| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత జర్జరితాంగుఁడై రామువిశిఖ సంతానవేగంబు సైరింపలేక, గజవైరిఁగని పాఱుగజముచందమున రజనీచరేంద్రుండు రణభూమి విడిచి కచభారములు వీడఁ, గమనీయరత్న ఖచితభూషణములు గనుకని1970ఁజెదరఁ, (జేరి యొండొరువులఁజేతులు సఱచి బోరన నవ్వుచు భూతంబు లార్వ,) ఘనపాదహతి నేల కంపింపఁబాఱి వనచరు లార్వంగ వడి లంకఁజొచ్చి కొలువుకూటంబునఁగూర్చుండి బుద్ధిఁ దలపోసి తనకు ముందర విభీషణుఁడు చెప్పిన బుద్ధులు చిత్తంబులోన నప్పుడు తలఁచుచు నా రాముఁడేయు నేటులు దలఁచుచు నెల్లందు సుభట కోటులు గొనియాడఁగుంభకర్ణుండు, నతికాయుఁడును ఘనుఁడా యింద్రజిత్తు మృతులౌట దలపోసి మిగులఁజిత్తమునఁ గవిసినశోకాంధకారంబువలన నవశభావముఁబొంది యా లోనఁదెలిసి యంతఃపురంబున కంత నేతెంచి యంతరంగమునఁజింతాక్రాంతుఁడగుచు దన సతి రావించి తలవాంచి పలికె: “విను రాముజగదేక విక్రమక్రమము; నేమని చెప్పుదు? నిదె నాకు నెదుర రామసహస్రముల్ రమణి! తోచెడిని. ఎక్కడఁజూచిన నీ లంకలోన నక్కడ రఘురాముఁడై యున్నవాఁడు. ఇంక జయోపాయ మెద్దియు లేదు. శంకరుచరణముల్ శరణంబు నాకుఁ. ద్రిపురంబు లే దేవు దివ్యోగ్రబాణ విపులాగ్ని నీఱయ్యె విస్మయం బెసగ; నిందుఖండంబున నే దేవు మకుట మందమై విలసిల్లు నభినవస్ఫురణఁ; దనర నే దేవు హస్తములఁబినాక సునిశిత ఖడ్గ త్రిశూలముల్ మెఱయు; నే దేవుఁ డఖిలలోకేశుఁ; డే దేవుఁ డా దక్షు మర్దించి యాగంబు సెఱిచె; నలుకతో నే దేవుఁ డంధకాసురునిఁ బొలియించె; నే దేవుఁబొగడు వేదములుఁ: దెలియ నే దేవుండు దేవాదిదేవుఁ; డెలమి నా దేవుని నే భజియింతు.” నని కృతస్నానుఁడై యగ్రజన్ములకుఁ దనియంగ బహువిధదానంబు లొసగి మదిలోన మద1971దర్పమానముల్ విడిచి పదిలుఁడై సాత్త్వికభావంబుఁబూని రక్తాంబరంబులు రక్తమాల్యములు రక్తోపవీతముల్ రక్తగంధంబు రక్తాక్షసూత్రముల్ రాజిల్లఁబరమ భక్తితో మంత్రజపంబు సేయుచును నీశ్వరాలయమున కేతెంచి రాక్ష సేశ్వరుం డచలితహృదయుఁడై యచటఁ దగ వేదిఁ గావించి దర్భాంకురంబు లొగిఁజేర్చి తనకుఁగా నుగ్రదానవుల “నన్నిదిక్కుల నుండుఁ’డని పంచి వేల్వ నున్నంత నెఱిఁగి మందోదరి వచ్చి కనుఁగొని:“యో పంక్తికంధర! నీకుఁ జనునె? దీనునిభంగి శౌర్యంబు విడువ? నుఱక నీ వలిగిన నుదధులు మ్రోయ వెఱతు; సమీ1972రంబు వీవంగ వెఱచు; ననలుండు తీవ్రార్చు లడరింప వెఱచు; వినువీథి నర్కుండు వెలుఁగంగ వెఱచు; జగములు నీవన్నఁజలియించు; నేల మగఁటిమి సెడి1973యిట్టిమతముఁగైకొంటి? నేఁడింతధైర్యంబు నీకు లేకున్న నాఁడేల తెచ్చితి నరనాథుదేవి? మారీచుమాటలు మదిలోన1974నాఁడు నేరముల్‌గాఁగొంటి; నీతి గావంటి. నీతి విచారించి నీచేటు సైఁప కాతత ధర్మాత్ముఁడగు విభీషణుఁడు తొడరి పల్మాఱును:“దోషాచరేంద్ర! చెడుత్రోవ లేటికి? సీత నీ పైని విడుచుట గడుమేలు విడు.”మంచు నీకు విడువక చెప్పఁడే వినవైతిగాక. మాతామహుండైన మాల్యవంతుండు నీతి1975గాఁజెప్పిన నీవు గైకొంటె! తప్పక మీతల్లి తగ1976వు సింతించి చెప్పినమాటలు సెవి యొగ్గి వింటె! “జననాథుతో నేల శాత్రవం?”బనినఁ గనలవే1977మఱి కుంభకర్ణుమాటలకు. వల దని1978చెప్పిన వారి వాక్యములు తలకూడెనే నేఁడు దనుజలోకేశ! భుజవిక్రమంబెల్లఁ1979బోవంగ విడిచి నిజముగా మునివృత్తి 1980నీవుగై1981కొంటి! వింద్రుండె యనినోడ నెఱుఁగవు రామ చంద్రు గెల్వకయున్న జనులెల్ల నగరె? యనిచేసి గెలుతుగా కసురేశ! నీకు ననదచందములేల?”యని 1982తూలఁబలుక నెలకొన్న సిగ్గున నిట్టూర్పు వుచ్చి: “నెలఁత! నీ మాటలు నిజమగు; నైన రామచంద్రుని కింక రమణి! నే వెఱవ. హోమంబుఁగావించి యుద్ధ1983రంగమున జననాథ1984సుతులను జంపెద; నీవు చను.”మన్న మ్రొక్కి బాష్పంబు లందంద తొరుగ మందోదరి దుఃఖించి లోని కరుగుచో నాడిన1985యార్తవాక్యములు విని సిగ్గుపడి వేల్మి విడిచి రావణుఁడు చనియె1986సెజ్జకు. నంత జననాథుఁడిచట |