ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
కాలనేమి కథ
వేవులవార లా విధమెల్లఁ జెప్పఁ
గా విని విఘ్నంబు2003గావించుకొఱకు
నొంటిమై రావణుండొగిఁ గాలనేమి
యింటికి నడురేయి యేఁగుదెంచుటయు
భక్తితోడుత నర్ఘ్యపాద్యాదు లిచ్చి
నక్తంచరేశ్వరునకు నాతఁడనియె:
“నీ మధ్యరాత్రి నీ విటకు విచ్చేయు
టేమి కారణము? నా కెఱిఁగింపు.”మనిన
“నని నేఁడు నా శక్తిహతి మృతుండయిన
యనుజునికై రాముఁడటు తన్నుఁబనుప
సంజీవకరణిచే సౌమిత్రిఁబడయ
నంజనాసుతుఁడిప్పు డరుగుచున్నాఁడు.
చని వేగ హనుమంతుఁజంపు; కాదేని
విను భానుఁగనుదాఁక విఘ్నంబుసేయు.
కలదు దేవాసుర కల్పితంబైన
నలినాకరము ద్రోణనగసమీపమున;
మదముతో నొక మహామకరి యందుండు;
నది దేవతల మ్రింగు; నగచరుండెంత?
యా సరోవరమున కనిలజుండరుగ
మోసపుచ్చుము; వేగముగ నేఁగు.”మనిన
మనమున నట నీతిమార్గంబు దెలియ
దనుజేశుతో నాడెఁదగఁగాలనేమి:
“మాయామృగాకృతి మారీచుఁడరిగి
మాయమై పోఁడె; యా మతము పోవిడువు.
ఘోరాజిఁగూలిరి కుంభకర్ణాది
వీరదానవులెల్ల; విను మింకనైన.
మనుజేశునకు సీత మరలంగ నిచ్చి
దనుజేశ! లంక నీ తమ్మున కిచ్చి
యరిగి2004 మృడావాసమైన కైలాస
ధరణీధరమునందుఁదపసివై యుండు.
కాదేని బిరుదవై కదనరంగమున
మేదినీపతిచేత మృతిఁబొంది మీఁద
నొనరంగ విష్ణుసాయుజ్యంబు నొందు.”
మని పల్కఁగన్నుల నలుకఁగెంపెసగ
నా యెడ వెసఁజంద్రహాసంబు వెఱికి
వ్రేయఁదలం2005చె: నా విధమాతఁడెఱిఁగి
“యిదె చనుచున్నాఁడనే.”నంచు నచటు
గదలి మనోవేగగతి లావు మెఱసి
చని చూత పున్నాగ చంపక క్రముక
పనస చందన జంబు పాటలీ వకుళ
కదళికా ఖర్జూర కర్పూరతరులు
మొదలుగాఁగల భూజముల సొంపు మిగిలి
బహుశిష్యగణవేదపఠనముల్‌ సెలఁగ,
మహనీయమణిదీపమాలికల్‌ 2006వెలుఁగ,
భాసురమంజరీఫల హోమధూమ
ధూసరీకృత లతాదుల నొప్పు మిగిలి,
కలకంఠ శుక 2007నీలకంఠ శారికల
కలహంసకల2008 రవ కలకలంబెసగ,
హుతదానమంత్రస్వరోదీర్ణమైన
కృతకాశ్రమము ద్రోణగిరిసమీపమున
నిర్మించి మునివోలె నియతితోఁగపట
నిర్మలాకృతిఁదాల్చి నేత్రముల్‌ మొగిచి
సన్నంపుటెలుఁగున జపమాల పూస
లెన్నుట మంత్రమై యెదిటికిఁదోప
నా వనంబున నుండ నాకాశవీథిఁ
బోవుచో మారుతపుత్త్రుఁ డీక్షించి:
“యిది యొక్కముని వనంబింత యొప్పగునె?
యిది నాఁడు లే; దిప్పుడెందువచ్చితినొ?
యెక్కడి దుగ్ధాబ్ధి; యెక్కడి మేరు?
వెక్కడి మునివనంబిది; త్రోవ దప్పెఁ.
దెరు విమ్మునీంద్రుచేఁదెలియంగ నడిగి
యరిగెదఁగా;”కంచు నవని2009కేతెంచి
వనపక్వఫలములు వాంఛఁబుట్టింప
మునిశాపభయమున ముట్ట నోడుచును
మునిఁజేరఁజనుదెంచి మ్రొక్కి కేల్మొగిచి:
“మునినాథ! దుగ్ధసముద్రంబుకడకు
మనుజనాయకశిఖామణి యైన రామ
జననాథుపనుపునఁ జనుచున్నవాఁడ;
హనుమంతుఁడనువాఁడ; నధికమౌతృష్ణ
జనియించె; నిచ్చోట జలములు గలవె?
చెప్పవే.”యనవుడుఁజిఱునవ్వు నవ్వి:
“డప్పి వో మా కమండలువుతోయములు
ద్రావు; మీ ఫలములు ద2010నియంగ నమలు;
నీ వింక నీ రాత్రి నిద్రింపు మిచట.
నగచరోత్తమ! యతీతానాగతంబు
లగు మేర లెఱుఁగుదు నంతరంగమున;
రాము వంచించి యా రామునిదేవి
భూమిజఁజెఱగొని పోవ రావణుఁడు
అవనీశుఁ2011డును వాలి నవలీలఁజంపి
లవణాంబునిధిఁగట్టి లంకపై విడిసి
యనిలోనఁగుంభకర్ణాదిరాక్షసులఁ
దునుమాడి యింద్రజిత్తును ద్రుం2012చి వైవఁ
బుత్త్రశోకంబునఁ 2013బుట్టినయలుక
రాత్రించరేశుండు రణభూమిలోన
మయునిచేఁ బడసిన మహనీయశక్తి
రయమునఁగొని సుమిత్రాపుత్త్రు వైవఁ
బడిన యా సౌమిత్రిప్రాణముల్‌ వడయ
వడి నౌషధములకు వచ్చితి వీవు.
విను2014ము నీ విప్పుడు వేయోజనంబు
లనిలనందన! వచ్చిత 2015నిల వేగమున.
నన్ను నధర్మాత్మునకుఁగానరాదు;
నిన్ను నుత్తమునిఁగా నిశ్చయించితిని.
జగదేకహితముగా జనియించెఁగాన
జగతీశుపని మీకు సమకూర్పవలయు.
దివ్యౌషధంబులు దీపించునట్టి
దివ్యమంత్రము లుపదేశింతు నీకుఁ;
గంజాప్తు నుదయంబుఁగని శక్తి మిగు2016ల
సంజీవనీ ముఖ్య సకలౌషధములు
కలవు మా వనమునఁ; గనుఁగొని యందు
వలసినయవి గొంచు వడి లంక కరుగు.
కనురెప్పవెట్టెడుకంటె వేగమునఁ
జనియెదు నా మంత్రసామర్థ్యమునను.”
ననవుడుఁ గపటసంయమిఁ జూచి పవన
తనయుండు వల్కె:“నో తాపసాధీశ!
యక్కడ లక్ష్మణుండబ్భంగి నుండ
నిక్కడ నుచితమే యిటు నాకు నిలువ?
ఫలములు నా కేల పతి2017పంపుకార్య
ఫలముగా సౌమిత్రిఁబడయకమున్న?
నిద్రవోవుట నాకు నీతియే? దీర్ఘ
నిద్ర గైకొని రామనృపుతమ్ముడుండ?
జలము లల్పంబులు సాలవు; లేదె
నలినాకరంబైన నదియైన;”ననుడు
“నున్నది చేరువ నొక దివ్యసరసి;
కన్నులు మూసి యా కమలాకరమున
నమృతోపమానంబులగు నిర్మలోద
కములు ద్రావిన దివ్యకాయుండ వౌదు.
దృగ్గోచరములగు దివ్యౌషధములు;
దిగ్గనఁజను.”మంచుఁదెరువు సూపుటకుఁ
గపటసంయమి శిష్యగణముఁబంచుటయుఁ
గపివీరుఁడేతెంచి కనియె నక్కొలను.
మాకంద మందార మాధవీ వకుళ
శాకోట కుటజకుచందనసాల
నీపార్జునాశోక నింబ కదంబ
తాపింఛ తరులసత్తటములదానిఁ,
గమనీయ కోమల కమల కల్హార
విమలకైరవముల విలసిల్లుదాని,
లలితకల్లోల డోలాకేళి2018ఁదేలు
కలనాద కలహంస గతులొప్పుదానిఁ,
బటుహంస2019చంచుచుంబక2020బక క్రౌంచ
పటల కారండవ ప్రతతులదాని,
వెనుకొని తముఁబిల్చి విరహులమీఁద
బనిచిన గెల్చి నిర్భరవృత్తి గొన్న
విపులాభిమానార్థవితతు లీకున్నఁ
గుపితుఁడై రతిరాజు కొఱ్ఱులఁబెట్టె
ననఁ బక్వబంధంబులై వాఁడి మిగిలి
మొనసిన కైరవ ముకుళాగ్ర శిఖల
మూగి చలింపని మొకరితుమ్మెదల
బాగొప్ప నొప్పుల బలసినదాని,
మఱికొన్ని యెడలను మకరందములకుఁ
దెఱపి సూపక తమ్ముఁ ద్రిప్పుచునున్న
కమలగేహాంతరకమలకుఁబ్రీతి
సమరీతి మంగళాచారగీతములు
నలిఁబాడుగాయక 2021నాయకు లనఁగ
మెలపున నందంద మృదురీతి మ్రోయు
మధుపానరసమత్త మధుకర2022తతుల
బధి2023రాబ్జపుట సమీపము లొప్పుదానిఁ,
గాము నుగ్రాక్షుచేఁగ్రమ్మఱఁబడయఁ
గామించి 2024తీరమాకందబృందములు
నలరు నగ్నులలోన నాజ్యహోమములు
చెలువంద నందంద చేయు చందమునఁ
జిలుకలు చంచులఁజించినఁ దొరుగు
ఫలరసధారలు పర్ణాగ్రవీథిఁ
దొలఁగక యురిలి చెందొవలలోఁదొరుగు
పొలు పెంతయునుజూడఁబొసఁగెడుదాని,
ఫలరసంబులు వచ్చి పైపయిఁదొరుగ
నొలసి చెందొవలలో నుండరాకున్నఁ
దొలఁగునుజ్జ్వలహోమధూమంబు లనఁగ
నలు లాకసంబున 2025నమరెడుదాని
నా కంజపత్రంబులను పళ్లెరముల
శీకరాక్షతములు సెలువొంద నునిచి
కొల నప్పుడుత్ఫుల్ల కువలయవలయ
దళవిలోచనములఁదనరాక కెదురు
చూచు తెఱంగున శోభిల్లుదానిఁ,
జూచి డగ్గఱ వచ్చి సుఖకేలిఁదేలి
యడరుసమ్మదమున నానందమంది
కడువిస్మయము నొంది కన్నులు మూసి
యక్కొలనికి డిగ్గి హనుమంతుఁడంత
నెక్కొన్నతృష్ణతో నీరు గ్రోలంగఁ

  1. ↑ఁజేయఁదలఁచి -యొ
  2. ↑నిరాతంకమైన
  3. ↑చిన
  4. ↑మెఱయ
  5. ↑శారికాచంచరీక
  6. ↑నాద
  7. ↑కి డిగ్గి
  8. ↑డయక
  9. ↑డొక కోల నా వాలిఁ
  10. ↑చెనపుడు - పు
  11. ↑బొదివిన
  12. ↑మిప్పు డిరువదివేల యోజనము, మూడు లక్షలు వేయోజనంబు
  13. ↑ధిక
  14. ↑లు
  15. ↑పంచుకోర్కి
  16. ↑లోల
  17. ↑వేష
  18. ↑పిక
  19. ↑నాదంబు
  20. ↑రుతుల
  21. ↑రదిక్తట
  22. ↑రతియు
  23. ↑నలరెడు , నాడెడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )