| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
సారథి కనియె:“నీ చతురత మెఱసి తేరు రాఘవులపైఁదీవ్రతఁబఱపు; వారిఁజంపెద నేఁడు; వా రాజిఁబడిన దారేఁగుదురు విచ్చి తరుచరుల్ సెదరి.” యన విని వాఁడట్ల యరదంబుఁబఱప ఘననేమిరవము లుత్కటముగాఁజెలఁగ సాయకాసనఘన జ్యా నినాదంబు మ్రోయంగ నిస్సాణములు బోరుకలఁగ వందిమాగధసూతవరనుతుల్ మించ నందంద నిజసేన1935నార్పు లుప్పొంగఁ దరుచరసేనపై దారుణాస్త్రంబు లరుదార నిగుడించె నద్దశాననుఁడు. అజనిర్మితంబు లౌ నా బాణతతుల భుజబలంబులు దూలి భూరేణు వెసగ నేలఁగూలిరి పెల్లు నిఖిలవానరులు. నా లోన రఘురాముఁడనుజుండుఁదాను గోదండపాణులై కోపించి నిలిచి. రా దశాననుఁడును నలుక మార్కొనఁగ నుడువీథి1936 యవియంగ నుదధులు గలఁగఁ గడుఁబేర్చి దిక్కుంభికర్ణముల్ వగుల నడరురాముని ధనుర్జ్యాఘోషమునకుఁ గడుమానసంబులు గలఁగి రాక్షసులుఁ, గుపిత దశగ్రీవకోదండ ముక్త తపనోగ్రసాయక ధ్వనికి వానరులు భయమంది ధరణిపైఁ బడిరి యుక్కణఁగి. రయమార నాలోన రామలక్ష్మణులు రవి సుధాంశుల భంగి రాగిల్లి కదియ దివిజారి రాహుప్రదీప్తుఁడై 1937కవిసె. నంత నా లక్ష్మణుండతితీవ్ర విశిఖ సంతతులేసె దశగ్రీవు మీఁద. నడుమనె తెగ నేసె నా కీశవైరి కడిఁదిబాణముల. నుత్కటముగా మఱియు నొక్కొక్క శర మేయ1938నుగ్రుఁడైవాని నొక్కొక్క శరమున నొగిఁద్రుంచి వైచి, మూఁడేసి శరము లిమ్ముల వడి నేయ మూఁడు మూఁడమ్ముల మురియలు సేసి, పదియమ్ము లేసినఁబదియింట వానిఁ జిదురుపలై ధరఁజెదరిపో నేసి, నూఱేసి యేసిన నూతన గతుల నూఱు1939నూఱమ్ముల నుగ్గు గావించి, సౌమిత్రి నటు రణస్థలిఁజిక్కుపఱచి రామచంద్రునితోడ రణము సేయుటకు దనుజాధినాథుఁడుద్ధతి నేఁగుదేరఁ గనుఁగొని సమవర్తిఁగని పాఱుకరణిఁ గనుకని బెదరి మర్కటు1940లనిఁబాఱఁ గని కన్నుఁగవఁగెంపు గదుర రాఘవుఁడు విల్లంది దివిజులు1941వినుతింప ధరణి దల్లడపడఁదాఁకె దానవేశ్వరుని; ముఖములఁగోపంబు ముడివడ నతఁడు నఖిలలోకాతిభయంకరంబుగను రామునిఁదాఁకె. నా రామరావణులు భీమాట్టహాసముల్ బెరయించి మించి సైన్యద్వయంబున సరి నార్పు లెసగ నన్యోన్యకార్ముకజ్యానినాదములు పరువడి దశదిశాభాగంబులందు మొరయఁబరస్పరముక్తబాణ1942ములఁ బరగంగ నాకాశపథమెల్లఁగప్పి గురుతరఘోషముల్ ఘూర్ణిల్లఁజేయ నొండొంటితోఁదాఁకు నుగ్రబాణముల మండుమంటలు నభోమండలి నిండ సరినొప్పు నిరువుర శరలాఘవముల కరలాఘవంబుల1943కరణి నొండొరుల మెచ్చుచు నొండొరు1944మీరు వైచిత్రి కచ్చెరు వందుచు నని సేయునపుడు క్షోణీశుపై నొక్క ఘోర తమిస్ర బాణంబు నిగుడించెఁబంక్తికంధరుఁడు. ఆ కాండ మడరిన నఖిలవానరులుఁ జీకటి గప్పి నిశ్చేష్టితు లైరి. అప్పుడు కన్నుల నలుక కెంజాయ లొప్పార రఘురాముఁ1945డుగ్రబాణములు పదిపదు లేసినఁబటుభల్ల సమితిఁ ద్రిదశారి వానినిఁదెగనేసి మఱియు నిశితబాణము లేయ నృపుఁ డర్థచంద్ర విశిఖంబు లడరించి వేగంబె త్రుంచి యసురేశు నిఖిలావయవములుఁదూర నసదృశంబుగ ననేకాస్త్రముల్ వఱపె. రౌద్రబాణం బంత రావణుండేయ రౌద్రబాణంబున రఘురాముఁడేసె. నవి రెండు నన్యోన్యహతములై పడఁగ నవనీశ దనుజేశు లాలోనఁగినుకఁ దివిరి యొండొరు లేయుతీవ్రబాణములు దివి నిండఁగప్పినఁదిమిరంబు గప్పె. రణములో నప్పుడు రయమున మ్రోయు గుణరావములచేత ఘూర్ణిల్లుచున్న యురుచాపసాగర యుగమున నెగయు శరవీచు లొగిఁబరస్పర ఘట్టనముల 1946బెరయ, దైతేయుఁడాభీలకోపమున నరనాథు నుర మేసె నారాచసమితి; నది యొప్పె నీలోత్పలావళికరణిఁ. గదిసి రాముఁడు చండకాండముల్ దొడిగి కవచంబు సించి వక్షముఁగాఁడ నేయ దివిజారి1947యప్పుడెంతే1948నియు నొచ్చి యహిశిలీముఖముల నడరింప 1949ఁదోన యహిమాంశుకులనాథుఁడవి ద్రెవ్వ నేసె. నా సమయంబున నమరేంద్రవైరి యా సురసాయకంబడరింపఁబెక్కు ముఖముల శార్దూలముఖములు నుష్ట్ర ముఖములు సూకరముఖములు నురగ ముఖములు ఘన దంతిముఖములు గృధ్ర ముఖములుఁగరవైరి ముఖములుఁదనరు ఘనశిలీముఖము1950లు కడుఁబెక్కు నిగుడఁ గని వానిఁదునియలుగా నేసి మఱియు జననాథుఁ డాగ్నేయసాయకంబేయఁ గనుఁగొన1951నందు నుల్కాముఖాస్త్రములు మహితవిద్యున్ముఖమార్గణంబులును గ్రహముఖంబులు గల్గుఘనసాయకములు మిహిరముఖంబులు మెఱయుబాణములు దహనముఖంబులు దనరుశస్త్రములు నగుచు నచ్చెరువుగా నడరంగ వానిఁ దెగ నేసి యపుడు దైతేయవల్లభుఁడు మయునిచేఁబడసిన మాయాశరంబు రయమున సంధించి రాముపై నేసె.[వా.రా. సర్గ 101] నేసిన దాన ననేకంబు లగుచుఁ బ్రాస తోమర గదా పరిఘంబు లడరె. గాంధర్వశరమంత ఘనకార్ముకమున సంధించి నిగుడించె జనలోకవిభుఁడు. నాదిత్యతులితంబులైన చక్రంబు లా దివ్యబాణంబునందనేకములు జగములు భయమంద జనియించి రుచులు నిగుడి యాకసమెల్ల నిండఁబెల్లడరి యా మార్గణంబున నడరిన పరిఘ తోమరాదులనెల్లఁ దునియలు సేయ దశకంఠుఁడంత నా ధరణీశుమీఁద నిశితనారాచముల్ నిగుడించె నలుకఁ; బొరిఁబొరిఁ బుంఖానుపుంఖముల్ గాఁగఁ బరగించె నృపుఁడును బ్రతిసాయకములు. జగతీశ దనుజేశ శరపరంపరలు గగన1952భాగంబెల్లఁగప్పె. నా లోన నెడ సొచ్చి లక్ష్మణుండేడు బాణములఁ బడగయు వి ల్లొక్క పటుసాయకమున సారథిశిర మొక్కశరమునఁద్రుంచి యా రావణునివక్ష మైదింట నేసె. నీలధరాధరనిభతురంగములఁ గూలంగ1953నేసె మార్కొని విభీషణుఁడు. విరథుఁడై దైతేయవిభుఁడంతలోన ధరణికి లంఘించి తరుచరుల్ బెదర భ్రూకుటిదశకవిస్ఫురితాస్యుఁడగుచు భీకరశక్తి విభీషణు వైవ నడుమనె మూఁడుబాణంబుల దాని మిడుఁగురుల్ మంటలు మింటఁబెల్లెగయ ధరణిపైఁబడనేసెఁ దరుచరులార్వ ధరణీశుననుజుండు. దశకంఠుఁడంతఁ గడునల్గి మయునిచేఁగన్న యా శక్తి వడి విభీషణుమీఁద వైవ1954నంకింప “శరణాగతత్రాణసద్ధర్మపరులు శరణాగతులచావు సైఁతురే?”యనుచు దనుజేశుతమ్మునిఁదన వెన్కఁదిగిచి కొని రాముతమ్ముఁడు క్రూరబాణములు పరగింప నప్పుడు పంక్తికంధరుఁడు; “బిరుదవై వచ్చి విభీషణు వెన్క |