ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
లక్ష్మణు మూర్ఛకు రాముఁడు శోకించుట
నొడలు నెత్తుటఁదోఁగి యూర్పులుసడలి
పడియున్న శేషాహిపతిఁబోలియున్న[వా.రా. సర్గ 102]
యనుఁగుఁదమ్మునిఁజూచి యాలోన ధృతికి
జొనుపనిమతితోడ శోకింపఁదొడఁగె:
“నిబ్భంగి సౌమిత్రి యిలమీఁద నుండ
నెబ్భంగిఁబ్రాణంబు లేను నిల్పుదును?
లలి రణంబొనరింప లావెట్లు కలుగు?
బలుముష్టి విల్లెట్లు పట్టంగవచ్చు?
గన్నుల బాష్పముల్‌ గ్రమ్మంగ నెట్లు
పన్ని పైఁబఱతెంచు పరిపంథిఁజూతు?
నా కన్నులెదుటను నా సహోదరుఁడు
నా కూర్మిబంధుండు నా ప్రాణసఖుఁడు
నాకుఁబ్రాణము లిచ్చి నను డించిపోయె
నాకు సిగ్గయ్యెడి నా శౌర్యమునకు!
నాకేల రణ? మింక నాకేల జయము?
నాకేల రాజ్యంబు? నాకేల సీత?
నాకేల శౌర్యంబు? నాకేల బ్రదుకు?
నాకు నీ తోడిద1987నాకంబు గాక.
జయశాలివై మున్ను శరభశార్దూల
భయదాటవులలోనఁబాటించి తెచ్చి
యరు1988దైన తుచ్ఛదైత్యాటవిలోనఁ
బరునికైవడిఁగాడుపఱచితే నన్ను?
నున్నతోన్నత1989శక్తి నోరంతప్రొద్దు
నన్నుఁగాచుటకుఁగాననభూములందు
నిద్రపో వెన్నఁడు; నేఁడిట్లు దీర్ఘ
నిద్ర1990పోవుట నీకు నీతియే తండ్రి?
పలుమాఱు నిబ్భంగిఁబనువుచుఁ బిలువ
నెలుఁగెత్తి ‘యో’యన వేమి లక్ష్మణుఁడ!
యింక నెవ్వరుగల? రే నెందుఁజొత్తు?
నింకఁబాలైతిఁగా యీ శోకవహ్ని?
శుభలక్షణోపేత సురుచిరాకారుఁ
డభిరామబలుఁడు నా కతిభక్తిపరుఁడు
ప్రియసహోదరుఁడు గంభీరుండు సమర
జయశాలి నా ప్రాణసఖుఁడు లక్ష్మణుఁడు
ఇతఁడు నాతోఁగాన కేతెంచె; నిప్పు
డితనితో నేఁగెద నే నింద్రుపురికిఁ!
గల1991రెందు బంధులు; గలరెందు నింతు;
లిల నిట్టిసోదరులెక్కడ గలరు?
యత్నంబుసేసిన నవనిజఁబోలు
పత్ని నొండొకచోటఁబడయ1992ంగ వచ్చు.
నిట్టి సద్గుణశీలుఁడిట్టి దయాళుఁ
డిట్టి 1993మహాబలుండిఁక నెందుఁగలఁడు?
తమ్ముఁడన్మాత్రమే తల1994పోసి చూడ!
నిమ్ముల ననుఁగొల్చు నిమ్మహాభుజుఁడు
ఇతఁడె నా పౌరుషం;బితఁడె నా శాంత
మితఁడె నా కీర్తియు; నితఁడె నా స్ఫూర్తి;
యితఁడె నా శౌర్యంబు; నితఁడె నా ధైర్య
మితఁడె నా నయమును; నితఁడె నా జయము;
భావింప నా పాలిభాగ్యంబు నితఁడె;
1995పావనంబగు రాజ్యపదవియు నితఁడె.’
యని పెక్కుభంగుల నడలుచు నుండ
విని సుషేణుఁడు రామవిభుఁజూచి పలికె:
“నిది యేమి దేవ!నీ1996కింత శోకింప!
హృదయంబుఁ1997గుందింపకిదె చూడు మితని;
నొడలఁబ్రాణములు లేకున్న నాననము
కడు నొప్పియుండునే కళలుదేరుచును?
గన్ను లిందీవరకమనీయ కాంతిఁ
జెన్నొందియుండునే చెలువంబు మిగిలి?
యందంబులైయున్న వఱచేతు లెలమిఁ
గెందామరలభంగిఁగెంజాయ మెఱసి?”
యని పల్కి రఘురామునడలు వారించి
హనుమంతుఁగనుఁగొని యతనితో ననియె:
“మును జాంబవంతుండు ముదముతోఁజెప్ప
వినినాఁడ వౌషధవిధమెల్లఁదెలియఁ.
బొలుచుమహాద్రోణభూధరంబునను
జెలువొందు దక్షిణశిఖరంబునందుఁ
బరికింప దీప్తులఁబరగువిశల్య
కరణియు, సౌవర్ణకరణియు, మఱియు
సంధానకరణియు, సంజీవకరణి
బంధురతరశుభప్రభ నొప్పుచుండు.
నాలుగౌషధములు నలిఁదెమ్ము వేగ;
మీ లక్ష్మణునిప్రాణ మెత్తంగ వలయు.
బంబి దేవాసురుల్‌ బలువిడి తొల్లి
యంబుధి మథియించి యమృతంబు వడసి
యందు దాఁచుటఁజేసి యమృతంబు వలన
నందు జనించె నా యౌషధ లతలు
లవణసముద్రంబు లంఘించి పోయి
యవలఁగుశద్వీప మవలీలఁగడచి
వడి నేఁగి దుగ్ధార్ణవము నాక్రమించి
తడయక పోయి; చంద్రద్రోణగిరులఁ
కందు దేవేంద్రునియనుమతంబునను
మందరంబును బోలుమహనీయతనులు
గంధర్వులొగి వానిఁగాచియుండుదురు
గంధర్వులకు నీకుఁగలుగుఁగయ్యంబు;
తెరువున రాక్షసుల్‌ దిరుగుచుండుదురు;
వరుస మాయావులు వారి నేమఱకు;
ద్రోణాద్రి1998కవలీలతో1999నేఁగి యితని
ప్రాణ మెత్తుము రఘుపతి సంతసింప.
నిరుమూఁడులక్షలు నిరువదివేలుఁ
బరికింప2000నిన్నూటపదియోజనములు
వాయునందన! నీవు వాయు వేగమునఁ
బోయి రమ్మిట ప్రొద్దుపొడువకమున్నె.
భానుండు వొడిచినఁబ్రభఁదూలి2001శక్తి
హీనంబులై పోవు నీ యౌషధమ్ము.
లటమీఁద లక్ష్మణునాయు2002వెత్తుటకు
ఘటియిల్లనేరదు; గాన యా లోన
వానరోత్తమ! నీవు వడిఁబోయిరమ్ము.
వాని లక్షణములు వలయు నీ కెఱుఁగ;
హరితఫలంబులు నరుణపుష్పములు
నరుదారఁదెల్లనియాకులు నమరు.
జననాథసుతు విభీషణు జాంబవంతు
నినసూను నంగదు నెలమి వీడ్కొనుము.’
అని సుషేణుఁడువల్క “నౌఁగాక!”యనిన
యనిల నందనుఁజూచి యవనీశుఁడనియె:
“బడియున్న లక్ష్మణు ప్రాణంబు లెత్తి
పడయుము త్రిభువన ప్రఖ్యాతకీర్తి.
ననుజులు మును మువ్వు రరయ నా;కిప్పు
డనిలనందన! నల్వు రైరి నీతోడ.”

  1. ↑లోక
  2. ↑దుగా దుష్ట
  3. ↑బుద్ధి
  4. ↑గైకొంటె నిర్ణిద్రవిక్రముఁడ
  5. ↑రింతు లెందును గలరు బాంధవులు-నిల
  6. ↑ఁజొప్పడును
  7. ↑బాహా
  8. ↑పోయభక్తి
  9. ↑కావున నితనిఁ నేగతిఁ బాసి నిలుతు -నని…
  10. ↑విట్లడలు దువె?
  11. ↑బరికించి యిదె, గదియింపు మిదె
  12. ↑నవ
  13. ↑ఁదెచ్చి
  14. ↑మఱియును బ, నార్నూట, నన్నూట
  15. ↑సత్త్వ
  16. ↑వు వడయ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )