| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
బొలుపార సంసారభూరివారాశి 2026మలయుచు వర్తించు మాయావధూటి విషయరసంబులు వేడ్కతోఁగ్రోలు తృషితునిఁగబళించు తెఱఁగు దీపింప నురువడి నందుండి యొక మహామకరి హరినాథుపాదంబు లలమి పట్టుటయుఁ దగిలిన యంఘ్రులుద్ధతశక్తిఁదిగిచి తిగువఁజాలక చాలధీరుఁడై నిలిచి యిది2027యెట్టిదో యని యేర్పడఁజూచి మది వాయుసూనుండు మకరిగా నెఱిఁగి యంత2028కంతకు మది నలుక రెట్టింప నంతలో నతినిష్ఠురాకారుఁడగుచు వేవేగ రఘురామవిజయవల్లరుల కావాలమై వాలు నా వాల మెత్తి రాగరసోద్రేక రావణయోగ భోగసంచితపాపములు డుల్చుపగిది వాలమంకించి దుర్వారుఁడై విజయ లోలుఁడై మకరిపం2029డ్లును డుల్ల నేసె. సంతతముని 2030వరశాపరోగమున కంత మీ యౌషధ మని మ్రింగుకరణి నఱిముఱి మకరి మహారోష మెత్తి మెఱసి యా హనుమంతు మ్రింగఁ 2031జొచ్చుటయు, “నక్కటా! రాము కార్యము 2032చిక్కువడియె నిక్కడ దీనిచే నిట్టి చందమునఁ దెగిపోదునో? యింకఁదెఱఁగేది?”యనుచుఁ దగ విచారించి యుద్ధతి వాయుసుతుఁడు “కడుపులోపలఁజొచ్చి కడతేర్తు.”ననుచు నొడిసి మ్రింగుచునున్న నూరక యుండి పదిలుఁడై యంధకూపముఁబోనిమకరి యుదరంబుఁజొచ్చె నా యురుబాహుబలుఁడు అంత నా మకరియు నాహారబుద్ధి సంతోషమునఁబోయె జలమధ్యమునకు. నా వీరవరుఁడంత నలుకతో దాని ప్రేవులు నరములు పెనఁచి త్రెంచుచును నడరినకడఁకతో నమ్మహామకరి కడుపులోపల విషకబళంబువోలె నఱుగక తిరుగుచు ననలంబు భంగిఁ జుఱువుచ్చఁదొడఁగిన స్రుక్కి యమ్మకరి దేహంబులోపల ధృతి దీర డించి దాహంబుపెంపున ధరియింప రాక వఱువట్లు2033వట్టెడు వదనగహ్వరము తెఱచి ని2034ల్పుటయు నత్తెరువున వచ్చి క్రూరునక్రగ్రాహఘోర2035ప్రవాహ వారిపైఁబడుటయు వాయునందనుఁడు పెనఁచి త్రెంచిన దాని ప్రేవులు ముద్ద గొని వచ్చి చెచ్చెఱఁగుత్తుకఁదుఱిమె. నా లోన మకరియు“నాహార మఱుగఁ బోలదు పొ.”మ్మని బుద్ధిఁజింతించి పరవశ యగుటయుఁ బవననందనుఁడు దరిఁజేర్చి మకరి నుద్ధతి వ్రచ్చి వెడలి 2036కోరి చూడఁగ నొప్పె ఘోరాంధకార దారుణనిర్ముక్తతరుణార్కు పగిదిఁ. బ్రళ2037యారుణోదగ్రబడబాగ్ని శిఖలు కలయఁబర్విన 2038నాఁటి ఘనపయోరాశి కరణి నమ్మకరి రక్తములతోఁబెరసి యరుణమై 2039కనుపట్టె నప్పు డా సరసి. యంత నా మకరియు నమరియై యమరి యంతరిక్షమున నుద్యద్విమానమున జలదంబులోపలఁ జపలత మాని మెలపొందు తిరమైన మెఱుపుచందమున నిలిచి మారుతిచేత నిజశాపముక్తి గలిగిన ముదమంది కపిముఖ్యు2040ఁజూచి “యో కపికుంజర! యో వానరేంద్ర! నీ కతంబున శాపనిర్ముక్తిఁగంటి; నే నింకఁబోయెద నింద్రలోకమున; కేను నీ కొకవార్త యెఱిఁగింపవలయు.’ నని మున్ను హనుమంతు నా2041కొలనికినిఁ బనిచిన కృతకతాపసిఁజూపి పలికె: “వానరోత్తమ! మునివరుఁడు గాఁ2042డితఁడు; వీని నమ్మకుమయ్య; వీఁడు రాక్షసుఁడు. చలమున దానవేశ్వరుని యోగమున బలియుఁడై నినుఁజంపఁబనిపూని వచ్చి యే నిందులో నున్కి యెఱిఁగి నాచేతఁ బూని నిన్ జంపింపఁ బుత్తెంచినాఁడు. వీఁడు2043వధ్యుఁడు నీకు; వీని నమ్మకుము; వీఁడొప్పఁ;డిట వీని వేవేగ చంపి పొ మ్మౌషధములకు భుజశక్తి మెఱసి; యిమ్ముల ద్రోణాద్రి కిదె త్రోవ నీకు.” |