| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నపు డా గిరి సురేంద్రుననుమతిఁగాచు తపనతేజులు త్రయోదశకోటిసంఖ్య గలచిత్రసేనాదిగంధర్వ 2067పతులు బలశౌర్యములు మీఱఁబావనిఁజూచి: “యిది దివ్యగణవాస; మిది మేరుతుల్య; మిది జగజ్జీవనం; బిది నీకు వలదు. నీ కిది దక్కదు నెఱి డించి పొమ్ము; పోకున్నఁబ్రాణముల్ పోకుండ.”వనినఁ గదనోగ్రసమవర్తి కపివీరుఁడలిగి వదలనికడిమిమై వారి నీక్షించి బంధురంబగు వాలపాశంబుతోడ బంధించి బంధించి 2068బలువిడి ద్రిప్పి యలుకమైఁగొందఱ నబ్ధిలో2069వైచె; నలుకమైఁగొందఱ నడరి 2070కారించె; నలుకమైఁగొందఱ నదరంట2071వ్రేసె; నలుకమైఁగొందఱ నవనిపైఁ2072గూల్చె. నా మహావీరునుద్ధతశక్తిఁజూచి సోమింపరాదని స్రుక్కి కేల్మొగిచి: “యో కపికుంజర! యో వానరేంద్ర! యీ కొండఁగొని యేఁగు మెలమితో నీవు.” నని వాయునందను నర్థి దీవించి వినుతించి గంధర్వవీరులు దొలఁగ నధికసత్త్వోన్నతి ననిలనందనుఁడు కుధరంబు బిట్టెత్తికొని 2073మింటి కెగసి కడువేగమున భయంకరవృత్తి దోప నడరి జితారాతియై సొంపు మిగిలి |