| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నెడపనికడఁకతో నిట కాలనేమి కడ వచ్చి నిలిచె నా కపికులోత్తముఁడు. నప్పు డప్పాపాత్ముఁడచల సమాధిఁ దప్పకయున్న చందమునఁగూర్చుండి 2052యొడలిపూరంబుతో నురమెల్ల విచ్చి నడుము నిక్కించి యానన మొప్ప వంచి కపటచింతావృత్తిఁగన్నులు మూసి జపమాల వరుస పూసలు త్రోసి త్రోసి నిక్కంపుజపముగా నెఱి నోరు గదల 2053నక్కలిఁగను విచ్చి హనుమంతుఁజూచి: “యీ యున్న మడు వేడ; యీ తడవేడ? పోయినపని యెంత; ప్రొద్దెంతవోయె? నొలసి నీ మదిలోన నుపదేశవాంఛ గలదేని గురుపూజ గలదె యేమైన మాకిప్పు”డనవుడు మారుతాత్మజుఁడు: “నీకిదె గురుపూజ; నెమ్మిఁగొ.”మ్మనుచుఁ బ్రథననిష్ఠురుఁడు నిర్భర2054వృత్తి వాని పృథుబాహుమధ్యంబుఁ బిడికిటఁబొడిచె. నక్షణంబున దైత్యుఁ డా రూపముడిగి పక్షియై రణవీథిఁ బావనిఁగదిసెఁ. గదియుటయును బట్టి కడిమి దీపింపఁ జదిపి ఱెక్కలు రెండు సరి ద్రుంచి వైచె. నా రూపముడిగి మాయాశక్తి మెఱసి ధీరసింహాకృతి దివికి లంఘించి గర్జించి దంష్ట్రలఁగడు నుగ్రుఁడగుచుఁ దర్జించి రణవీథి దర్పించె నసుర. యలయక హనుమంతుఁడక్కాలనేమి తల బిట్టువగుల నుద్ధత2055ముష్టిఁబొడిచెఁ; బొడిచిన నా రూపుఁబోనిచ్చి యసుర కడఁగి సుగ్రీవుఁడై కదియ నేతెంచి: “యిది యేమి మారుతి! యిచట నేమిటికిఁ? బద పద, లక్ష్మణుప్రాణముల్ వచ్చెఁ. దొలఁగక నీవింక ద్రోణాద్రి కరుగ వల దౌషధంబులు వలదింక2056మనకు. ననవుడు హనుమంతుఁడతఁడు సుగ్రీవు డని చూచి తెలిసి కాఁడని నిశ్చయించి యలిగి రాక్షసు2057నుర మదరంట వ్రేయ నిలఁగూలి మూర్ఛిల్లి యింతలోఁదెలిసి యతఁడును శతశృంగుఁడై విల్లు దాల్చి యతిశాతశరముల2058నడరి నొప్పింప ముష్టిఘట్టనముల మొగిఁబాదహతుల నష్టసత్త్వునిఁజేసి నలిఁజిక్కువఱిచి యమితసత్త్వక్రీడ2059నవలీలఁదిగిచి కమలనాళముఁద్రెంచు గంధసింధురము పరుసున రాక్షసప్రవరు మస్తకముఁ దెరలిచి వెస నుల్చి త్రెంచిపో వైచి నలి నేచి వెస సింహనాదంబు సేసి తొలఁగక మారుతి ద్రోణాద్రి కరిగె. నరిగి యా గిరిమీఁద నౌషధలతలు పరికించి పరికించి పవననందనుఁడు బహు2060దివ్యలతికా విభాభాసమాన మహిమయు నిర్మలమణిగణప్రభల దీపవృక్షంబులదీప్తులు ఁబర్వి దీపించు నక్కొండఁద్రిమ్మరి చూచి: “హితపుష్పగంధంబు లివె లత.”లనుచు నతఁడు డగ్గఱిపోవ నవి డాఁగిపోయె. నంత నా హనుమంతుఁడంతరంగమునఁ జింతించి సంతాపచిత్తుఁడై పలికె: “నో పర్వతాధీశ! యో యద్రిరాజ! యో పుణ్య2061వర్తన! యో గిరిచంద్ర! యనఘుండు రఘురాముఁడౌషధంబులకుఁ బనిచిన వచ్చితిఁబనిపూని యేను. నిన్నిలోకములకు హితవైన పనికి నన్నేలవంచింప నగరాజ! నీకు? నడరి నీ యందున్న యౌషధలతలు పొడసూపు వేవేగఁబోఁబని గలదు. ఇమ్ముల నిది లోకహితకార్యమగుట మిమ్ము వేఁడెద;2062మీరు మీ ప్రభా2063వములు దీపింపుఁడీ యోషధీలతలార! చూపుఁడీ నాకు మీ సురుచిరాకృతుల!” నని పల్క వంచన నపుడు తేజములు పొనుపడఁదన కవి పొడసూపకున్న: “నగకులోత్తమ! నీవు నా రాక సూచి తగుఁబ్రియం బొనరింపఁ; దగ దూరకునికి.” నని తన్నుఁబ్రార్థించి యడుగుచునున్న తనకు నౌషధములు ధరణీధరంబు చూపకుండుటయును జూచి యెంతయును గోపించి వానరకులవజ్రపాణి: “యే నెంతవేఁడిన నేల నీ మనసు నానదు నాయెడ నగకులాధముఁడ! తలకొని ఱాలకు దయగల్గు2064మన్నఁ గలుగునే గుణశూన్యకఠిన2065మూర్తులకు?’ నని యుగ్రకోపాగ్నులంగరోమములఁ గనదగ్నికీలలై క్రమ్మ2066నందంద రాముతో నెదిరిన రావణాచలము నీ మెయిఁబెఱుకుదు నిఁక ననుమాడ్కి దశయోజనముల విస్తారంబుఁబంచ దశయోజనోన్నతత్త్వంబును గలుగు నాభీలతరశైల మవలీలఁబెఱికె భూభాగ మగల నభోభాగ మద్రువ. |