోదనములు సల్పెడివారి
విడువక ధనములు వెడలంగఁ1506బెట్టి
కడు సంభ్రమంబునఁ1507గదిసెడువారిఁ
ద్రోవలు గానక ధూమంబుచేత
నావులించుచు వడి నలఁదురువారి
నార్పంగ నురుమందిరాగ్రంబు లెక్కి
నేర్పున మఱి దిగనేరనివారిఁ
గూడి నివ్వెఱఁగంది గుమురులు గట్టి
వాడవాడలయందు వనరెడివారి
నప్పుడు చూడఁగాలాగ్ని చందమున
నిప్పులు మంటలు నెఱయ నప్పురము
కాలుచు నందంద కడు రభసమునఁ
గాలిచె నగ్ని 1508పెక్కండ్రురాక్షసుల.
లలనల మణిమేఖలారవంబులును
1509గలయఁజెన్నొందుకంకణరవంబులును
బొలుపారురత్ననూపుర రవంబులును
జెలఁగెడు నా విపంచీ రవంబులును
సురుచిరమధురవచోరవంబులును
నరుదైననృత్తగీతా రవంబులును
గరమింపుగులుకు కేకా రవంబులును
జరియించుచుండు హంసల రవంబులును
సొంపారుపంజరశుక రవంబులును
నింపారు టెంతయు నిలలోనఁ1510గలసె.
సలలితంబైనట్టి చంద్రికకంటెఁ
దెలుపున నొందిన దీధితుల్‌ 1511దఱిగి
ప్రణుతికి నెక్కినపద్మరాగాది
మణులచే నొప్పినమహిమలు 1512వాసి
కాలెడి 1513రవములఁగప్పెడిపొగల
వ్రీలి పెల్లెగసెడి విస్ఫులింగముల
నా లంకలోపలి హర్మ్యంబులెల్లఁ
జాల భీషణముగా సమసె నన్నియును.
గాన సుఖంబెల్లఁగ్రాఁగి నీఱైరి
మానినీమణు లభిమానంబు 1514దూలి.
చండతరంబైన శబ్దంబుతోడ
మండుచునుండెడిమంటలతోడ
నెఱపైన తోరణనికరంబు లొప్పె
మెఱుఁగుల వెలుఁగొందు మేఘంబు లనఁగ.
వినువారిగుండెలు వీనులుఁబగుల
ననయంబు బెట్టుగా నా 1515పురంబందుఁ
దరమిడి యందంద1516దందహ్యమాన
పురవధూ రోదనంబులు వినవచ్చెఁ.
గాలి1517కాలని తమకట్టులు ద్రెవ్వ
నీలిగి1518విడివడనేరని కరుల
హయములక్రందున నా లంక 1519యుండె
రయమున మును రఘురాముబాణాగ్నిఁ
దలకొని జలచరతతులు సమ్మర్ద
ములఁబ్రఘోషించు సముద్రంబువోలెఁ.
బాఱెడువారినిఁ బఱతెంచువారిఁ
గూఱినవగలతోఁ గుందెడువారి
నొదిఁగెడు వారిని నొకకొంత గాలి
విదిరిచికొనుచును వెడలెడువారి
లంఘించువారి విలాపించువారి
సంఘంబులై నీరుసల్లెడువారిఁ
బట్టి యా మంటలోఁబడఁద్రోసి త్రోసి
నెట్టన నార్తురు నెఱయంగఁగపులు.
అటు వికలతనొంద నా రాఘవుండు
పటుతరకోదండపాణియై కదిసి
త్రిపురముల్‌ సాధింపఁద్రినయనుఁడలిగి
విపులపినాకంబు వీఁక మ్రోయించు
కరణి నిర్వక్రవిక్రమశాలి రాముఁ
డురుతరజ్యాఘోష మొనరించుటయును
వసుధాతలంబున వడిఁజుక్క లురిలె;
వసుమతి గంపించె; వార్ధులు గలఁగె;
దెసదప్పి రినశశుల్‌; దివిజాద్రి యొఱగె;
దెసలసంధులు వ్రీలె; దిగిభముల్‌ 1520గూలె;
నసమాక్షుఁడతివిస్మయంబందె; భూత
విసరంబు ఘూర్ణిల్లె; విధి తల్లడిల్లె;
రయమున రోదోంతరాళంబు మ్రోసె;
భయమంది రెంతయుఁబౌలస్త్యులెల్లఁ.
గోదండరవము రక్షోభట సింహ
నాదంబు వీరవానరులయార్పులును
దిక్కు లొక్కట నిండె. దివిజారి పురము
1521దిక్కు గోపించుచుఁదీవ్రవేగమునఁ
గైలాసశిఖరంబుకరణిఁజెన్నొందు
నా లంకగోపురం బైదు బాణముల
వడినూఱుతునియలై వసుధపైఁగూలఁ
బడ1522నేసి మఱియును బహుసాయకముల
నేసె గేహములపై; నేసె సౌధముల;
నేసెఁ దేరులమీఁద. నేయుట సూచి
యా రాక్షసులు పోరి కాయత్తపడఁగ
నా రాత్రి వర్తించె నతిఘోరలీల.
నప్పుడు సుగ్రీవుఁడఖిలవానరులఁ
దప్పక చూచి యుదగ్రుఁడై పలికె:
“లావు నొప్పారంగ లంకవాకిండ్లఁ
గావలియుండు రాక్షసుఁడెవ్వఁడైన
వెడలినఁజంపుఁడు;1523విడిచితిరేనిఁ
గడుఁదప్పు; సైరింపఁగపివరులార!”
యనవుడుఁగపివీరు లందఱుఁబేర్చి
కనలుచుఁగుజములు ఘనశైలములును
జారువిభీషణరణోత్సాహులై పూని
వారక యక్కోటవాకిండ్ల నుండి
దర్పించి యార్చినఁదరుచరా1524వళుల
యార్పులు సైరింప కసురవల్లభుఁడు

  1. ↑నంతంతకు.. పర్వె
  2. ↑లోను
  3. ↑బాణాగ్ని
  4. ↑పేర్చి, పర్వి
  5. ↑మిన్నప్డు
  6. ↑మదంబాదిగా
  7. ↑ఁదరమిడి శస్త్రాస్త్రతను వర్మచయము (ములును)దొరల…
  8. ↑మరువశ మరి మదోన్మత్తులై యపుడు (తిగిచి)-తడయక
  9. ↑ఁగపులపైఁబఱతెంచి కదిసినవారిఁ -బొలఁతులతో…
  10. ↑తూలెడు
  11. ↑బాలురకై క్రందు వడియెడు వారి - నోలి మూఁకలు గట్టి యున్నట్టివారి
  12. ↑బట్టి
  13. ↑గలఁగెడు
  14. ↑పెక్కండ్ర
  15. ↑గలసి వీతెంచు
  16. ↑గలసి
  17. ↑గలిగి
  18. ↑బలసి
  19. ↑వనములఁ
  20. ↑లెడలి
  21. ↑లంకలోనఁ
  22. ↑దైన్యంబు మీఱి
  23. ↑కాలియు… ద్రెవ్వి
  24. ↑వెలువడ
  25. ↑లోన
  26. ↑బెదరె
  27. ↑దిక్కున దీపించుతీవ్రకోపమున
  28. ↑నేసె
  29. ↑వెఱచితి
  30. ↑ధిపుల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )