| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
సేతువు దిక్కుకై చెడి పాఱునపుడు వాతూల1843సుత నీల వాలినందనులు కని సేతు వటుదాటి గ్రక్కున నెందుఁ జనకుండ మరలింపఁజనుదెంచి భీతి వనచరుల్ తన వెన్క వచ్చి చొచ్చుటయు గనుఁగొని రాముండు కపివరుల్ సెలఁగ దనుజుల మనములు తల్లడంబంద ధను వందుకొని గుణధ్వని సేసి1844యార్చి కరలాఘవము చిత్రగతులొప్ప మెఱయు1845 శరములు1846వఱప నిశాచరుల్ 1847బెగడి తెరువులు గానక తిరుగుడు వడుచుఁ దెరలియు మరలియుఁదీవ్రకోపమున ధరణీశుఁగాన రా ధరణీశుఁడేయు శరముల తఱచున సమరాంగణమున. రవికులతిలకుండు రభసంబుతోడ వివిధభంగులఁదన విలువిద్య మెఱసి యేసినశరము లనేకంబు లగుచుఁ గాసి సేయుచుఁదాఁకఁగా దైత్యవరులు నడుములు దెగియు నెన్నడిమికిఁ దొడలు గడికండలయ్యు వక్షములు వ్రస్సియును వదనముల్ 1848గాఁడియు వర్ణముల్ సెదరి పదములు దునియలై బాహువుల్ విఱిగి గళములు దునిసియుఁగరములు దెగియు దలలవిసియుఁ దనుత్రాణముల్ దాఁకి శరములు మెయి నుచ్చిచనఁగ నెత్తురులుఁ దొరుగ నంగములఁదుత్తునియలై.రపుడు కెడయు రాక్షసులు బెగ్గిలెడు రాక్షసులు బుడమిపై మూర్ఛలఁబొందు రాక్షసులు నొగులు రాక్షసులును నోరులు దెఱచి దిగులొందు రాక్షసుల్ ధీరత సడలి వారణంబులవారు వాజులవారుఁ దేరులవారునై తిరుగుడు వడఁగ: “నదె రాఘవుండేసె; నదె రాముఁడేసె; నదె డాసె; నదె1849డాసె, నదెయిదె.”యనుచు వీక్షింపరా1850కతివేగంబు మెఱసి రాక్షసబలములు రయమునఁ1851బఱవ నంత1852లోనన రాఘవావనీనాథుఁ డెంతయు ఘనరోషమెసగ వెండియును సమ్మోహనాస్త్రంబు సంధించి1853పఱపఁ దమ్ముఁ దామెఱుఁగక దానవుల్ బ్రమసి దానవుండీతండు, తరుచరుండితఁడు దా నని తెలియక దనుజుండు దనుజుఁ గని తాఁకునప్పుడు1854గాంధర్వ శరము ఘనమహత్త్వమున రాక్షసులకుఁజూడ నొక్కొక్కనికి రాముఁడొక్కఁడే యగుచు నొక్కొక్కనికి రాములొగిఁబదుండ్రగుచు నొక్కొక్కనికి రాము లొగి నూర్వురగుచు నొక్కొక్కనికి రాము లొగి వేవురగుచు నొక్కొక్కనికి రాము లొగి లక్షయగుచు నొక్కొక్కనికి రాము లొగిఁగోటియగుచు శతకోటి యర్బుద సంఖ్యలు గడచి యతులితంబైన యయ్యాజిరంగమున మఱి1855సర్వమును రామమయమయ్యె.నపుడు గిఱికొనియుండ నీ క్రియ నల్కతోడ వడినేయు నప్పుడు వారక గుడుసు పడియున్న రఘురాము పసిఁడివిల్ సూచి “సమరసమాభీలచక్రి యుగ్రతను నముచిపై నేసిన నాఁటి చక్రంబొ! కిరణజాలంబుల గిఱికొన్న భాను పరివేషచక్రమో పరికింప!” ననుచుఁ దమ మనంబుల నెంచి దైత్యు లయ్యంప గముల1856కు నిలువక కలగొని పర్వ నమరారిసేనలో నప్పు1857డొక్కొక్క నిముసంబులోపల నెత్తురువాన 1858నానినహరులు పద్నాలుగువేలు నేనుఁగు లొక పదునెనిమిదివేలు లక్ష తేరులు రెండులక్షలు వీర రాక్షస వీరులు రణభూమిఁగెడయ; శరము లరంబులై చాపంబు నేమి కరణియై గుణరవక్వణితంబు మెఱసి కిరణ స్ఫులింగముల్ గిఱికొన్న రాము కరచాప చక్రంబు కాలచక్రంబు గతి నుల్లసిల్లంగఁగనుఁగొని పెలుచ హతశేష దైతేయు లతిభీతిఁబొంది కడుఘోరమైన సంగరభూమి విడిచి వడి లంకఁజొచ్చిరి వనచరులార్వఁ. గాలాంతమునఁగాలకంధరుండలుకఁ గేలి సల్పిన నాఁటి క్రియ నుండె రణము. వలనైన యట్టి రావణుమూలబలముఁ జలమున రఘుపతి సమయించునపుడు పది1859వేల కరులు నిర్వదివేలహరులుఁ బది1860పదు లరదముల్ పద్మంబు బలము నాలంబులోపల నతిదారుణముగఁ గూలిన నొక యట్ట గునియుచు నాడు; నట్టలు కో1861టాడ నద్దివి కెగసి బెట్టుగా నొక తల పెడబొబ్బ వెట్టు; నట్టివి కో1862టాడ నా రామువింటఁ గట్టిన యొకగంట ఖణిలని మ్రోయు; మరగంటలును నాదు మాన కీ రేడు మొరసె నవ్విభుచాపమున1863ఁబలుమాఱు. భావింప రాకుండఁబదునేడు గడియ లా వీరవరుని బాణాసనవిద్యఁ గిన్నర గంధర్వ ఖేచర యక్ష పన్నగామరవరుల్ ప్రణుతించి రెలమి. నా రామచంద్రుండు నప్పు డింపలర శూరపుంగవుఁడైన సుగ్రీవుఁజూచి: “జగదేకభయద మీ సమ్మోహనాస్త్ర; మొగిఁ బ్రయోగింపంగ నుపసంహరింప నేనొండె1864ఁదక్కిన నీశ్వరుండొండెఁ గాని నేర్పరు లొరుల్ గారు లోకములఁ. గౌశికుండిచ్చిన ఘన శస్త్రమహిమ కౌశికాదులకైనఁ గన నశక్యంబు.” అనిన విభీషణుండా రాముఁజూచి వినయసంభ్రమములు వెలయ నిట్లనియె: “దేవ! యీ బలములు దేవేంద్రుఁడాది దేవతలకునైనఁ దెరల వెన్నఁడును. బౌలస్త్యునకు మూలబల; మిది నేల పాలయ్యె;నిఁకఁగూలుఁబంక్తికంధరుండు. తలకొని నీ పెంపుఁదలఁపవు గాక! తలఁచి 1865చూచిన నీకుఁదరమె యెవ్వరును?” నని విభీషణుఁడాడినట్టి వాక్యములు విని యప్పు డా రామవిభుఁడాత్మ నలరె. |