| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“హో! మీరు వెఱవకు; డోడకు.”డనుచు రాముఁడు విలుగొని రాక్షసుల్ బెదరఁ జతురంగబలములఁజంపుట చూచి యతికోపమున మకరాక్షుండు పేర్చి యరదంబుఁబఱపించి యా రాము డాసి: “ఖరసూతి, యేను రాఘవ! మున్ను నీవు పెరిగి మా తండ్రిఁజంపినదానఁజిత్త మెరియుచు నుండె నా కింతకాలంబు; నాకు నీ తోడి రణం1577బబ్బుటకును జేకొని చింతింతుఁ; జేకూరె నేఁడు; తర1578లకు నీవు; మా తండ్రిసూడునకు నెరయంగఁబోరాడ నినుఁగంటి నేను. దుర మొనరింపు నాతో వింటనైనఁ గరవాలమున నైన గద నైన.”ననుడు వాని1579తో రాఘవేశ్వరుఁడు గోపించి: “దానవాధమ! యీ వృథాగర్వమేల? భాసిల్లు నా బాహుబలము సొంపారఁ గా సమరంబున ఖండింతు నిన్ను.” ననిన రాముని మకరాక్షుండుఁ1580గిట్టి ఘనమైననిశితాంబకంబుల నేసె. నేసిన నవి రాముఁడెడఁద్రుంచివైచె. నా సమయమున బ్రహ్మాండంబు దిశలు నిండె నా యిద్దఱ నిష్ఠురచాప దండమహాగుణధ్వనులు పెల్లడరి. సురఖేచరాదులు చోద్యంబునొంద నరుదార నేయు రామాస్త్రంబులెల్ల నతివేగమున మకరాక్షుండు ద్రుంచి యతులబాణంబుల నడరించుటయును నవి రాఘవుఁడు ద్రుంచి యా మకరాక్షు వివిధ నిష్ఠురశరావృతుఁజేయ నతఁడు నవియెల్లఁగడఁగి యత్యంత వేగమున వివిధఖండములు గావించి పెల్లార్చెఁ. గోపించి కాకుత్స్థకులుఁడు నద్దైత్యు చాపంబు వెస నొక్క శరమునఁద్రుంచి సారథి నెనిమిది సాయకంబులను నా రథంబును మఱి యన్ని బాణముల వికలత్వ మొనరింప విరథుఁడై యపుడు మకరాక్షుఁడొక్క సమగ్రశూలంబు వైచిన నది వేగ వచ్చిన విభుఁడు చూచి మూఁడమ్ములఁజూర్ణంబు సేసె. ననిమిషు లా రాము నగ్గించి రపుడు. దనుజుండు గినిసి యా దశరథాత్మజునిఁ బిడికిటఁబొడువంగ బి ట్టేఁగుదేర నడుమనె యా రామనరనాయకుండు ననలాస్త్రమున హృదయము గాఁడ నేయ నని మొన నమ్మకరాక్షుండు గూలెఁ. బ్రథితారుణప్రభాభాసియై యంతఁ బ్రథమాద్రిపైఁదోచెఁ బద్మబాంధవుఁడు. హతశేషరాక్షసు లా లంక1581కరిగి యతఁడు సచ్చుట సెప్ప నా రావణుండు కోపంబుఁ జింతయుఁగూడి చిత్తమున నేపార ననియె నయ్యింద్రజిత్తునకు:[వా.రా. సర్గ 80] “రణములోఁగపులను రామలక్ష్మణుల క్షణమాత్రమునఁజంపఁజాలుశూరుండ వీవెకా కింక నాకెవ్వరు గలరు? నీ విటు నిజవాహినీసమేతముగఁ జని యిద్దఱను జంపి చనుదెమ్ము1582మున్ను ననిమిషకోటుల ననిఁ1583జంపుకరణి రణమున గెల్చి సంరంభంబుతోడఁ బ్రణుతింప నే తెమ్ము ప్రమదమొప్పార.” |