| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
రవినందనుఁడు క్రోధరక్తాక్షుఁడగుచు నవనిధరాభీలహస్తుఁడై నడవ; నంత విరూపాక్షుఁడధిక రోషమునఁ బంతంబు1916మెఱయంగఁబయిఁదేరువఱపి విలు1917గుణధ్వని సేసి విపులనిర్ఘాత తులితంబులగు వాఁడితూపుల నేయ నవి లెక్కసేయక యరదంబుపైకి రవిజుఁడు లఘించి రథ సూత హరులఁ బృథివీధరంబునఁబృథుశక్తితోడఁ బృథివిపైఁబడనేయఁబృథివికి నుఱికి విరథుఁ1918డయ్యును దైత్యవీరుండు వివిధ శరములేయుచుఁబాదచారియై నిలువ నమరారిపనుపున నఖిలాయుధములు సమకూర్చి 1919మావఁతుల్ సమదసామజముఁ దెచ్చిన వెస నెక్కి దీకొల్పి కపుల విచ్చలవిడి నేసి విక్రమంబెసగ నుగ్రదానవు లార్వ నుగ్రబాణముల నుగ్రాంశుతనయుపై నుగ్రత నేసె. నక్కజంబుగ విరూపాక్షుంండు మఱియుఁ బెక్కాయుధంబులఁబెక్కు బాణముల వసమఱ నేయంగ వసుధ గంపింప వెసఁబాఱుతనవారి వెఱవకుండనుచు నలుకతో సుగ్రీవుఁడతని నిర్జింపఁ దలపోయఁగ్రథనుఁడన్ తరుచరోత్తముడు విపులవిక్రమమున వృక్షంబు వెఱికి కుపితుఁడై 1920యేనుఁగుకుంభంబు వైవఁ దఱచుగా శోణితధారలు దొరుగఁ బిఱిఁదికి నొక వింటిపెట్టోసరించి యది మ్రొగ్గ; నేలకు నసురుండు దాటి కదురుచు ఖేటకఖడ్గముల్ గొనుచు మర్కటపతిఁదాఁక మార్కొని వాని నర్కసూనుఁడు వైచె నతులశైలమున; నక్కొండఁదెగ నేసె నడరి దానవుఁడు; రక్కసుఁబిడికిట రవిజుండు వొడిచె; నా లోనఁగరవాల మంకించి యసుర వాలి తమ్ముని నేసె వడి చెడ1921కపుడు; పిడికిటిపోటునఁ బెలుచ దానవుఁడు, నడిదంబువ్రేటున నర్కనందనుఁడు నొక్కటఁ బడి యంత నొక్కటఁ దెలిసి యొక్కలాగునఁబోరి రొగి నుక్కుమిగిలి. యప్పుడు సుగ్రీవుఁడఱచేత వ్రేయఁ దప్పించుకొని హేతి దనుజుండు వ్రేసెఁ. గరవాలనిహతి కగ్గతి దప్ప1922నుఱికి కరహేతి జడిసిపోఁగపిరాజు వ్రేసె. మగఁటిమి నంతలో మల్లయుద్ధమున మిగిలిన వెరవున మెఱసి పోరుచును, దినవల్లభులభంగిఁ దేజరిల్లుచును, గనలుకాలాగ్నులకరణి మండుచును, బలబిడౌజులమాడ్కి బాహుగర్వమున వెల1923యుచు నిరువురు విజయంబు గోర నక్కజంబగు శక్తి నఱచేత నినజు మొక్కలంబున వాఁడు మూర్ఛిల్ల నేసి కరవాలహస్తుఁడై కపులపైఁబాఱఁ దరణిజుఁడాలోనఁ దన మూర్ఛ దెలిసి పఱతెంచి నిర్ఘాతపాత1924ంబుఁ దెలుపు నఱచేత నా విరూపాక్షువక్షంబు నెఱలావుతో నేయ నెత్తురు గ్రక్కి యొఱలుచు ధరఁగూలె నుగ్రదానవుఁడు. తరుచరుల్ సెలఁగిరి; దానవుల్ గలఁగి తిరుగుడువడి రంత దీనాస్యులగుచు. స్రుక్కి యుద్ధోన్మత్తుఁజూచి రావణుఁడు తక్కనికడఁక యెంతయుఁదోపఁబలికెఁ: “గంటె, యా సుగ్రీవుకడిమి; మీ యన్నఁ గంటె విరూపాక్షుఁ; గదనరంగమునఁ బడి రనేకాసురభటులును; బెక్కు మడిసెఁగుంజరములు; మ్రగ్గె నశ్వములు; విఱిగె రథంబులు; 1925విరిసె మూఁకలును నుఱుకుచు కపులదె యుబ్బుచున్నారు; సమయంబు నీ కిది సమరంబు సేయ; సమరాంగణంబున సమయింపు రిపుల.” నన విని యనిఁగూలి యఖిలేశుఁడైన మనుజేశుఁగలయంగ మది నిశ్చయించి తరుచరానీకంబు దరియంగఁజొచ్చి శరగదాఖడ్గాదిసకలాయుధముల నడరి విరూపాక్షుననుజుండు కపులఁ గడిమిమై నొప్పింపఁ గని భానుసుతుఁడు నగ మెత్తి వైచిన నడుమనె దానిఁ దెగ నేసె దనుజుఁ; డా దినకరాత్మజుఁడు తనరు1926శైలము వైచె; దాని దానవుఁడు దునియలుగా మూఁడుతూపుల నేసి లక్షించి బాణజాలము లేయుచుండ రాక్షసు1927లదరంగ రథముపై కుఱికి భానుసూనుఁడు వాని పరిఘాయుధమున వాని కేతువు విల్లు వడిఁద్రుంచివైచి రథసూతుఁదెగ1928నేసి రథతురంగములఁ బృథివిపైఁబడనేయఁబృథుల వేగమునఁ బృథివికి లంఘించి పెలుచ దానవుఁడు పృథు గదాపాణియై పృథివిపై నిలువ నిరువురుఁ బోరాడి రిల చలియింపఁ బరిఘగదాభీలబాహువుల్ మెఱయఁ గంఠీరవంబులకరణి గర్జిలుచుఁ గంఠముల్ వదనముల్ కరము లంసములుఁ జరణముల్ 1929నఖములు జానుజంఘలును నురములు వెన్నులు నూరులు వ్రేళ్లు బరులుఁబిఱుఁదులు జబ్బలు మధ్యములును శిరములుఁజెవులు నాసికము లోష్ఠములు వరుసతో నప్పుడు వడిఁదాఁకి తాఁకి వెరవులు చిత్రముల్ వెసఁజెల్లుచుండ సరిగాఁగ నత్యంతసాహసలీల నిరువురుఁబోరి రనేకమార్గముల. నాలోనఁ బరిఘగదాభీలహతుల వ్రాలుదు రొక్కట; వ్రాలి యాలోనఁ గడిమిమై నొండొరుకంటె మున్ దెలిసి వడి నార్తు రెంతయు వసుధ గంపింప. దానవుఁడురుగదాదండంబు రెండు సేనలవారు నచ్చెరువందఁద్రిప్పి. భానుజుఁబడవైవఁబడిలేచి1930వచ్చి భానుసూనుఁడు వైచెఁబరిఘంబుఁద్రిప్పి. దనుజాంగనిహతిఁదత్పరిఘంబుఁదునియఁ, గనలుచు దనుజుండు కరవాలమునను వనచరపతి వైవ వడిఁదత్కృపాణ మినజుండు గొని దీప్తులెసగ నంకించి వికలమై ధరడొల్ల వ్రేసె దైతేయు మకరకుండలదీప్తిమయమస్తకంబుఁ. గనుఁగొని విఱిగి రాక్షసులు రావణుని వెనుకకై లంకకు వెసఁబాఱి రపుడు. బలగర్వ మెసగ సుపార్శ్వుఁడంగదుని బలుసేన1931పైఁగిట్టి పటుసాయకముల[వా.రా. సర్గ 99] వానరశిరములు వడిఁగూలనేసి తోన హస్తంబులు ద్రుం1932చెఁగొందఱను గొందఱబాహువుల్ ఘోరబాణముల నందంద తునుమాడె. నంత వానరులు నా నిశాచరునకు ననిఁబాఱఁజూచి వానితేరికి దాటి వాలినందనుఁడు పస యేరుపడ వాని పరిఘాయుధంబు వెసఁబుచ్చుకొని నేల వివశుఁడై తూల వడివ్రేసె; నట జాంబవంతుండు నొక్క వెడఁదపాషాణంబు వీఁకతో నెత్తి యరుదార నంకించి యరదంబు విఱుగ హరులు సూతుఁడుఁజావ నలుకతో వైచె. దనుజుఁడాలో1933ఁదేఱి దశసాయకములఁ గనలుచు నంగదుఘనభుజంబేసి యంబకత్రయమున నధికరోషమున జాంబవంతుని నేసి చలనంబు నొంద నేసె గవాక్షుని నిషుపంచకమున. నా సమయంబున నంగదుం డలిగి కరయుగంబునఁబరిఘముఁద్రిప్పి వైవ ధరణిపై మూర్ఛిల్లి దనుజుండు వడిన వాని చాపముఁద్రుంప వాఁడంతఁదెలిసి వానర వీరునివక్షంబు వగులఁ బరశువుఁగొని వ్రేయ బలుమూర్ఛనొంది సురరాజనందనసూనుండు దెలిసి వజ్రసన్నిభముష్టి వడిఁగిట్టి పొడువ వజ్రంబు తాఁకున వసుధాధరంబు వసుధఁగూలినభంగి వాఁడాజిఁగూల నెసగ దేవత లార్చి రేచి మిన్నద్రువ. నంత రాక్షసబలం బతిభీతిఁబాఱ నంతయుఁజూచి దశాననుం డనియెఁ:[వా.రా. సర్గ 100] “బరుషవిక్రముఁడు సుపార్శ్వుండు మడిసె; నురుబాహుబలుఁడు యుద్ధోన్మత్తుఁడీల్గె: ననిఁగూలె నా విరూపాక్షుండు;మఱియు ఘనులైన రాక్షసుల్ కడతేఱి; రింక, బలసమన్వితులైన పార్థివసుతుల బలువిడి గెలిచి నా బంధులవలన నెలకొన్న శోకాగ్ని నెరియు నీ లంకఁ గలవారి వగపెల్లఁగడఁకతోఁదీర్తు. నవిరళక్షత్త్రధర్మైకమూలంబు, నవ1934జయోన్నతలక్ష్మణప్రకాండంబుఁ, భానునందనముఖప్లవగ శాఖంబు, మానవపతి కీర్తి మంజరీకంబుఁ, బ్రకటసీతానామఫల భాసురంబు, సకలామరాశ్రితచ్ఛాయంబు నైన రామద్రుమంబేను రయమునఁబెఱికి నా మనోదుఃఖంబునకు మందు సేసి యెసగెద జగములో నే.”నంచు నప్పు డసురేశుఁడధిక రోషాయత్తుఁడగుచు |