| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
విని మహోత్సాహియై వేగంబె వాఁడు “తన తండ్రి పగదీర్పఁదన కబ్బె.”ననుచు ముదమంది తన రెండు మూఁపు లుప్పొంగ ద్రిదశారి కప్పుడు ధీరుఁడై మ్రొక్కి వీడ్కొని రథమెక్కి వెడలి కయ్యంబు వేడ్కతోఁదనయొద్దివీరుల 1567ఁజూచి: “మీరు సమగ్రత మెఱసి యుగ్ర1568తను బోరుఁడు కపులతోఁ1569బొరిఁబొరి నేను రామలక్ష్మణుల మర్కటముల నాదు భీమశరా1570గ్నుల భిన్నులఁజేసి యేచెద.”ననవుడు1571నెలమి దానవులు ద్రోచి తో నడవంగ దుశ్శకునములు కలిగెఁబె.క్కవియెల్లఁగనియు నయ్యసుర తలఁకక తూర్యనాదంబులు సెలఁగ నలి నార్చి కవిసె వానరసేనమీఁద నిలయు నాకాశంబు నిట్టట్టు వడఁగఁ. దఱిమి వానరులును దరులును గిరులు దఱచుగా వైచిరి దైత్యులమీఁద; దానవులును గదాదండ కోదండ మానిత1572ఖడ్గాదిమహితశస్త్రముల వాని నన్నింటిని వడిఁద్రుంచి మఱియు వానరకోటిఁదీవ్రత నొంచి యార్చి. రా సమయమ్మున నమ్మకరాక్షుఁ డా సర్వకపులపై నతివేగ రథముఁ బఱపుచుఁగదిసి ముప్పదిట నూఱింట నఱువ1573దింటను మఱి యఱువదేనింట నిరువ1574దింటను వెస నిరువ1575దాఱింటఁ బరగ నాఱింటను బండ్రెంట రెంటఁ బదిటఁబదేనింటఁబదునెన్మిదింటఁ బదుమూఁట నాల్గింటఁబదునాలుగింటఁ దెగఁగొని మూఁట నైదింట నేడింట నగలించి తొమ్మిదియమ్ముల నేసె. 1576నవి సహింపఁగలేక యఖిలవానరులు భువి తల్లడిల్ల నప్పుడు పాఱుటయును; |